Jump to content

విశాఖ కేంద్రంగా హవాలా  రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం


TampaChinnodu

Recommended Posts

విశాఖ కేంద్రంగా హవాలా 
రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం 
స్థానిక బ్యాంకులో 30 ఖాతాలు ప్రారంభం 
వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమ 
రూ.569.93 కోట్లు సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలింపు 
కోల్‌కత, వైజాగ్‌లలో డొల్ల కంపెనీలు 
నిందితుడు 24 ఏళ్ల యువకుడు 
బ్యాంకు అధికారులతో కుమ్మక్కు 
ఓ బడా రాజకీయ నాయకుడి హస్తంపై అనుమానం? 
ఈనాడు - విశాఖపట్నం 
12hyd-general1a.jpg

విశాఖపట్నంలోని ఓ బ్యాంకు కేంద్రంగా ఓ యువకుడు రూ.1,500 కోట్ల భారీ హవాలా వ్యాపారం చేశాడు. తన పనిని చాలా వరకు పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 9వ తేదీ నుంచి పెద్దఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడని గుర్తించారు.

అక్రమంగా డబ్బు పంపడంలో దిట్ట... 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్‌ క్రషర్‌ యజమాని వడ్డి శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ (24). హవాలా లావాదేవీలు నడిపించడంలో ఆరితేరాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాంకు ఖాతాల ద్వారానే డబ్బును నేరుగా విదేశాలకు పంపించేయడంలో దిట్టగా మారాడు. వ్యాపారులకు అతనిపై బాగా నమ్మకం కుదిరింది. భారీ మొత్తాల్ని పంపడానికి అతన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి నిర్ణీత రుసుములను చెల్లించకుండా కోట్లాది రూపాయల్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు పంపేసి నల్ల కుబేరుల ధనాన్ని తెలుపు చేసి పెడుతూ ప్రతిఫలంగా భారీఎత్తున కమీషన్లను దండుకుంటున్నాడు.

ఒకే ఖాతాలో రూ.570 కోట్ల జమ 
అతడి హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంకు అధికారులు కూడా సహకరించారు. గతేడాది కేంద్రం నోట్ల రద్దు చేయడం కూడా అతనికి కలిసొచ్చిందో? ఏమో? అతని అక్రమ వ్యాపారం పతాకస్థాయికి చేరింది. విషయం ఐటీ అధికారుల చెవిన పడింది. అతడు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై నిఘా పెట్టగా కోల్‌కతాలోని డొల్ల కంపెనీల నుంచి విశాఖలోని ఖాతాలకు నగదు చేరుతోందని గుర్తించారు. విశాఖలోని ఒకే ఒక్క బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.570 కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్లు తేలింది. అదే ఖాతాకు మరో రూ.90 కోట్లు ఒకేసారి జమయింది. మహేష్‌ మొత్తం రూ.1,500 కోట్ల వరకు హవాలా నడిపించినట్లు ప్రాథమికంగా తేల్చారు.

ఈడీ అధికారులకు సమాచారం: ఆయా లావాదేవీల సరళి చూసి నివ్వెరపోయిన ఐటీ అధికారులు కుంభకోణం మూలాలు లోతుగా ఉన్నాయని గుర్తించి బృందాలతో రంగంలోకి దిగారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కోల్‌కతాలోని డొల్ల కంపెనీలపై దాడులు చేసి పలువుర్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో దాడులు చేసి అన్నింటికీ మూలకారణం వడ్డి మహేశ్‌ అని తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా నుంచి డొల్ల కంపెనీల ద్వారా విశాఖలోని బ్యాంకులకు వచ్చిన నిధులు తిరిగి సింగపూర్‌, బ్యాంకాక్‌, మలేషియా, హాంకాంగ్‌, చైనాలకు తరలించినట్లు తేల్చారు. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తేలడంతో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌’ అధికారులకు విశాఖ ఐ.టి. అధికారులు సమాచారమిచ్చారు. వారు కూడా రంగంలోకి దిగి విశాఖ నుంచి ఏయే దేశాల బ్యాంకుల శాఖలకు నిధులు వెళ్లాయి... ఖాతాదారులు ఎవరన్నది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

బ్యాంకు అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రధాన నిందితుడు మహేశ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కూపీ లాగగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కొందరిని చూపించారని నిర్ధారించారు. విశాఖ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయగా... వడ్డి మహేశ్‌ తమ బంధువేనని... తాము లారీ క్లీనర్లుగా జీవిస్తూ పొట్టపోసుకుంటున్నామని చెప్పారు. చాలా కాలం కిందట తమతో పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడని... ఎందుకు చేయించుకున్నాడన్న వివరాలు మాత్రం తమకు తెలియవని చెప్పారు.

వడ్డి మహేశ్‌పై కేసు నమోదు చేశాం.... 
- టి.యోగానంద్‌,నగర పోలీసు కమిషనర్‌, విశాఖ 
వడ్డి మహేశ్‌ హవాలా లావాదేవీలకు, మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసి ఐ.టి.అధికారి ఎం.వి.ఎన్‌.శేషుభావనారాయణ ఫిర్యాదు చేయడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశాం. మహేశ్‌ 2014 నుంచి హవాలా వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. అతడితో పాటు తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్‌, ఆచంట రాజేశ్‌, ప్రశాంత్‌కుమార్‌ రాయ్‌ బర్మన్‌, ప్రవీణ్‌కుమార్‌ ఝా, ఆయుష్‌గోయల్‌, వినీత్‌గోయంకా, వికార్‌గుప్తా కుమ్మక్కయ్యారు. విశాఖ కేంద్రంగా 12 డొల్ల కంపెనీల్ని స్థాపించి 30 బ్యాంకు ఖాతాల్ని తెరిచారు. వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమకాగా రూ.569.93 కోట్లు సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలిపోయింది. విదేశాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మహేశ్‌ వెనక ఎవరైనా సూత్రధారులున్నారా? ఆరా తీస్తున్నాం. ఎవరైనా రాజకీయ నాయకుడో? బడా పారిశ్రామికవేత్త హస్తమో? ఉండొచ్చన్న అనుమానాల్ని కొట్టి పారేయలేం.

Link to comment
Share on other sites

Singapore laga kadutha ante emo anukunna...Singapore paisal idaki patkochudani ani ardam kaledu....

enthaina, Chandral Saar ki manchi vision vundi

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Singapore laga kadutha ante emo anukunna...Singapore paisal idaki patkochudani ani ardam kaledu....

enthaina, Chandral Saar ki manchi vision vundi

ee case lo ikkadi dabbulu vere countries ki poyayi. 

Link to comment
Share on other sites

21 minutes ago, reality said:

Singapore...China...Badaa Nayakudu...sCo_^Ydamn

notes ban case lo okkadu kooda lopatiki pole. same here too. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...