iamlikethis Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 కరాచి: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడిందంటూ ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ సారథి అమిర్ సోహైల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపాయి. దీంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. టోర్నీలో భాగంగా పాక్-ఇంగ్లాండ్ మధ్య తొలిసెమీఫైనల్ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్‌కు చెందిన ఓ వార్తా సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న అమిర్ సొహైల్ ఫైనల్ చేరిన పాక్ జట్టుపై ఆరోపణలు చేశాడు. ఇతరుల కారణంగా(జట్టులో లేనివాళ్లు)నే పాక్ టోర్నీలో మ్యాచ్‌లు గెలిచిందని ఆరోపించాడు. ప్రస్తుత జట్టు సారథి సర్ఫరాజ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడని అన్నాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ జట్టులోని ఆటగాళ్ల కృషి వల్లే విజయం సాధించామని ఎక్కడా చెప్పలేదు.. గమనించండి అని సోహైల్ పేర్కొన్నాడు. తమ విజయానికి ఎవరో సాయం చేశారన్న రీతిలోనే సర్ఫరాజ్ ఎప్పుడూ మాట్లాడేవాడు. దీంతో ఆట వెనుక ఏమి జరిగిందో మేమంతా వూహించగలం. జట్టు విజయానికి కారణమేమిటి అని అడిగినప్పుడల్లా... తాము చేసిన ప్రార్థనలు, అభిమానుల మద్దతు, దేవుడి దయ వల్లే అని చెబుతూ వచ్చాడు. బయటి శక్తుల కారణంగానే పాక్ ఫైనల్ చేరుకుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు... ఇక నుంచి క్రికెట్ ఆడండి అని సోహైల్ ఈ సందర్భంగా జట్టును కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుండటంతో పాక్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచుల్లో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన ఇంగ్లాండ్‌ను పాక్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన ఇంగ్లాండ్ జట్టుపై పాక్ విజయం సాధించడంతో సోహైల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత బలం చేకూర్చాయి. అయితే దీనిపై తాజాగా స్పందించిన సొహైల్ ‘ఈ వ్యాఖ్యలు పాక్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి ముందు చేసినవి’ అని వివరణ ఇచ్చాడు. టోర్నీలో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడంతో ఆ దేశ మీడియా పాక్ జట్టుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 17, 2017 Report Share Posted June 17, 2017 Believable... Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted June 17, 2017 Report Share Posted June 17, 2017 😀 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.