Jump to content

శ్రీనివాసుడు...చిన్నశాఖలోనూ దున్నేశాడు..!


TampaChinnodu

Recommended Posts

శ్రీనివాసుడు...చిన్నశాఖలోనూ దున్నేశాడు..! 
ఐటీఐలో కొలువు .. ఆస్తులు రూ.50 కోట్లు 
amr-top2a.jpg

అతను ఓ సాధారణ ఉద్యోగి.. నేపథ్యం మధ్యతరగతి కుటుంబం.. అయితేనేం.. రూ.కోట్లు ఆర్జించారు. తన ఆదాయానికి ఆస్తుల నిష్పత్తికి పొంతన లేకుండా పోయింది. అంతేకాదు.. పైరవీలు, వసూళ్లకు పెట్టింది పేరుగా మారారు. బదిలీలు, పదోన్నతుల్లో చక్రం తిప్పారు.. ఉన్నతాధికారులను  ప్రసన్నం చేసుకున్నారు.. ఉద్యోగ సంఘాల్లోనూ హవా చెలాయించారు... ఆస్తులు కూడబెట్టి అవినీతి నిరోధకశాఖకు దొరికిపోయారు. విజయవాడ ప్రభుత్వ ఐటీఐలో జిల్లా శిక్షణాధికారిగా పనిచేస్తున్న కోనేరు శ్రీనివాసకుమార్‌ చరిత్ర ఇది.

విజయవాడ: ఎలాంటి ఆదాయ వనరులు లేని శాఖలో డబ్బుల్ని పిండుకుని కోనేరు శ్రీనివాసకుమార్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్ని దశాబ్దాలుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నా.. పెద్దల అండదండలతో చక్రం తిప్పుతూ బెజవాడలోనే తిష్టవేశారు. 1991 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే కొలువు నిర్వహించడం గమనార్హం. విద్యార్థుల నుంచి ప్రైవేటు సంస్థల నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేస్తూ వసూల్‌ రాజాగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఇక్కడే రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ సంయుక్త సంచాలకులుగా ఉన్న ముని వెంకటనారాయణ ఆస్తులపై దాడులు చేసి ఆదాయానికి మించి రూ.50కోట్లు కూడ బెట్టినట్లు అవినీతి నిరోధకశాఖ గుర్తించింది. ప్రస్తుత జిల్లా శిక్షణాధికారి శ్రీనివాసకుమార్‌కు ఆయన గురువు కావడం గమనార్హం.

బదిలీ కావాలా.. లేక నిలుపుదల చేయాలా.. అంటే ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయంలో శ్రీనివాసకుమార్‌నే సంప్రదించేవారు. దీనికి ఆయన పెద్ద మొత్తంలో వసూలు చేసేవారని తెలిసింది. ఎంతోమంది బదిలీలు నిలుపుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్జీవో సంఘానికి ప్రతినిధిగా ఉంటూ చక్రం తిప్పేవారని అంటున్నారు. సాంకేతిక  విభాగానికి ప్రతినిధిగా చెప్పుకొంటూ పెద్దల దగ్గర చనువు పెంచుకున్నారు. వారితో పనులు చేయిస్తూ నమ్మకస్తునిగా గుర్తింపు తెచ్చుకుని నీకిది.. నాకిది అనే సూత్రం అమలు చేసేవారని తెలిసింది. 
పారిశ్రామిక శిక్షణ పొందుతున్న విద్యార్థులను పీడించి మరీ వసూలు చేసేవారని తెలిసింది. వార్షిక పరీక్షల సమయంలో పాఠ్యాంశానికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేసే వారనే ఫిర్యాదులు ఉన్నాయి. అప్రెంటీస్‌ విద్యార్థులు భారీగా ముడుపులు ఇచ్చేవారు. ప్రవేశాల సమయంలోనూ వసూలుకు పాల్పడే వారు. ప్రైవేటు ఐటీఐలకు స్వయం కేంద్రాల ఏర్పాటుకు భారీ మొత్తాల్లో వసూలు చేసేవారు. చూసిరాతలను ప్రోత్సహించి విద్యార్థులను ఉత్తీర్ణులయ్యే విధంగా చూసేవారు. సాంకేతిక విభాగంలోనే మరో సహాయ సంచాలకులు ఆయనకు దగ్గరి బంధువు. ఆయన సహకారంతో పైరవీలు చేసేవారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మాడ్యులార్‌ ఎంప్లాయిమెంట్‌ స్కిల్స్‌ అనే అంశంపై శిక్షణ ఇస్తారు. దీనిలో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీనిపై ఒక సంయుక్త సంచాలకుడి పాత్రపై ఫిర్యాదులు ఉన్నాయి. సీబీఐ కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అందులోనూ ఈయన ప్రమేయం ఉన్నట్లు ఆనుమానిస్తున్నారు.

