Jump to content

విజయవాడ మెట్రోపై వెనుకడుగు

TampaChinnodu

Recommended Posts

15 minutes ago, idibezwada said:

neyavva comedy...nuvvu tenali ending nunchi guntur startingki lekkalu septav endi..tenali - Lakshmipuram (assuming it as main center of guntur)  as center.@3$%

ok Bro. 

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    22

  • Annayya_fan

    15

  • TOM_BHAYYA

    12

  • idibezwada

    9

Top Posters In This Topic

On 6/1/2017 at 5:43 PM, TOM_BHAYYA said:

Ltt for metro expert @dalapathi

స్వరాష్ట్రంలో మెట్రో చకచకా

Sat,June 3, 2017 02:16 AM

-82 శాతం పూర్తయిన ప్రాజెక్టు
-టీఆర్‌ఎస్ ప్రభుత్వ చొరవతో తొలగిన అడ్డంకులు 
-ఈ ఏడాది చివరినాటికి పరుగులకు సిద్ధం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలు, గిట్టనివారు చేసిన దుష్ప్రచారాలు పటాపంచ లవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితంగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అనే అనుమానాలు తలెత్తగా, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో అవాంతరాలన్నీ దాటుకొని పనుల పూర్తివైపు పరుగులు పెడుతున్నది. 2012 జూన్‌లో మెట్రో పనులు ప్రారంభం కాగా, ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పనులు అంతంత మాత్రంగానే జరిగాయి. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కీలక అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేసింది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేరుగా ఢిల్లీకి వెళ్లి అనుమతులు సాధించడంలో సఫలమయ్యారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు దాదాపు రైలు పరుగులు పెట్టే దశకు చేరుకున్నాయి. 
 
ఈ ఏడాది చివరికి రెండు కారిడార్లు

ప్రస్తుతం 82 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి రెండు కారిడార్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో చకచకా పనులు సాగుతున్నాయి. పిల్లర్లు తదితర పనులు పూర్తికాగా విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థల పనులు జరుగుతున్నాయి. కారిడార్-3కి సంబంధించి నాగోల్-మెట్టుగూడ (8 కిలోమీటర్లు) మార్గం ఇప్పటికే పూర్తికాగా, కారిడార్-1లోని మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ (11కిలోమీటర్లు) పను లు పూర్తయ్యి సేఫ్టీ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నది. ఉప్పల్, మియాపూర్ డిపోలు పూర్తయ్యాయి. ఫౌండేషన్స్ 89 శాతం పూర్తై 64 కిలోమీటర్లల పొడవున నిర్మించగా, వయడక్ట్ 75 శాతం మేర 72 కిలోమీటర్లు పూర్తయింది. 61 కిలోమీటర్ల మేర 85 శాతం పిల్లర్లు వేశారు. ఈ ఏడాది చివరినాటికి మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ 29 కిలోమీటర్లు, నాగోల్- హైటెక్‌సిటీ కారిడార్ 27 కిలోమీటర్ల మేర ప్రయాణానికి సిద్ధం కానున్నది.
metro 

ఆర్వోబీలకు అనుమతులు

ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉన్నది. ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా కేం ద్రం నుంచి ఆర్వోబీలకు అనుమతులు రాలేదు. ట్రాఫి క్ బ్లాక్ చార్జెస్ పేరుతో పెండింగ్‌లో ఉంచింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ 2015 జనవరి 1న రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో సమావేశమై చర్చించారు. సీఎం చొరవతో అనుమతులు వచ్చాయి. దీంతో మొదటి విడతలో ఓలిఫెంటా, ఆలుగడ్డబావి, చిలుకలగూడ ఆర్వోబీ పనులు ఊపందుకున్నాయి. చిలుకలగూడ ఆర్వోబీ పూర్తికాగా మరో రెండు ఆర్వోబీలు చివరిదశలో ఉన్నాయి. ట్రాఫిక్ బ్లాక్ చార్జెస్ పేరుతో ఒక్కో ఆర్వోబీకి రూ.8 నుంచి 10 కోట్లు చెల్లించాలని రైల్వేశాఖ పట్టుబట్టగా, మంత్రి కేటీఆర్ కేంద్రంతో మాట్లాడి రూ.కోటి చెల్లించేలా ఒప్పించగలిగారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది.
 
ప్రపంచస్థాయి సౌకర్యాలు

మెట్రోరైలుతో ప్రజలకు ప్రయాణ సౌకర్యంతోపాటు నగరానికి ప్రపంచస్థాయి లుక్ వచ్చేలా నిర్మించాలన్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. కిలోమీటరుకు ఒక్కో మెట్రోస్టేషన్ ఉండగా స్టేషన్ల మధ్యలో అందమైన పూలు, ఔషధ మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌నగర్-కేపీహెచ్‌బీ స్ట్రెచ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. మెట్రోరైలు పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగంలోకి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు యోగా, ఆటస్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. స్ట్రీట్ ఫర్నిచర్‌ను ఏర్పా టు చేస్తున్నారు. కూరగాయలు మార్కెట్లు, స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అన్నివర్గాలు, అన్ని వయస్సులవారికి ఉపయోగపడేలా కారిడార్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికులకు ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం కల్పించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచేలా సైకిళ్లు, ఫీడర్ బస్సులు, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ బైక్స్, టాక్సీలు ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా నగరంలో 400 బైక్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న నిర్ణయాలే. అంతర్జాతీయంగా వివిధ అంశాలపై అవగాహన ఉన్న మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మెట్రో వీటిని సమకూర్చుకుంటున్నది. నగర ప్రయాణాన్ని కామన్ టికెట్ మీద నడిచేట్టు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మెట్రో, సిటీ ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లకు కలిపి ఒకటే టికెట్‌పై ప్రయాణించేలా కార్డులు అందుబాటులోకి తేనున్నారు. ఈ కార్డులతో షాపింగ్ కూడా చేసే సౌలభ్యాన్ని అందించనున్నారు.
project 

