Jump to content

రోజుల తరబడి నీటిలో అపార్టుమెంట్లు, భవనాలు


TampaChinnodu

Recommended Posts

నాన్చొద్దు! 
రోజుల తరబడి నీటిలో అపార్టుమెంట్లు, భవనాలు 
పలుచోట్ల కుంగుతున్న ఫ్లోరింగ్‌, పునాదులు 
జాగ్రత్తలతో భద్రమంటున్న నిర్మాణరంగ నిపుణులు 
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, కూకట్‌పల్లి 
hyd-top2a.jpg

నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి.. రోజుల తరబడి రహదారులపై... వీధుల్లో.. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు నిల్వ ఉంటోంది. వాన పడితే చాలు ఇళ్లు ముంపు బారిన పడుతున్నాయి. నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మించుకోవడం... వాటి పక్కనే కట్టడాలు చేపట్టడంతో మునక తప్పడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి అపార్టుమెంట్లు, ఇళ్ల సెల్లార్లు, పునాదులు నీటిలో నానుతున్నాయి. పునాదుల్లో గట్టిదనం లోపించి రానురానూ నిర్మాణాలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది.

కష్టపడి సంపాదించుకున్న డబ్బును నీళ్లలో పోయలేం కదా..! ముందస్తు ఆలోచన లేకుండా మునక ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న గూడు నీళ్లలో మునక వేస్తుండటంతో ఆందోళన తప్పడం లేదు. వర్షం తెరపినిచ్చినా.. భవిష్యత్తులో నిర్మాణం/ఇంటిపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పునాదులు దెబ్బతినడంతోపాటు ఇంటి గోడలు బలహీనపడి త్వరగా కూలిపోయే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.

నగరంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నేళ్లుగా గరిష్ఠంగా 17 నుంచి 22 సెం.మీ.ల వర్షం కురుస్తోంది. చాలాప్రాంతాలు ముంపు బారిన పడి ఇళ్లల్లోకి.. వాటి చుట్టూ వర్షపునీరు నిల్వ ఉంటోంది. గతేడాది కురిసిన వర్షాలకి నిజాంపేట పంచాయతీ పరిధిలోని బండారి లేఅవుట్‌ను సుమారు 15 రోజులు వరద వదల్లేదు. ఈసారి మియాపూర్‌, నిజాంపేట, ఉప్పల్‌, రామంతాపూర్‌, అత్తాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉంటోంది. మల్కాజిగిరిలోని తూర్పు అనంద్‌బాగ్‌, ఎన్‌ఎండీసీ కాలనీ, పటేల్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పడవల సాయంతో తిరగాల్సి వచ్చింది. నాలాలు పొంగిపొర్లడంతో ఎక్కడ నాలా ఉందో..? ఎక్కడ రోడ్డు మార్గముందో తెలుసుకోలేని పరిస్థితి ఎదురైంది. వరదనీరు పూర్తిగా తగ్గిపోయాక ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు పలు నిర్మాణాల పునాదులు పాక్షికంగా కుంగాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో పలు జాగ్రత్తలు తీసుకుని వరద ముంపు నుంచి గట్టెక్కవచ్చని జేఎన్‌టీయూ రెక్టార్‌ డాక్టర్‌ ఎన్‌.వి.రమణరావు సూచిస్తున్నారు.