తీరే వేరు! 
వృత్తిపరంగా శ్రీనివాసకుమార్‌ సాధారణ ఉద్యోగి. జీవనశైలి మాత్రం విలాసవంతం. ఆయన భార్య పేరు మీద రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన పేరుమీద ఒక లగ్జరీ, ఒక హోండా జాజ్‌ కారు ఉంది. ఆయన మాత్రం ఓల్వో కారులో తిరుగుతుంటారు. ఉద్యోగానికి ఆ కారుమీదే అలా వచ్చి ఇలా వెళుతుంటారు. తనకు ఉద్యోగం రావడానికి కారణమైన తల్లిని కూడా వృద్ధాశ్రమంలో ఉంచేటంతటి ఘనుడు ఈ శ్రీనివాసుడు. మొత్తం మీద ఈయన అనిశాకు దొరకడంతో ఆశాఖలో కలకలం రేగింది.

శ్రీనివాస్‌కుమార్‌ అరెస్టు 
పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న విజయవాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ.. జిల్లా స్థాయి శిక్షణాధికారి కోనేరు శ్రీనివాసకుమార్‌ను ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పటమటలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనపై 13(2), R/w13(1)e   పీసీ చట్టం 1988 కింద కేసు నమోదు చేశారు. శ్రీనివాసకుమార్‌ను ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Link to comment
Share on other sites

అనిశా వలలో శిక్షణ అధికారి 
రూ.16 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు 
మార్కెట్‌ విలువ ప్రకారం రూ.50 కోట్లుగా అంచనా 
బోగస్‌ శిక్షణల పేరుతో నిధులు స్వాహా 
కుమార్తె పేరుతో రవాణా వ్యాపారం 
ఈనాడు - విజయవాడ 
28ap-main8a.jpg

దాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన అధికారి నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.16 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వీటి మార్కెట్‌ విలువ రూ.50 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన అధికారి కోట్లకు పడగలెత్తడం విస్మయపరిచింది. అసలు విధులు విస్మరించి సొంత వ్యాపారాన్ని చక్కబెట్టిన వైనం వెలుగు చూసింది. 
విజయవాడ పారిశ్రామిక శిక్షణ సంస్థలో జిల్లా శిక్షణాధికారి కోనేరు శ్రీనివాసకుమార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసును అవినీతి నిరోధకశాఖ నమోదు చేసింది. గురువారం ఆయన నివాసంతో పాటు విజయవాడలోని ఆయన బంధువులు, బినామీ వ్యాపార కేంద్రాలపై దాడులు చేశారు. అనిశా విజయవాడ డీఎస్పీ ఏస్వీవీ ప్రసాదరావు నేతృత్వంలో ఆరు బృందాలుగా విడిపోయి పటమటలోని విజయనగర్‌ కాలనీలో, ఆటోనగర్‌ హరిప్రియ బల్క్‌ కారియర్స్‌, పటమటలంక, పెనమలూరు, అశోక్‌నగర్‌, ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సోదాలు జరిగాయి.

గుర్తించిన ఆస్తులు..! 
* భార్య పేరు మీద విజయనగర్‌ కాలనీలోని నందిని టవర్స్‌లో ఒక ప్లాట్‌.

* బావమరిది కిలారు తిరుమల చౌదరి పేరుమీద ఆటోనగర్‌లో సర్వేనెంబరు 480లో 500 చ.గ విస్తీర్ణంగల నివేశన స్థలం. 
* మామ కిలారు రామారావు పేరుమీద ఆటోనగర్‌లో మరో 500 గజాల స్థలం.

* కుమార్తె హరిప్రియ పేరుమీద ఆటోనగర్‌లో హరిప్రియ బల్క్‌ కారియర్స్‌ పేరుతో ట్రాన్స్‌పోర్టు కంపెనీ నిర్వహిస్తున్నారు. దీనికి యజమానిగా ఆయన భార్య కృష్ణవేణి వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు 46 ట్యాంకర్లు, టిప్పర్లు ఉన్నాయి.

* వోల్వోకారు, హుండాయ్‌ టక్సాన్‌ సీఆర్డీఐ కార్లు, రెండు ద్విచక్రవాహనాలు  భార్య పేరుమీద ఉన్నాయి.

* శ్రీనివాసకుమార్‌ పేరుమీద హోండా జాజ్‌ కారు, హుండాయ్‌ బీఆర్‌వీ కారు, ఒక ద్విచక్రవాహనం ఉన్నాయి. 
* నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, 1.70కిలోల వెండి ఆభరణాలు లభించాయి.

