Jump to content

మూసీ.. అందాలు విరబూసి


TampaChinnodu

Recommended Posts

మూసీ.. అందాలు విరబూసి 
రూ.1,665 కోట్లతో అభివృద్ధికి సర్కారు ప్రణాళిక 
రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చిన బ్యాంకులు 
నదికి రెండువైపులా సైక్లింగ్‌ ట్రాక్‌, నడకదారి 
అందమైన ఉద్యానాలు, ఆహ్లాదకర వాతావరణం 
టెండర్లు పిలవడానికి అధికారుల సన్నాహాలు 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 
12main2a.jpg

కాలుష్యానికి కేంద్రంగా మారిపోయిన మూసీ నదిని అందమైన విహార కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పచ్చని వనాలు.. పెద్దలు, పిల్లలు సేద తీరడానికి ఏర్పాట్లు.. సరదా కోసం బోటింగ్‌.. నడకదారి.. సైకిల్‌ మార్గం ఇలా ఒకటేమిటి అనేక హంగులు సమకూర్చాలని నిర్ణయించింది. గుజరాత్‌లోని సబర్మతి నదీతీరం మాదిరిగా దీనిని అభివృద్ధి చేయాలని తలపెట్టింది. ఒకనాడు మంచినీళ్లు ప్రవహించే మూసీ కొన్ని దశాబ్దాలుగా కాలుష్య కాసారంగా మారిపోయింది. దాదాపు 21 ప్రధాన డ్రైన్లకు సంబంధించిన మురుగునీరు ఇందులో కలుస్తోంది. దీనికితోడు ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర సంస్థలకు సంబంధించి వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలను తెచ్చి ఇందులో పారేయడం, పరిశ్రమలు కలుషిత జలాలను ట్యాంకర్లతో తెచ్చి పారబోయడం మామూలైపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. యుద్ధప్రాతిపదికన ఓ అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు. పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆరు నెలల్లోనే అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేశారు.

12main2c.jpg

ఇదీ ప్రణాళిక..: మూసీలోకి వస్తున్న మురుగునీటిని శుభ్రపరిచేందుకు 3చోట్ల శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

* మొదటిదశలో రెండుభాగాలు మూసీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు నదికి రెండువైపులా 23 కిలోమీటర్ల మేర రూ. 956.33 కోట్లతో అభివృద్ధి చేస్తారు.

* బాపూఘాట్‌ నుంచి గోల్నాక వరకు రెండువైపులా మరో 12 కిలోమీటర్ల మేర రూ. 708.97 కోట్లతో అభివృద్ధి చేస్తారు.

* రెండు రీచ్‌ల కింద టెండర్లను పిలుస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న హామీ మేరకు ఓ జాతీయ బ్యాంక్‌ ఈ పనుల కోసం రూ. 1,665 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 500 కోట్ల మేర నిధులను వినియోగించడానికి సిద్ధమవుతోంది.

12main2d.jpg

ఇవీ సౌకర్యాలు..: 
* నదిలో మూడు మీటర్ల ఎత్తులో ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. మొత్తం 74 చెక్‌ డ్యాంలను నిర్మిస్తారు.

* నది ఒడ్డున రెండువైపులా అయిదేసి మీటర్ల మేర పూర్తిగా పచ్చదనాన్ని పెంపొందిస్తారు. మూడేసి మీటర్ల వెడల్పులో నడకదారి, మరో మూడేసి మీటర్ల వెడల్పున సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు.

* పాదచారులు నది దాటడానికి మూడుచోట్ల ఉక్కు వంతెనలు నిర్మిస్తారు. బాపూఘాట్‌ దగ్గర 40 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానంగా తీర్చిదిద్దుతారు. కొన్నిచోట్ల బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తారు.

* ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా గండిపేట దగ్గర నాలెడ్జిపార్కు, ఎకో టూరిజం అభివృద్ధి ప్రాజెక్టు, ఆటల పార్కును ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 

Link to comment
Share on other sites

4 minutes ago, BostonBullodu said:

ilanti PPT's badulu ah rain padithe normal audience ki ibbandi kalagakunda charyalu teesukovadam.. 

looks like every party is getting ready for next election 

agreed. 1000 crores tho em avuthadi naa matta. 500 crores commissions/corruption ke pothadi.

Link to comment
Share on other sites

32 minutes ago, TampaChinnodu said:

agreed. 1000 crores tho em avuthadi naa matta. 500 crores commissions/corruption ke pothadi.

ilaanti panulu chesedi sagam nokkeyanike

Link to comment
Share on other sites

Just now, perugu_vada said:

Ayyedi ledu sachedi ledu, e bokkalo ppt's avasaram ah

roads bagu chesthe chalu ikada waste chesey kanna

Agreed. Spend that 1600 crores on improving roads. No need of this hype.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...