JANASENA Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 ఇంటర్నెట్‌డెస్క్ : డీమానిటైజేషన్ దెబ్బకు ఇబ్బందిపడ్డ మధ్యతరగతి వర్గాలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వరాల జల్లు కురిపించారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు 10శాతం పన్ను శ్లాబ్‌లోకి వచ్చేవారు. దీన్ని 5 శాతానికి పరిమితం చేశారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపు దారుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరుతుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు పన్ను పరిధిలోకి వచ్చే రూ.50,000కు గాను రూ.2,500 పన్ను చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి కూడా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అంటే, రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక్కడ సెక్షన్ 80సీ నిబంధనను ఉపయోగించుకుంటే మరో రూ.1,50,000 మీద పన్ను తగ్గుతుంది. రూ.5 లక్షలకు మించి ఆదాయం పొందే వారికి రూ.12,500 అదనపు లబ్ధిని ఇస్తున్నారు. ఈ మినహాయింపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. దీనిని పూడ్చుకోవటానికి రూ.50లక్షలకు పైబడి రూ.కోటి లోపు ఆదాయం ఉన్నవారిపై మరో 10శాతం సర్‌ఛార్జి విధించారు. రూ. కోటి పైబడిన ఆదాయం ఉన్నవారు 15శాతం అదనపు సర్‌ఛార్జి చెల్లించాలి. రూ. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు ఒక్కపేజీలో రిటర్న్ సమర్పించే అవకాశం కల్పించారు. గృహ కొనుగోళ్ల ప్రోత్సాహకంగా.. జీడీపీలో ముఖ్య భాగమైన స్థిరాస్తి రంగానికి వూపు ఇచ్చేందుకు కీలక నిబంధలను ఆర్థికమంత్రి సవరించారు.క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు పొందాలంటే ఇప్పటి వరకు సదరు స్థిరాస్తిని మూడేళ్ల వరకు విక్రయించకుండా ఉండాలి. దీనిని ఇప్పుడు రెండేళ్లకు కుదించారు. దీంతో గృహ క్రయవిక్రయాలు జోరందుకోవటానికి అవకాశం ఉంది. మధ్యతరగతి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
zoolakataka_14 Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 at least some relief for our people from these demonetization effect Quote Link to comment Share on other sites More sharing options...
nandananditha Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.