Jump to content

వ్యూహాత్మకంగానే వెనుకడుగు..?!!: వేడి తగ్గిన &q

canny surya

Recommended Posts

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ఓదార్పు యాత్ర వేడి తగ్గింది. ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టిన ఓదార్పు యాత్ర.. తొలి రోజు పూర్తిగా చప్పగా సాగింది. రెండు మూడు రోజులు వాడివేడిగా సాగింది. దీనిపై వైఎస్ వ్యతిరేక వర్గాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అటు కాంగ్రెస్‌లోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ప్రకంపనలు చెలరేగాయి.

అదేసమయంలో జగన్ అనుకూల వర్గం మాత్రం వైఎస్ వ్యతిరేక శక్తులను తూర్పారబట్టాయి. పనిలోపనిగా ముఖ్యమంత్రి రోశయ్య తీరును ఎండగట్టారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పలుకరించేందుకు జగన్ వెళితే.. ముఖ్యమంత్రి పదవి కోసం మరికొంత కాలం ఆగివుంటే బాగుంటుందని రోశయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రోశయ్య లాంటి అనుభవశీలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి.

పైపెచ్చు జగన్ వర్గం రోశయ్యపై బాహాటంగానే ఎదురుదాడికి దిగింది. దీంతో రాష్ట్ర రాజకీయాల వేడి ఒక్కసారి తారాస్థాయికి చేరాయి. పరిస్థితులు చేయిదాటి పోయే సూచనలు కనిపించడంతో రోశయ్య మౌనం పాటించారు. ఈ నేపథ్యంలో తన లండన్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్ వీరప్ప మొయిలీ.. ఆగమేఘాలపై పార్టీ అధినేత్రితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

వెంటనే కార్యరంగంలోకి దిగి తన వ్యూహాలకు పదును పెట్టారు. ఆ మరుక్షణమే జగన్ ఓదార్పు యాత్రలో రాజకీయ వేడి తగ్గిపోయింది. ఎలాంటి విమర్శలు లేకుండా ముందుకు సాగుతోంది. దీనికి కారణం లేకుండా ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ పెద్దలు జగన్ కుటుంబ సన్నిహితుడు డాక్టర్ కె.వి.పి.రామచంద్రరావు, వైఎస్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిలకు స్వయంగా ఫోన్ చేసి మంతనాలు జరిపారు.

ఫలితంగా జగన్‌ దూకుడుకు కెళ్లెం వేసేలా చేశారు. కేవీపీతో పాటు తల్లి చెప్పడం వల్ల జగన్ వ్యూహాత్మక వెనుకడుగు వేశారు. అయితే.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మాత్రం భవిష్యత్‌లో జగన్ అధిష్టానంతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి.

Link to comment
Share on other sites

[quote author=canny surya link=topic=81354.msg859673#msg859673 date=1279104253]

[/quote]

Link to comment
Share on other sites

×
×
  • Create New...