yaman Posted December 31, 2017 Report Share Posted December 31, 2017 గోపికి గత ఆగస్టులో వివాహం చేసేందుకు నిశ్చయించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో యువకుడి పెద్దనాన్న చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. అనంతరం గోపికి బట్ట తల అధికం కావడంతో పెళ్లి కుమార్తె వివాహం చేసుకొనేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, ఉపాధి అవకాశాలు లభించక పోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. కొంత కాలంగా మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో అనంతపురానికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకుంటానని ఇంట్లో చెప్పి శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో లాడ్జిలో రాత్రి 9 గంటలకు చేరాడు. శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు నా మనస్సాక్షికి జరిగిన సంఘర్షణతోనే ప్రాణాలు తీసుకుంటున్నా, అందరినీ విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. అందరినీ పెళ్లికి పిలవాలనుకున్నాను. కానీ నా చావుకు పిలవాల్సి వస్తుందనుకోలేదు’.అని తన మనోవేదనను ఉత్తరంలో వ్యక్తం చేశాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted December 31, 2017 Report Share Posted December 31, 2017 rip Quote Link to comment Share on other sites More sharing options...
Anushri Posted December 31, 2017 Report Share Posted December 31, 2017 Rip Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.