* దస్తావేజుల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.16 కోట్లు ఉంటుందని అనిశా డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు వెల్లడించారు. మార్కెట్‌ ధరల ప్రకారం రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. 2009 తర్వాత ఆస్తులన్నీ కూడబెట్టినట్లు రిజిస్ట్రేషన్‌ ప్రకారం తెలుస్తోంది.

* అమెరికాలో ఉండే తన సోదరుని పేరుమీద ఇల్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

* బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. 
* వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.2కోట్లు వస్తున్నట్లు, ఖర్చులు రూ.2కోట్లు అయినట్లు చూపించి పన్నులు ఎగవేసినట్లు కనిపెట్టారు.

అటెండర్‌ నుంచి..! 
కోనేరు శ్రీనివాసకుమార్‌ అటెండర్‌ నుంచి అధికారి స్థాయికి వచ్చారు. ఒకే స్థానంలో ఉద్యోగ జీవితం గడపడం విశేషం. 1991 మార్చిలో స్టోర్‌ అటెండర్‌గా ఉద్యోగంలో చేరారు. ఐటీఐలోనే మొదట చేరారు. తండ్రి మల్లికార్జునరావు మృతితో కారుణ్య నియామకం కింద శ్రీనివాసకుమార్‌కు అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 1992లో ఇన్‌స్ట్రక్టర్‌(బోధకుడు)గా పదోన్నతి పొందారు. 1997లో జిల్లా ఉప శిక్షణాధికారిగా, 2014లో జిల్లా శిక్షణాధికారిగా పదోన్నతులు పొందారు. ఐటీఐకు, వివిధ శిక్షణ కార్యక్రమాలకు కేంద్రం నుంచి అందే నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో బోగస్‌ శిక్షణల పేరుతో నిధులను స్వాహా చేసినట్లు ఫిర్యాదులున్నాయి. విధులకు హాజరు కాకుండా సొంత వ్యాపారాలు చూసేవారు.

తల్లిని వదిలి..! 
తండ్రి కోనేరు మల్లికార్జునరావు చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం భార్య రాధాకుమారికి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. తనకు అవసరం లేదని తన పెద్దకుమారునికి ఇవ్వాలని ఆమె అభ్యర్థించింది. అలాంటి మాతృమూర్తిని వృద్ధాశ్రమానికి పరిమితం చేశారు శ్రీనివాసకుమార్‌. గత కొన్ని నెలలుగా ఆమెను కనీసం చూడలేదు. శ్రీనివాసకుమార్‌ నివాసం ఉండే మూడు పడకల గదుల ఇళ్లు ఖాళీగా ఉంది.

Link to comment
Share on other sites

maavalle.. endulonaina.. maakammati valle.. kulavada lo  kalthi lekunda chestham..};_

1991 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే కొలువు నిర్వహించడం గమనార్హం.

అసలు విధులు విస్మరించి సొంత వ్యాపారాన్ని చక్కబెట్టిన వైనం.

* వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.2కోట్లు వస్తున్నట్లు, ఖర్చులు రూ.2కోట్లు అయినట్లు చూపించి పన్నులు ఎగవేసినట్లు కనిపెట్టారు.

మాతృమూర్తిని వృద్ధాశ్రమానికి పరిమితం చేశారు శ్రీనివాసకుమార్‌. గత కొన్ని నెలలుగా ఆమెను కనీసం చూడలేదు. శ్రీనివాసకుమార్‌ నివాసం ఉండే మూడు పడకల గదుల ఇళ్లు ఖాళీగా ఉంది.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, yaman said:

maavalle.. endulonaina.. maakammati valle.. kulavada lo  kalthi lekunda chestham..};_

1991 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే కొలువు నిర్వహించడం గమనార్హం.

అసలు విధులు విస్మరించి సొంత వ్యాపారాన్ని చక్కబెట్టిన వైనం.

* వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.2కోట్లు వస్తున్నట్లు, ఖర్చులు రూ.2కోట్లు అయినట్లు చూపించి పన్నులు ఎగవేసినట్లు కనిపెట్టారు.

మాతృమూర్తిని వృద్ధాశ్రమానికి పరిమితం చేశారు శ్రీనివాసకుమార్‌. గత కొన్ని నెలలుగా ఆమెను కనీసం చూడలేదు. శ్రీనివాసకుమార్‌ నివాసం ఉండే మూడు పడకల గదుల ఇళ్లు ఖాళీగా ఉంది.

 

 

Instant money ekkada vunte akkada manavaallu vaalipotharu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...