Jump to content

వీడని నగదు కష్టాలు


TampaChinnodu

Recommended Posts

వీడని నగదు కష్టాలు 
రోజురోజుకు తీవ్రమవుతున్న సమస్య 
  బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడం ఓ పెద్ద ప్రహసనం 
  60 శాతానికి పైగా పనిచేయని ఏటీఎంలు 
  రిజర్వుబ్యాంకును కోరేది కొండంత.. వచ్చేది గోరంత 
  గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత దుర్భరం 
13ap-main4a.jpg

పెద్దనోట్ల రద్దు జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్రంలో నగదు కొరత తీరడం లేదు. ఆ కష్టాలు ప్రజలను వీడటం లేదు. బ్యాంకు ఖాతాల్లో కావాల్సినంత డబ్బున్నా... దాన్ని పొందడం ఖాతాదారులకు ప్రహసనంగా మారింది. ఏటీఎంలకు వెళ్లైనా డబ్బులు తీసుకుందామంటే 60 శాతానికి పైగా కేంద్రాలు నెలలు తరబడి మూతపడి కనిపిస్తున్నాయి. అసలు వాటిల్లో నగదు పెడుతున్న పరిస్థితే లేదు. బ్యాంకుల నుంచి రిజర్వుబ్యాంకుకు పంపుతున్న ఇండెంట్‌కు, అక్కడి నుంచి వస్తున్న నగదుకు మధ్య పొంతన ఉండటం లేదు. క్షేత్రస్థాయి నుంచి అడుగుతున్న దాంట్లో కనీసం పదోవంతు సొమ్మైనా ఆర్‌బీఐ పంపడం లేదు. అవసరమైనప్పుడు కావాల్సినంత సొమ్ము తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో చాలా మంది ఖాతాదారులు, ప్రధానంగా చిరు వ్యాపారులు బ్యాంకుల్లో రోజువారీ జమచేయడం తగ్గించేశారు. డిపాజిట్లూ తగ్గిపోయాయి. బ్యాంకు కుంభకోణాలు వెలుగుచూడటం, ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై భయాందోళనలు నెలకొనడం, కనీస నిల్వల పేరిట అపరాధ రుసుము వసూలు వంటివి కూడా బ్యాంకులతో లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి తగ్గిపోవడానికి, ఉన్న డిపాజిట్లు, నగదు ఉపసంహరించుకోడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో నగదు ప్రవాహం తగ్గి కష్టాలకు కారణమవుతోంది.

ఈనాడు - అమరావతి

నగదు కొరత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లోనూ డబ్బుల ఉపసంహరణపైన అనధికారిక పరిమితి కొనసాగుతోంది. ఖాతాదారులు ఎంత కావాలని అడిగినప్పటికీ వారి ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేల నుంచి రూ.20 వేలే ఇస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలకు మించి ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్ని బ్యాంకు శాఖల్లో అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వేచి ఉండమని చెప్పి, అప్పటివరకూ బ్యాంకులో జమైన మొత్తం నుంచి తీసి కొంత ఇస్తున్నారు. రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తున్నారు. ఆ మొత్తం తీసుకోడానికి రైతులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పనులన్నీ వదులకుని వారు రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్‌ కావడంతో ఖర్చులకు కావాల్సిన డబ్బులను బ్యాంకుల నుంచి తీసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

13ap-main4b.jpg

ప్రస్తుతం ఏ బ్యాంకు శాఖల్లో చూసినా... 
బ్యాంకుల్లో రోజువారీ జరిగే లావాదేవీల సామర్థ్యాన్ని బట్టి ఆయా శాఖల్లో రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నగదు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఏ బ్యాంకు శాఖల్లో చూసినా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు మించి నగదు లభ్యత ఉండటం లేదు. దీంతో బ్యాంకుల్లో రోజువారీ జమయ్యే నగదును అదే రోజుల్లో ఏటీఎంలలో పెట్టడానికి, ఖాతాదారులకు ఇవ్వడానికే చాలని పరిస్థితి. విజయవాడలో ఓ ప్రధాన బ్యాంకుకు సంబంధించి జిల్లా పరిధిలో ఉన్న శాఖలన్నింటిలో లావాదేవీలకు రూ.200 కోట్లు అవసరం కాగా కేవలం రూ.9 కోట్లు మాత్రమే లభ్యత ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అత్యధిక చోట్ల ఉంది. దీంతో అందుబాటులో ఉన్న నగదును ముఖ్యమైన శాఖలకు సర్ది గ్రామీణ ప్రాంతాల్లోని శాఖలకు నామమాత్రంగా డబ్బులు పంపిస్తున్నారు.

