JANASENA Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 ఇంటర్నెట్ డెస్క్: ‘లోకనాయకుడు’ కమల్‌హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం’ రెండో భాగం గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ అవి వాస్తవరూపం దాల్చలేదు. తాజాగా ‘ విశ్వరూపం 2’ హిందీ, తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. తొలిభాగాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కిందని ఈ సినిమా కోసం కమల్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ‘విశ్వరూపం’ తొలిభాగం విడుదల అనంతరం వెంటనే రెండో భాగం విడుదల కావాల్సి ఉన్నా ఆర్థిక కారణాలు చుట్టు ముట్టడంతో నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ప్రాజెక్టును పక్కనబెట్టారు. ఈ సమయంలోనే కమల్ కొత్త సినిమా ‘శభాష్‌నాయుడు’ ప్రారంభించినా, మధ్యలో ఆయన కాలికి దెబ్బ తగలడంతో షూటింగ్ వాయిదాపడింది. దీంతో ‘విశ్వరూపం 2’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభంకావడం అభిమానులకు ఆనందం కలిగించేదే. తొలిభాగం విడుదల సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వర్గం తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ తమిళనాడులో విడుదలకానీయబోమని ప్రకటించారు. దీంతో పాటు మరికొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 Waiting for this since four years Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.