భూసేకరణ సమస్యకు పరిష్కారం

ప్రాజెక్టుకు భూసేకరణలో పలు చిక్కులు ఉండేవి. వీటిని పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడంతోపాటు, పలు కీలక అంశాల్లో ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వ సహకారంతో వివాదాలతో పెం డింగ్‌లో ఉన్న అనేక ఆస్తులను సేకరించారు. బేగంపేటలోని జబ్బార్ బిల్డింగ్స్, అమీర్‌పేట్‌లో సారథి స్టూడియో స్థలం, సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయంలో, పాత గాంధీ దవాఖాన భవనం, బేగంపేటలోని కంట్రీక్లబ్, లైఫ్‌ైస్టెల్ తదితర ఆస్తు లు, గ్రీన్‌ల్యాండ్స్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 3 వరకు ఉన్న 4.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించిన భూసేకరణ పూర్తయింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని న్యాయ సహాయం అందించడం తో అడ్డంకులు తొలగాయి. భూసేకరణకు సంబంధించి మొత్తం 3 వేల పెండింగ్ కేసులు ఉండగా అందులో గత ప్రభుత్వాలు 1,300 ఆస్తులు సేకరించగా, తెలంగాణ వచ్చాక 1,400 కీలక ఆస్తులను సేకరించగలిగింది.
 
ప్రభుత్వ చొరవతోనే పనుల్లో వేగం

గతంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వ చొరవతో వేగం పుంజుకున్నాయి. భవిష్యత్ అవసరాలు, నగర ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అదేశాలు, సూచనలకు అనుగుణంగా నిర్మిస్తున్నాం. ప్రపంచస్థాయి సౌకర్యాలు, ప్రయాణికుల అవసరాలకు పెద్దపీట వేస్తున్నాం. ప్రస్తుతం స్టేషన్లపైన ఎలక్ట్రిఫికేషన్ సిగ్నలింగ్ పనులు జరుగుతున్నాయి.
- ఎన్వీఎస్ రెడ్డి, మెట్రోరైలు ఎండీ
Link to comment
Share on other sites

On 6/1/2017 at 5:20 PM, TampaChinnodu said:

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేవలం 12 కిలోమీటర్ల దూరం కోసం రూ.ఏడు వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు అవసరమా అనే దానిపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మెట్రోతోపాటు పలు అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో లైను కంటే ఈ 12 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలోనూ రెండు లేయర్ల బ్రిడ్జిని నిర్మిస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో మెట్రో బదులు రెండు లేయర్ల ఫ్లైఓవర్‌ నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రుణ పరిమితిని రూ.1859 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు పెంపుపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టు అనవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండు మెట్రో కారిడార్ల స్థానంలో రెండు లేయర్ల బ్రిడ్జి నిర్మిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చవుతుందనే దానిపై ప్రతిపాదనలు తీసుకు రావాలని పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖలో కారిడార్ల దూరం ఎక్కువ కాబట్టి అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించి, విజయవాడలో మాత్రం విరమించుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.కోటను ఖర్చు పెట్టడంతోపాటు భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇప్పించి, టెండర్లు పిలిచి, ప్రత్యేకంగా దానికోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అనవసరమనే ఆలోచనకు రావడం గమనార్హం. మొదటి నుంచి విజయవాడకు మెట్రో అవసరం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం కోట్లు కుమ్మరించిన తర్వాత మేల్కొని పునరాలోచన చేయడం విశేషం.

inthaa karchu chesthe kaani ..the so called visionary leader ki thatwam bodhapadaledannamata.....brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

On 6/1/2017 at 2:20 PM, TampaChinnodu said:

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేవలం 12 కిలోమీటర్ల దూరం కోసం రూ.ఏడు వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు అవసరమా అనే దానిపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మెట్రోతోపాటు పలు అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో లైను కంటే ఈ 12 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలోనూ రెండు లేయర్ల బ్రిడ్జిని నిర్మిస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో మెట్రో బదులు రెండు లేయర్ల ఫ్లైఓవర్‌ నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రుణ పరిమితిని రూ.1859 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు పెంపుపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టు అనవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండు మెట్రో కారిడార్ల స్థానంలో రెండు లేయర్ల బ్రిడ్జి నిర్మిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చవుతుందనే దానిపై ప్రతిపాదనలు తీసుకు రావాలని పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖలో కారిడార్ల దూరం ఎక్కువ కాబట్టి అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించి, విజయవాడలో మాత్రం విరమించుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.కోటను ఖర్చు పెట్టడంతోపాటు భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇప్పించి, టెండర్లు పిలిచి, ప్రత్యేకంగా దానికోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అనవసరమనే ఆలోచనకు రావడం గమనార్హం. మొదటి నుంచి విజయవాడకు మెట్రో అవసరం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం కోట్లు కుమ్మరించిన తర్వాత మేల్కొని పునరాలోచన చేయడం విశేషం.

ippudu kakapoyina malli oka 7-8 yrs ayyaka metro ni revisit cheyyaka thappadu gaa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...