Jump to content

కాకతీయ మెగా జౌళిపార్కు దేశంలోనే గొప్పదవుతుంది


TampaChinnodu

Recommended Posts

వలసలిక వాపస్‌ 
కాకతీయ మెగా జౌళిపార్కు దేశంలోనే గొప్పదవుతుంది 
పంచాయతీరాజ్‌ ప్రక్షాళనకు కొత్త బిల్లు 
జౌళిపార్కు శంకుస్థాపనలో కేసీఆర్‌ 
22hyd-main1a.jpg
కాకతీయ మెగా జౌళిపార్కు దేశంలోనే అతి గొప్పదిగా నిలుస్తుంది. ఈ పార్కుతో వలసలు వెళ్లినవారు వాపస్‌ రావాలి. వివిధ ప్రాంతాలకు వెళ్లిన నేతన్నలకు ఇక్కడే మంచి ఉపాధి కల్పించి గౌరవంగా బతికేలా ప్రభుత్వం చూసుకుంటుంది.

ప్రపంచంలో మరెక్కడా లేని సులభతర పారిశ్రామిక విధానం మన వద్ద అమలు చేస్తున్నాం. వస్త్రాలకు డిమాండ్‌ తగ్గడం అంటూ ఉండదు. వరంగల్‌ జౌళి పార్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. మామునూరు విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తెస్తాం.

రాష్ట్రంలో 8684 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కొత్తగా మరో 4 నుంచి 5 వేల గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి ప్రత్యేక నిధులిస్తాం. పంచాయతీరాజ్‌ ప్రక్షాళనకు వచ్చే బడ్జెట్‌లో రూ.2000-3000 కోట్లను కేటాయిస్తాం.

గత ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాయి. వారిలా మేం భయపడం. గడువులోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తాం

ఈనాడు - వరంగల్‌

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కు దేశంలోనే గొప్పది అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. వలస వెళ్లిన నేతన్న దైన్యస్థితిని చూసే జౌళిపార్కును నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట గ్రామ పరిధిలో కాకతీయ మెగా జౌళిపార్కుతో పాటు వరంగల్‌ ఔటర్‌ రింగురోడ్డు, కాజీపేట రైల్వే వంతెన, ఐటీ పార్కు రెండో దశ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో త్వరలో మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు వేయడానికి ఈ చట్టం ఎంతో ఉపకరిస్తుందన్నారు. 600 జనాభా ఉన్న తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ ప్రతి గ్రామానికి రూ.10-30 లక్షలు అభివృద్ధి నిధులను కేటాయిస్తామని చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో పరకాల, సంగెం, వర్ధన్నపేట తదితర గ్రామాల చేనేతలు షోలాపూర్‌, భివండీ, సూరత్‌ వంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అక్కడే ఉద్యమాన్ని నడిపి ఆదర్శంగా నిలిచారు. ఒకసారి వారితో మాట్లాడగా.. ఆజంజాహి మిల్లు మూతపడడంతో గత్యంతరం లేక వలస వెళ్లామని, పొట్టకూటి కోసం అక్కడ తిప్పలు పడుతున్నామని చెప్పడం నన్ను కలచివేసింది. రాష్ట్రంలో ఆజంజాహి మిల్లును తలదన్నేలా ఒక జౌళి పార్కును ఏర్పాటు చేయాలని ఆరోజే నిర్ణయించా. ఇప్పుడా కల నెరవేరింది. దేశంలో వస్త్ర పరిశ్రమలు చాలా చోట్ల ఉన్నప్పటికీ ఒక్కో చోట ఒక్కో రకమైన ఉత్పత్తులు జరుగుతాయి. కానీ, కాకతీయ మెగా జౌళిపార్కులో మాత్రం అన్ని రకాల వస్త్రోత్పత్తులు జరగనున్నాయి. ఈ పార్కుతో వలసలు వెళ్లినవారు వాపస్‌ రావాలి.

22hyd-main1b.jpg

టీఎస్‌ఐపాస్‌ గొప్ప విజయం: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కానీ, ఇప్పుడు ఉన్నదల్లా చిత్తశుద్ధి, పట్టుదల. అందుకే జౌళిపార్కు ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఆనాడే జయశంకర్‌ సార్‌కు చెప్పిన.. తెలంగాణ ధనిక రాష్ట్రమని. సార్‌కు చెప్పినట్టే ఆదాయ వృద్ధిలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. టీఎస్‌ఐపాస్‌ ప్రారంభించినపుడు అనేక మంది విమర్శించారు. కానీ, దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నాం. ఇప్పటికి 5017 పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం. రూ.లక్షా 7 వేల కోట్ల పెట్టుబడులు సమకూరాయి. ప్రపంచంలో మరెక్కడా లేని సులభతర పారిశ్రామిక విధానం మన వద్ద అమలు చేస్తున్నాం. వస్త్రాలకు డిమాండ్‌ తగ్గడం అంటూ ఉండదు. వరంగల్‌ జౌళి పార్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. మామునూరు విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తెస్తాం.

అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ బిల్లు: పంచాయతీరాజ్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాం. మంత్రివర్గ సమావేశాల్లో బిల్లును తీసుకొస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తాం.

రైతన్నలు, నేతన్నలకు మేలు: కేటీఆర్‌ 
మెగా జౌళి పార్కు తెల్లబంగారాన్ని పండించే రైతన్నలకు, దారమే ఆధారంగా జీవించే నేతన్నలకు వరం కాబోతోందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అపార అనుభవం ఉన్న నేతన్నలను తిరిగి వరంగల్‌కు రప్పిస్తామన్నారు. జౌళి పార్కు పనులు ఏడాదిలోపు పూర్తిచేస్తామని తెలిపారు.

ఇష్టపడి అభివృద్ధి: కడియం 
కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 1991లో ఆజంజాహి మిల్లు పునరుద్ధరణ కోసం తాను పోరాడినప్పటికీ నాటి ప్రధాని పీవీ సహకరించలేదని చెప్పారు. గత పాలకుల జమానాలో రాష్ట్రంలో అభివృద్ధి నత్తనడకన సాగిందని, ఇప్పుడు కేసీఆర్‌ సారథ్యంలో పరుగులు తీస్తోందని శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి పేర్కొన్నారు.

బంగారు వరంగల్‌ కాబోతోంది 
వచ్చే జూన్‌కల్లా కాళేశ్వరం నుంచి నీరిస్తాం. దీంతో జనగామ, బచ్చన్నపేట లాంటి కరవుపీడిత ప్రాంతాల్లో సైతం ఏడాదికి మూడు పంటలు పండించుకునే రోజులు వస్తాయి. ఫలితంగా బంగారు వరంగల్‌ కాబోతోంది. ఉద్యమ సమయంలో వరంగల్‌ ప్రజలు నా వెంట నడిచారు. అందుకే బంగారు వరంగల్‌ తర్వాతే బంగారు తెలంగాణ అవుతుంది. నేను బతికున్నంత వరకు పేద ప్రజలకు ఏ లోటూ రానివ్వను. జై తెలంగాణ జై వరంగల్‌’ అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

22hyd-main1c.jpg
ఇంటికో ఉద్యోగం
టెక్స్‌టైల్‌ పార్కు రావడానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చూపిన చొరవ అభినందనీయం. ఇక్కడ నాలుగు గ్రామాల ప్రజలు పార్కు కోసం తమ భూములిచ్చారు. వారికి పరిహారం అందినప్పటికీ ఇంటికో ఉద్యోగం ఇస్తాం. శంకుస్థాపన రోజే 22 ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా ఒక్కరోజులో రూ.3900 కోట్ల పెట్టుబడి వచ్చింది. 20వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. త్వరలో ‘నిఫ్‌’్ట ఇక్కడో కళాశాల కూడా ఏర్పాటు చేయనుంది. కేసీఆర్‌ కిట్లకు ఆదరణ బాగుంది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రాయితీ ఇచ్చాం. 504 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశాం. ఇతర దేశాల్లో పై చదువులకు వెళ్లే పేద విద్యార్థులకు ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశాం. రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్ల సహకారంతో భూ రికార్డుల ప్రక్షాళన బాగా జరుగుతోంది.
ప్రత్యేక ఆకర్షణగా మెగా జౌళి పార్కు పైలాన్‌..
బాలసముద్రం, న్యూస్‌టుడే: కాకతీయ మెగా జౌళి పార్కు ప్రారంభోత్సవం సందర్భ´ంగా ఆదివారం ఏర్పాటు చేసిన పైలాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ పార్కు నిర్మాణ స్థలానికి చేరుకున్న అనంతరం నేరుగా శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదట పైలాన్‌ను ఆవిష్కరించి అనంతరం జౌళి పార్కు, వరంగల్‌ బాహ్యవలయ రహదారి నిర్మాణం, మడికొండ ఐటీ రెండో దశ పనులకు సంబంధించిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌, కాజీపేట-హైదరాబాద్‌ వంతెన, ఆత్మకూర్‌ ఒగ్లాపూర్‌ గ్రామ పరిధిలో ఉర్దూ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు శిలాఫలకాలను ప్రారంభించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...