TampaChinnodu Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 హైదరాబాద్: కూకట్ పల్లి సబ్ రిజిష్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు బహిర్గతం చేశారు..హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందకోట్లకు పైగా ఆస్తులను ఆయన కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది..అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల సొమ్మును చాకచక్యంగా కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన కంపెనీల్లోకి శ్రీనివాసరావు మళ్లించినట్లు ఏసీబీ సోదాల్లో స్పష్టమైంది. తన కుమారుడు కనిష్క్ పేరిట శ్రీనివాసరావు వివిధ బ్యాంకుల్లో 12 ఖాతాలు తెరిచి లావాదేవీలు పూర్తిచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.. నాలుగు కంపెనీల్లో సుమారు 12కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెలితే... మియాపూర్ భూముల కేసులో అరెస్టయిన కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఇప్పటికే శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మియాపూర్ ల్యాండ్ స్కాంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న కోణంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో పదిచోట్ల సోదాలు నిర్వహించారు..శోభాగార్డెన్ వద్ద శ్రీనివాసరావు నివాసముండే సత్యసాయి ఎంక్లేవ్ లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరిపారు.. అలాగే కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులోని శ్రీనివాసరావు సోదరుడి ఇంటితో పాటు మరో ఎనిమిది చోట్ల ఏసీబీ సోదాలు జరిగాయి... మియాపూర్ లో ఉన్న 796 ఎకరాల భూమిని సబ్ రిజిస్ట్రార్ల సహకారంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన సంస్ధలకు సంబంధించిన వారు ఆక్రమించారు. ఈ ల్యాండ్ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. రిజిస్ట్రార్లే ప్రధాన పాత్ర పోషించారన్న కారణంతో పోలీసులు ఇప్పటికే ఆరుగురు రిజిస్ట్రార్లను ఈ కేసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ ల్యాండ్ స్కాంలో ఉన్న రిజిస్ట్రార్ల ఇళ్లపై ఇప్పటికే ఏసీబీ సోదాలు జరిపింది. అయితే ఈరోజు కూకట్ పల్లి రిజిస్ట్రార్ గా చేసి అరెస్టయిన శ్రీనివాసరావు ఇళ్లతో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు పెద్ద ఎత్తున జరిగాయి.. శ్రీనివాసరావు తన అక్రమ సంపాదనను వైట్ చేసుకోవడానికి తెలివైన పథకం వేశారు. తన కుమారుడు రాచకొండ కనిష్క్,మరికొందరు స్నేహితుల పేరిట కొన్ని కంపెనీలను 2013 నుంచి ప్రారంభించారు..అమ్యామ్యాల రూపంలో వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును ఈ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో దర్జగా మళ్లించారు.. కంపెనీలు...ఐకాన్ కన్ స్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్..8.50కోట్లు రూపాయలునార్త్ స్టార్ హోమ్స్ ..1.93కోట్ల రూపాయలుహసిని పవర్ ప్రాజెక్ట్..1.90 కోట్ల రూపాయలు మంజీరా హోల్గింగ్స్..50లక్షల రూపాయలు ఇవే కాదు..హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆరు ఇళ్ల స్ధలాలు, నర్సాపూర్ మండలం మూసాపేటలో 11 ఎకరాల వ్యవసాయ భూమిని శ్రీనివాసరావు కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో ఇప్పటి వరకు వెల్లడైంది..సోదాలు కొనసాగుతున్నాయని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు అంటున్నారు.. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 13, 2017 Author Report Share Posted June 13, 2017 100's of crores lo earnings. Business sesina antha earn seyyalem emo. Quote Link to comment Share on other sites More sharing options...
lucky7 Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 e lekkhana mana Amaravathi lo Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 10 minutes ago, lucky7 said: e lekkhana mana Amaravathi lo Babu gaari house lo no ఏసీబీ సోదాలు....aaa Quote Link to comment Share on other sites More sharing options...
lucky7 Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 1 hour ago, LordOfMud said: Babu gaari house lo no ఏసీబీ సోదాలు....aaa Yup u got it Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.