Jump to content

మద్యం మత్తులో ప్రమాదం


TampaChinnodu

Recommended Posts

మద్యం మత్తులో ప్రమాదం 
7hyd-main3a.jpg

ఈనాడు- హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌- న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగర రహదారులపై మద్యం మరోసారి నెత్తురును చిందించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువతులను మద్యం మత్తులో ఉన్న ఓవ్యక్తి తన కారుతో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువతి మరణించగా, మిగిలిన ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈప్రమాదం వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన మస్తానీ(35) శ్రీనగర్‌కాలనీలోని గణపతి కాంప్లెక్స్‌ సమీపంలో నివసిస్తూ బ్యూటీషియన్‌ కోర్సు చేస్తున్నారు. విశాఖకు చెందిన అనూషరెడ్డి అలియాస్‌ ప్రియారెడ్డి అలియాస్‌ వెంకటలక్ష్మి(30) ఆర్నెల్లుగా మస్తానీతో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ జూనియర్‌ ఆర్టిస్టులుగా పనిచేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రికి చెందిన అనూష(19) రెండురోజుల కిందట కూకట్‌పల్లిలోని తన స్నేహితురాలు నిహారిక ఇంటికి వచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మస్తానీ, అనూషరెడ్డిలు ద్విచక్రవాహనంపై కూకట్‌పల్లికి వెళ్లారు. అనూషరెడ్డి వాహనం నడుపుతుండగా మస్తానీ మధ్యలో కూర్చొంది. వెనుక అనూషను ఎక్కించుకొని ముగ్గురూ మాదాపూర్‌ మీదుగా వెంకటగిరి నుంచి శ్రీనగర్‌కాలనీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

7hyd-main3b.jpg

విందులో మందు కొట్టి 
పంజాగుట్టలో నివసించే పాల విష్ణువర్దన్‌ శనివారం రాత్రి మాదాపూర్‌లోని తన స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్లాడు. అనంతరం తనకారులో బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక 1.15 నిమిషాలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని డైమండ్‌ హౌజ్‌ ప్రాంతంలో విష్ణువర్దన్‌ కారు యువతుల ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ముగ్గురు యువతులు చెల్లాచెదురుగా రహదారిపై పడిపోయారు. భయాందోళనకు గురైన విష్ణువర్దన్‌ కారు వేగాన్ని పెంచి పోనిచ్చాడు. సదరన్‌ స్పైస్‌ మూలమలుపు వద్ద రహదారి మధ్య విభాగినిని కారు బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. కారులోని రెండు బెలూన్‌లు తెరుచుకున్నాయి. పోలీసులు విష్ణువర్దన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్తనమూనాల్లో మద్యం శాతం 206 బీఏసీ(బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌)గా ఉన్నట్లు తేలింది.

7hyd-main3c.jpg

ఒక కారు ఢీకొని.. మరో కారు మధ్య నలిగి 
ముగ్గురు క్షతగాత్రులను 108 వాహనంలో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే మస్తానీ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనూషరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనూష ఆరోగ్యపరిస్థితి స్థిమితంగానే ఉంది. కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సమయంలో పక్కనున్న మరో కారుకు మధ్యలో వీరివాహనం నలగడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులైన ఇద్దరి మహిళల చరవాణుల్లో అభ్యంతరకర వీడియోలు, కొందరు యువతుల ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని విశ్లేషిస్తున్నారు. ద్విచక్రవాహనానికి శిరస్త్రాణం ఉన్నప్పటికీ అది ధరించారా లేదా తెలియరాలేదు. మస్తానీ, అనూషరెడ్డిలు అర్ధరాత్రి వెళ్లి అనూషను తీసుకొని రావాల్సిన అవసరం ఏమిటనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదఘటనపై ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌ 2, 337, 185 ఎంవీచట్టం కింద కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్‌ తెలిపారు. మస్తానీ మృతదేహాన్ని ఆమె భర్త, తాడేపల్లిగూడేనికి చెందిన సురేష్‌కుమార్‌కు, తల్లి మదనమ్మకు అప్పగించారు.

7hyd-main3d.jpg
Link to comment
Share on other sites

Quote

క్షతగాత్రులైన ఇద్దరి మహిళల చరవాణుల్లో అభ్యంతరకర వీడియోలు, కొందరు యువతుల ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని విశ్లేషిస్తున్నారు. 

idem twist ooo

Link to comment
Share on other sites

యువతుల హల్‌చల్‌ 
hyd-cri10a.jpg

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో అర్ధరాత్రి మద్యం తాగి నడుపుతూ వచ్చిన ఇద్దరు యువతులు హల్‌చల్‌ చేశారు. శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించకుండా మొండికేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు వారిని ఒప్పించి చివరకు పరీక్షలు నిర్వహించారు. ఒకరు 97 బీఏసీ మద్యం తాగినట్లు తేలింది. మరో యువతీ అదే స్థాయిలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. వారి కార్లను సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 14 కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఎక్కువగా కార్లే ఉన్నాయి. తల్లిదండ్రులను తీసుకొని సోమవారం కౌన్సెలింగ్‌కు రావాలని నిందితులకు సూచించారు.

Link to comment
Share on other sites

papam man... appudey hyd la digindhi anta, friends went to pick her and on way this happened.... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...