Jump to content

నాణ్యత డొల్ల!


TampaChinnodu

Recommended Posts

నాణ్యత డొల్ల! 
అయ్యప్ప సొసైటీ మార్గానికి పగుళ్లు 
ఇటీవలే మొదలై... అప్పుడే భయపెడుతూ... 
మసకబారిన ఎస్‌ఆర్‌డీపీ పనుల మన్నిక 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-top2a.jpg

ప్రతిష్ఠాత్మకమైన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) పనుల నాణ్యతలో డొల్లతనం కనిపిస్తోంది. ఇటీవల మొదలైన అయ్యప్ప సొసైటీ అండర్‌ పాస్‌ నిర్మాణమే అందుకు నిదర్శనం. రెండు నెలల్లోనే 50 మీటర్ల మేర రోడ్డు బీటలు వారింది. చిన్నపాటి కార్లు వెళ్తుంటేనే అక్కడి సిమెంటు రహదారి వణికిపోతున్న పరిస్థితి ఉంది. భారీ వాహనాలు వెళ్తే రోడ్డంతా గుంతలు తేలే ప్రమాదం ఉందని ఇంజినీరింగు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
మహా నగరంలో అధునాతన రహదారి వ్యవస్థను తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ రెండేళ్ల క్రితం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్‌ఆర్‌డీపీ) కార్యక్రమాన్ని భుజాలకెత్తుకుంది. భారీ లక్ష్యం, దూరదృష్టితో రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో వందకుపైగా అభివృద్ధి పనులకు ప్రణాళిక రచించింది. అయ్యప్ప సొసైటీ కూడలి అభివృద్ధి పనులు అందులో భాగంగా రూపుదిద్దుకున్నవే. ప్రస్తుతం కూడలి ద్వారా అయ్యప్ప సొసైటీ వైపు గంటకు 9 వేల వాహనాలు వెళ్తున్నాయి. పదేళ్లలో ఆ సంఖ్య 19 వేలకు చేరుకుంటుందని అధ్యయనం చెబుతోంది.

సమస్య ‘ఎండ’ కాదు... సేవలు మొదలైన రెండు నెలలకే అండర్‌ పాస్‌ రోడ్డుపై 50 మీటర్ల మేర పగుళ్లు చోటు చేసుకున్నాయి. ఏడు మీటర్ల వెడల్పు రోడ్డుపై మధ్యలో విభాగిని ఉంది. దాని పొడవునా చీలికలు విస్తరించడానికి నాణ్యత లోపమే కారణమని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. అడుగున వేసిన 700 ఎం.ఎం కాంక్రీట్‌ బెడ్‌లో లోపాలు ఉన్నాయన్నారు. ‘‘దానిని సరిదిద్దుకోకుండా యంత్రాంగం మరో తప్పిదం చేసింది. అక్కడున్న ట్రాపిక్‌ రద్దీ, కాంక్రీట్‌ బెడ్‌ మందాన్ని పరిగణనలోకి తీసుకుంటే వేరీయింగ్‌ కోట్‌ (రోడ్డుపైన కనిపించే చివరి కాంక్రీటు పొర) కనీసం 8 అంగుళాలు ఉండాలి. కానీ అధికారులు 3 అంగుళాలతో సరిపెట్టారు. వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో వాహన బరువును తట్టుకోలేని వేరీయింగ్‌ కోట్‌ పగుళ్లకు గురైంది. విభాగాని వద్ద మొదలైన ఈ పగుళ్లు క్రమంగా రోడ్డు మొత్తానికి వ్యాపించే అవకాశాలున్నాయని నగరంలోని ప్రముఖ ఇంజినీరింగ్‌ నిపుణులు ‘ఈనాడు’తో తెలిపారు. ప్రయాణ సమయంలో వాహనం వణుకుతోందన్న వాహన చోదకుల ఫిర్యాదుకు మరో కారణం ఉందన్నారు. కాంక్రీటు పొరలు సరిగా అతుక్కోకపోవడం కారణమని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న వేలాది కోట్ల రూపాయల పనుల్ని దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్లక్ష్యం మరోచోట పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ఇంజినీరింగ్‌ ఆడిట్‌ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై అధికారులను వివరణ కోరగా.. ‘‘ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కాంక్రీటు నిర్మాణాలు వ్యాకోచిస్తాయి. దాని వల్లే పగుళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన అంశం.’’అని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ, ప్రమాణాలు పాటించిన సిమెంటు రోడ్డు కనీసం ఏడాదిపాటు పగుళ్లకు గురవకూడదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఎండాకాలం పూర్తిగా మొదలవకుండానే అధికారులు ఆ కారణంతో తప్పించుకోవాలని చూడటం తగదన్నారు.

పనుల తీరిలా... 
* లక్ష్యం: కొండాపూర్‌- అయ్యప్ప సొసైటీ మార్గంలో వేగవంతమైన సాఫీ ప్రయాణం 
* ప్రధాన నిర్మాణం: 450 మీటర్ల పొడవైన అండర్‌ పాస్‌ 
* వెడల్పు 10మీటర్లు (7 మీటర్లు వాహనాల రాకపోకలకు, మిగిలింది పాదచారుల బాటకు) 
* ప్రాజెక్టు వ్యయం: రూ.44.43కోట్లు 
* పనులు మొదలు: డిసెంబరు 2017 
* పూర్తయింది: జనవరి 4, 2018

Link to comment
Share on other sites

2 minutes ago, sattipandu said:

hehe bangaaru TG  maa ajay babu thoney saadhyam antunna @Paidithalli

Last year Hyderabad ki vella. I think local Roads were better 5 years back compared to now. Outer ring road meeda thappa migatha antha travel torture ee.

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Last year Hyderabad ki vella. I think local Roads were better 5 years back compared to now. Outer ring road meeda thappa migatha antha travel torture ee.

hehe same opinion  here

 

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

Last year Hyderabad ki vella. I think local Roads were better 5 years back compared to now. Outer ring road meeda thappa migatha antha travel torture ee.

Worst roads asalu hyd lo _%~ 2months back vellocha india ki, ah traffic ki unna roads ki ghoram asala, janala kashtalu mamulu ga levu due to this, lambdi kodukula ki avem pattavu, bangaru telangana ani show-off thappa

Link to comment
Share on other sites

13 minutes ago, Demigod said:

dont worry mana KCR PM ayyaka everything will be fixed....and Hyd will be second capital of India..appativaraku...bemmi.violin.gif

then make nakka honorary cm of HYD 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

manalni evadu baage seyyaledu._%~

Best time to be in TG and AP. so many infra projects going on. contracts pattaru antey full money.

Eenadu LK gaadiki TDP ruling lo vunte maatram road meedha bokkalu kanapadavu.

Oka vela yevaraina Officer ni corruption case lo pattukunna adhi pakka Non-Commode Officer ne pattukuntaaru -- Eenadu, ABN, TV9.

I am wondering if there is a fault in my observation or everyone feels like the same?

 

 

Link to comment
Share on other sites

4 hours ago, Paidithalli said:

Better than KhanGress le annay.. kotladi telagana thecchukunnandhuku ayina support cheyyali ..

idem logic vayya , naa mrodaa la logic 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...