Jump to content

సమయమొస్తే.. రోశయ్యను దించుతాం: జగన్ వర్గం


chowdary10

Recommended Posts

మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం అనంతరం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్న రోశయ్య.. నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనుచర వర్గం బాహాటంగా విమర్శలకు దిగింది. ఇప్పటికైనా ఆయన స్థాయికి.. హోదాకు తగినట్టు నడుచుకోకుంటే తగిన గుణపాఠం చెప్పక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రపై ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్‌లో ఒక మాట.. ఢిల్లీలో ఒక మాట మాట్లాడటం పట్ల జగన్ వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై జగన్ ప్రధాన మద్దతుదారుడు అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

అలాగే, మరో అనుచరుడు గట్టు రామచంద్రరావు పార్టీ నాయకత్వ పోకడలతో పాటు.. గల్లీలో కూడా పట్టులేని సీనియర్ నేతల ధోరణిని ఎండకట్టారు. ప్రధానంగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, శంకర్ రావు, ఆర్.దామోదర్ రెడ్డి, వి.హెచ్.హనుమంతరావు వారు చేసిన విమర్శలపై ఎదురుదాడికి దిగారు.

గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన ఓదార్పు యాత్రకు హాజరైన పలువురు వైఎస్ వర్గీయులు చేసిన వ్యాఖ్యలు అధిష్టానంతో తలపడేందుకు సై అంటున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి తీరును ఎండగడుతున్నారు. పద్దతి మార్చుకోకుంటే కుర్చీ నుంచి దిగిపోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

వైఎస్ తొలి వర్థంది వేడుకలు కూడా జరుగక ముందే.. రోశయ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు అధిష్టానం అనుమతి ఇచ్చిందా అని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఓదార్పు యాత్రకు అనుమతి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రోశయ్యలు ప్రదర్శించిన వైఖరిపై కూడా వారు మండిపడ్డారు.

ఎన్నికల్లో గెలవలేని రోశయ్యను ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేస్తే ఆయన విశ్వాస ఘాతకుడిగా మారారని పలువురు నేతలు బాహాటంగానే దుయ్యబట్టారు. రోశయ్య నక్కజిత్తులు ప్రదర్శిస్తూ జగన్‌ను అణచి వేయాలని చూస్తున్నా అది సాధ్యం కాదని అనంతపురం జిల్లాకు చెందిన నేతలు హెచ్చరించారు. వైఎస్‌ భిక్ష వల్ల వచ్చిన పదవిని కాపాడుకునేందుకు జగన్‌ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

అలాగే, కేంద్ర రాష్ట్రాల్లో సోనియా వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని నేతలు చెప్పడాన్ని వారు తప్పుబట్టారు. ఇదే నిజమైతే కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్రలలో పార్టీ ఎందుకు చిత్తుగా ఓడిపోయిందని వారు ప్రశ్నించారు. జగన్‌ను పార్టీ దూరం చేసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి కాక తప్పదని వారు హెచ్చరించారు.

మొత్తం మీద ఓదార్పు యాత్ర కారణంగా ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెస్ అధిష్టానంపై జగన్‌ వర్గానికి ఉన్న ఆక్రోశం, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో తమపై చర్య తీసుకుంటే.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు హెచ్చరికలు తేటతెల్లం చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

CONGRESS NI NAASHANAM CHEYYATAM NEE CHETI LO NE UNDI RAA JAGAN GA..........
         
        MADAMA TIPPAVADDU.........KEEP GOING RAA *u( *u(

Link to comment
Share on other sites

×
×
  • Create New...