తిరిగిరాని పెద్దనోట్లు! 
ప్రస్తుతం చలామణిలో ఉన్న వాటిల్లో రూ.2 వేలే అత్యధిక విలువ కలిగిన నోటు. అయితే బ్యాంకుల నుంచి బయటకు వెళ్తున్న రూ.2 వేల నోట్లలో అతి తక్కువ శాతం నోట్లే తిరిగి బ్యాంకులకు చేరుతున్నాయని ఓ బ్యాంకు అధికారి విశ్లేషించారు. తమ దగ్గరకు చేరిన అధిక విలువ కలిగిన నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి ఖాతాదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్దనోట్ల రద్దైన ప్రారంభంలో రూ.2 వేల నోట్లను పంపించిన రిజర్వు బ్యాంకు ప్రస్తుతం వాటిని ఆపేసింది. కేవలం రూ.200, రూ.500 నోట్లే వస్తున్నాయి. మార్కెట్‌లో ఇప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు బ్యాంకుకు రాకపోవడం, రిజర్వు బ్యాంకు నుంచి వాటి సరఫరా ఆగిపోవడం కూడా నగదు కొరతకు ఒక ప్రధాన కారణమవుతోందని ఓ బ్యాంకు అధికారి విశ్లేషించారు. ఇప్పటికే బయటకొచ్చిన రూ.2 వేల నోట్లు ఎక్కడో చోట స్తంభించిపోవడమూ దీనికి మరో కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

13ap-main4c.jpg

గతంలో 94% ఏటీఎంలలో నగదు లభ్యత.. 
పెద్దనోట్ల రద్దుకు ముందు రాష్ట్రంలో దాదాపు 94 శాతం ఏటీఎంలలో నగదు లభ్యత ఉండేది. ప్రస్తుతం 40 శాతం కూడా డబ్బులు ఉండటం లేదు. కొన్ని మండల కేంద్రాల్లో అయితే నాలుగైదు నెలలుగా తలుపులే తెరవని ఏటీఎంలు అనేకం ఉన్నాయి. పనిచేస్తున్న వాటిల్లోనూ తరచూ ‘నో క్యాష్‌ బోర్డు’’లు దర్శనమిస్తున్నాయి. బ్యాంకు శాఖలకు అనుబంధంగా ఉన్న ఏటీఎంలలో డబ్బులు పెట్టిన గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతున్నాయి. నెలలో నాలుగుసార్లకు మించి ఏటీఎం నుంచి నగదు తీస్తే సర్‌ఛార్జి విధిస్తుండటంతో అవసరమైనంత ఒకేసారి తీసుకునేందుకు ఖాతాదారులు ఆరాటపడుతుండటం దీనికి కారణమవుతోంది. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. అనంతపురం పట్టణంలో దాదాపు 50 ఏటీఎంలు ఉండగా... వాటిలో నగదు అందుబాటులో ఉంటున్నవి, పనిచేస్తున్నవి వేళ్లపై లెక్కించగలిగేనన్ని మాత్రమే ఉన్నాయి.

డిపాజిట్ల ఉపసంహరణకు మొగ్గు 
బ్యాంకుల్లో నుంచి తాము కోరుకున్నప్పుడు డబ్బులు తీసుకునేందుకు వీలులేని పరిస్థితుల్లో చాలా మంది డిపాజిట్లు ఉపసంహరించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాలో గత ఆరు నెలల వ్యవధిలో రూ.1,000 కోట్ల మేర డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు. రూ.9,500 కోట్ల మేర ఉన్న డిపాజిట్లు ఇప్పుడు రూ.8,500 కోట్లకు పడిపోయాయి. ఈ ఒక్క జిల్లాలోనే కాదు... అనేక జిల్లాల్లో ఇదే పరిస్థతి ఉంది. బ్యాంకుల నుంచి తీసేసిన డబ్బులును కొందరు భూముల కొనుగోలుకు ఉపయోగించడం, తపాలా శాఖలో పొదుపు చేయడం చేస్తున్నారని ఓ అధికారి విశ్లేషించారు.