ముందు జాగ్రత్తలు మేలు 
* వర్షాకాలంలోనే వెంచర్ల అసలు రూపం, నిర్మాణం నాణ్యత, ఇతర భౌగోళిక పరిస్థితులు బయటపడతాయి. ఈ సమయంలో పరిశీలన చేసి కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలామంది స్థిరాస్తి వ్యాపారులు చెరువు గట్టుపై, చెరువు స్థలంలో, వరదకాలువ మార్గానికి అడ్డుగా, నాలాను ఆక్రమించి, బఫర్‌ జోన్‌లో వెంచర్లు ఏర్పాటు చేస్తుంటారు. 
* చెరువులకు సమీపంలో ఫ్లాటు కొనుగోలు చేస్తుంటే కచ్చితంగా అనుమానించాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులున్నప్పటికీ అవి నకిలీ అయ్యే అవకాశముంది. సరైన వరదనీటి వ్యవస్థ లేకపోతే పూర్తిగా నీటమునగాల్సి వస్తుంది. 
* నీట మునిగే ప్రాంతాల్లో సాధారణంగా తక్కువ ధరకే స్థలాలు లభిస్తాయి. చాలా మంది వాటిని కొనుగోలు చేసి కాస్త లాభంతో ఇతరులకు అమ్మేద్దామని ఆలోచిస్తారు. 
* పంచాయతీల్లో మరీ ఇబ్బందికర పరిస్థితులున్నాయని జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం చెబుతోంది. నిబంధనల ప్రకారం పంచాయతీల్లో జీ+2 వరకు అనుమతి ఉంటుంది. అక్రమ అనుమతులతో భారీ భవన సముదాయాలు వెలుస్తున్నాయి. అలాంటి ఆస్తులు ఎక్కువ మొత్తంలో పంట పొలాలు, చెరువు గట్ల కిందివే ఉంటాయి. భారీ వర్షాల సమయంలో నీట మునుగుతుంటాయి. రహదారులు ధ్వంసం అవుతాయి. తాగునీటి వ్యవస్థ కుప్పకూలుతుంది. విద్యుత్తు సరఫరా రోజుల తరబడి నిలిచిపోతుంది. 
* కాలనీల్లో నడుములోతు నీరు నిలవడంతో అపార్ట్‌మెంట్లు దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల పిల్లర్లు, సెల్లార్‌లోని ఫ్లోరింగ్‌ కుంగిపోయాయి. భవనాలకు పగుళ్లు వచ్చాయి.

ఇవి పాటిస్తే ఉపశమనం 
* భవనం చుట్టూ మురుగు, వర్షపు నీరు చేరకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నీరు పడగానే భవనానికి దూరంగా వెళ్లేలా చూసుకోవాలి. 
* భవనాల సమీపానికి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందుకోసం బేస్‌మెంట్‌ బలంగా ఉండేలా చూడాలి. 
* గట్టి నేల తగిలేవరకు తవ్వి మొత్తం శ్లాబులా వేసుకోవాలి. నీటిలో నానిన భవనాలకు ఏమైనా పగుళ్లు వచ్చాయా? దిగినట్లు అనిపిస్తుందా? అన్నది పరిశీలించుకోవాలి. 
* వదులుగా ఉన్న మట్టిని తొలగించి దాన్ని కంకరతో గట్టిగా మార్చుకోవాలి. 
* సెల్లార్‌, పార్కింగ్‌ ఇలా ఏదైనా తవ్వి గట్టిగా ఏర్పాటు చేసుకొని నీరు పైకి రాకుండా చూసుకోవాలి. 
* నీరు వచ్చే ప్రాంతంలో భవనం నిర్మించుకుంటే ఫుట్టింగ్స్‌ వెడల్పు పెంచుకోవాలి. బలంగా నిర్మించుకోవాలి. భవనంలోకి నీరు ప్రవేశిస్తుంటే ఎప్పటికప్పుడు బయటికి పంపుకోవాలి. 
* సెల్లార్ల ఎత్తు పెంచుకోవాలి. భవనం చుట్టూ ఆర్‌సీసీ గోడ నిర్మాణం చేసుకోవాలి. 
* నీరు తీసేకొద్దీ్ద ఉబుకుతుంటే వెంటనే ముందు జాగ్రత్తగా ఖాళీచేసి తగిన చర్యలు తీసుకోవడం మంచిది.

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

kone mundu koncham research sesi konandi flood history soosi.

 

1 hour ago, guduraju said:

Yada builder thadha buyer

 

1 hour ago, boeing747 said:

janalki alavatu ayipoyindi

chaduvukunoohdu......chaduvukoni vaadi ki vote veysthey.......now face the music

current examples: Tea seller & Trump

Link to comment
Share on other sites

28 minutes ago, SonyKongara said:

Hyderabad lo evarina illu kontara..invest or buy Flat in Amaravathi...

aat maaka..! 

'hope' ane mata ki asalaina ardam nuvve...

Link to comment
Share on other sites

44 minutes ago, BaabuBangaram said:

bro Venice aa...Amaravathi kantye mundhe Hyd ki theppinchukunnaru ga...jai KCR

Maggavale ani Dora order ssthe, devudu kuda aapaledu 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...