JANASENA Posted July 6, 2017 Report Share Posted July 6, 2017 ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతముఖ్యమో అందరికీ తెలుసు. భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి వాతావరణం పాత్ర ఎంతో ఉంటుంది. ప్రసార మాధ్యమాలు.. ప్రకటనల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోజనం మాత్రం కలగడం లేదు. వాతావరణ కాలుష్యాన్ని ముందే అర్థం చేసుకుని ఓ వ్యక్తి తన చిన్ననాటి నుంచే మొక్కల నాటడాన్ని హాబీగా చేసుకున్నారు. మొక్క నాటందే.. నిద్రపట్టని విధంగా ఆయన మారిపోయారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌కు చెందిన 60 ఏళ్ల అబ్దుల్ సామద్ షేక్ రిక్షా డ్రైవర్. రోజుకు అతని ఆదాయం రూ.100 లోపే. వచ్చినదాంతోనే తన కుటుంబాన్ని పోషించుకోవాలి. సామద్‌కు ప్రకృతి అన్నా.. మొక్కలన్నా ప్రాణం. రోజంతా కష్టపడితే వచ్చే అతి తక్కువ ఆదాయంలోనూ మొక్కలు నాటడానికి కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నాడు. తన 12వ ఏట నుంచే మొక్కలు నాటడాన్ని మొదలుపెట్టాడు. క్రమేణా అది ఆయనకు హాబీ అయింది. రోజుకో మొక్క నాటందే నిద్రపట్టని విధంగా సామద్ తయారయ్యారు. గత 48 ఏళ్లుగా ఆయన మొక్కలు నాటుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన 50వేలకు పైగా మొక్కలు నాటారు. అబ్దుల్ సామద్.. ‘ట్రీ సామద్’గా.. రోజూ ఫరీద్‌పూర్‌లోని నర్సరీకి వెళ్లడం.. ఓ మొక్కను కొనుగోలు చేసి తీసుకురావడం.. దాన్ని ఏదైనా ప్రభుత్వ స్థలంలో నాటడం.. గత కొన్ని దశాబ్దాలుగా ఇదీ సామద్ దినచర్య. అంతే కాదండోయ్ మొక్కను నాటి వదిలేయకుండా అవి కాస్త ఎదిగేవరకు వాటికి నీరు కూడా పోస్తున్నాడట. రోజుకో మొక్క నాటుతూ.. వాటి పరిరక్షణ చూస్తుండటంతో అబ్దుల్ సామద్ కాస్తా.. ‘ట్రీ సామద్’ గా మారిపోయారు. ఆయన నివసిస్తున్న ఫరీద్పూర్ ప్రాంతంలో ఆయన్ను అలాగే పిలుస్తున్నారు. అబ్దుల్ సామద్ది నిరుపేద కుటుంబం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ప్రస్తుతం రేకులతో వేసిన చిన్నపాటి షెడ్డులోనే ఆయన కుటుంబం నివసిస్తోంది. పర్యావరణ ప్రేమికుడిగా సామద్ చేస్తున్న కృషికి గుర్తింపుగా డైలీ స్టార్ సంస్థ రూ.80వేల చెక్కు అందజేసి ఘనంగా సత్కరించింది. సామద్ది ఇతరులకు సాయం చేసే వ్యక్తిత్వమని.. ఆపద ఉన్న వారు ఆయన వద్దకు వెళితే తనకు చేతనైన విధంగా సాయపడుతుంటాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted July 6, 2017 Report Share Posted July 6, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
vizagpower Posted July 6, 2017 Report Share Posted July 6, 2017 naaku kuda , oka vittanam natande nidra patadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.