yaman Posted January 11, 2018 Report Share Posted January 11, 2018 గ్రీన్‌కార్డుల విషయంలో మరో చట్టం! భారతీయ ఐటీ నిపుణులకు ఊరట! వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడనుంది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రోత్సహిస్తూ సంవత్సరానికి 45శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా అమెరికా ప్రతినిధుల సభలో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుల సంఖ్య ప్రస్తుత సంవత్సరానికి 1,20,000నుంచి 1,75,000 వరకు పెరిగే అవకాశం ఉంది.‘అమెరికా భవిష్యత్ భద్రత చట్టం’ పేరున ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఈ చట్టాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే గ్రీన్‌కార్డుల మంజూరీకి ఒక రూపం సంతరించుకుంటుంది. దీంతో ఏటా సంవత్సరానికి వచ్చే వలసదారుల సగటు తగ్గే అవకాశం ఉంది. గ్రీన్‌కార్డు కోసం ఏటా సుమారు 5లక్షల మంది భారతీయులు తాత్కాలిక హెచ్1బీ వీసాను పొడిగించుకుంటున్నారని సమాచారం. మరోవైపు ప్రతిభావంతులైన అమెరికన్ నిపుణులు కొరత కారణంగా కొన్ని కంపెనీలు తాత్కాలిక హెచ్1బీ వీసాల పేరుతో విదేశీ నిపుణుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అమెరికన్ ప్రభుత్వం గ్రీన్‌కార్డుల సక్రమంగా ఇవ్వటాన్ని ఏటా కొనసాగిస్తే ప్రతిసారీ ఈ వీసా పొడిగింపుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ‘ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే అన్ని రకాల సమస్యలూ పరిష్కారమవుతాయి. అంతర్గతంగానూ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. వలస సంబంధిత చట్టాలను ఉల్లంఘించాలనుకునే వారికి ఇకపై కఠిన నియమాలు వర్తిస్తాయి’ అని మిచెల్ మేకాల్(సెక్యూర్ అమెరికా ఫ్యూచర్ యాక్ట్ కమిటీకి ఛైర్మన్) అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఒకరి ద్వారా మరొకరు వలస రావడం(చైన్ మైగ్రేషన్ విధానం)పై కాస్త ప్రభావం పడుతుంది. అంటే భారత్ నుంచి వచ్చిన టెక్కీలు అమెరికాలో స్థిరపడి ఆ తర్వాత తమ కుటుంబసభ్యులను అమెరికాకు తీసుకు వస్తుంటారు. కానీ ఈ చట్టంలో వారి బంధువులకు ఇకపై గ్రీన్‌కార్డ్ ఇవ్వకూడదని ప్రతిపాదించారు. కేవలం వారి పిల్లలకు, తోబుట్టులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఇంకా వ్యవసాయ సంబంధిత పనులు చేసే శ్రామికుల కోసం మరో కార్యక్రమాన్ని అమెరికా ప్రతిపాదిస్తుంది. వ్యవసాయం ద్వారా కూడా తమ ఆర్థికవ్యవస్థను పెంచుకోవాలని వారు భావిస్తున్నారు. ‘అన్ని రకాలుగా ఆలోచించి ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సరిహద్దు భద్రతను పెంచేలా శాసన వ్యవస్థ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు’ కమిటీ సభ్యుడు తెలిపారు. ‘అమెరికా ప్రజలకు ప్రధాన ప్రాధాన్యతనివ్వలనుకుంటున్న ట్రంప్ విధానాలకు అనుగుణంగా ఈ చట్టం ఉంటుందని’ వైట్‌హౌస్ ప్రకటించింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.