అధిక సొమ్ము హైదరాబాద్‌కే వచ్చినా సరిపోని వైనం... 
అధిక విలువ కలిగిన నోట్లు రద్దు అమల్లోకి వచ్చిన 2016 నవంబరు 8 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకూ హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయానికి ఆర్‌బీఐ రూ.1,44,905 కోట్లు పంపించింది. ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకు చెస్ట్‌లకు నగదు సరఫరా అవుతుంది. దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలకు ఆర్‌బీఐ పంపించిన నగదు గణాంకాలను పరిశీలిస్తే అత్యధిక సొమ్ము హైదరాబాద్‌కే సరఫరా అయ్యింది. అయినప్పటికీ ఇక్కడ నెలకొన్న డిమాండుకు ఆ నగదు ఎంత మాత్రమూ సరిపోవడం లేదు. కోరినంత నగదు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

మల్బరీ సాగు నిమిత్తం రూ.86 వేల రుణం మంజూరు చేసిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేయడంతో దాన్ని తీసుకోడానికి నాలుగు రోజులుగా సవర అడ్డాయ్‌ నానా పాట్లు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం నడిమిగూడ గ్రామవాసి ఆయన. ‘‘షెడ్డు నిర్మాణానికి ప్రస్తుతం రూ.50 వేలు కావాలి. బ్యాంకుకెళ్తే రోజుకు రూ.5 వేలుకు మించి ఇవ్వలేమంటున్నారు. ఎంత బతిమాలినా తామేమి చేయలేమంటున్నారు. ఇప్పటికే పనులు వదిలేసి నగదు కోసమే రోజూ తిరుగుతున్నా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
మిర్చి పంట విక్రయిస్తే వచ్చిన సొమ్మును వ్యాపారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయడంతో నగదు తీసుకొనేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు. గతంలో తూకం వేసేటప్పుడే డబ్బులు చేతికిచ్చేసే వాళ్లు. నగదు కొరత నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ జమచేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లి ఆ సొమ్ము తీసుకుందామంటే ఆ శాఖలో తగినంత నగదు అందుబాటులో ఉండటం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విశాఖపట్నానికి చెందిన రాజేష్‌కు కుటుంబ అవసరాల నిమిత్తం ఇటీవల అత్యవసరంగా రూ.80 వేలు నగదు కావాల్సి వచ్చింది. ఏటీఎం నుంచి తీసుకుందామని సమీప ప్రాంతాల్లో తిరిగినా చాలా వరకూ మూతపడే దర్శనమిచ్చాయి. దీంతో తన బ్యాంకు ఖాతా ఉన్న శాఖను ఆశ్రయించారు. ఒకసారి రూ.10 వేలకు మించి ఇవ్వలేమని చెప్పడంతో చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అప్పటికప్పుడు తన స్నేహితులు, బంధువులతో మాట్లాడి అవసరమైన డబ్బు సమకూర్చుకున్నారు.

Link to comment
Share on other sites

public banks lo motham money withdraw sesi mari buying real estate. banks meeda nammakam poyi.

looks like soon there will be huge banking crisis in india

Link to comment
Share on other sites

బ్యాంకుల నుంచి తీసేసిన డబ్బులును కొందరు భూముల కొనుగోలుకు ఉపయోగించడం, తపాలా శాఖలో పొదుపు చేయడం చేస్తున్నారని ఓ అధికారి విశ్లేషించారు.

Link to comment
Share on other sites

7 minutes ago, Hydrockers said:

CDM lu unna daggara no problem for withdraws

 

not many bank branches have CDM's...also basic ga deposits taggipoyayi man..People are having a false fear of banks nowadays

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

not many bank branches have CDM's...also basic ga deposits taggipoyayi man..People are having a false fear of banks nowadays

Ninna  evng 6 ki veltana kothapet Sbi ki

lone 10 members unte 8 members deposit ke unnaru

One thing is right.  Before Nov 8 laga janalu lachalu lachalu veyatam left banks Lo 

Link to comment
Share on other sites

8 minutes ago, Hydrockers said:

Ninna  evng 6 ki veltana kothapet Sbi ki

lone 10 members unte 8 members deposit ke unnaru

One thing is right.  Before Nov 8 laga janalu lachalu lachalu veyatam left banks Lo 

i heard from many friends in india that major reasons for not depositing is the fear of unavailability of cash when needed, and inka chala areas lo cash business nadustandi and those guys are fearing to deposit as anni transactions ki aadhar etc chustunnaru ani, as i said oka false fear lo unnar chala mandi.

and ee madhya bank vallu kuda tega fees estunnaru chinna chinna vatiki kuda, obviouly ppl are getting pissed off, seeing ppl like malya, nirav modi etc running away doing frauds while common janatha are being scruitinised/punished for small/trivial things

Link to comment
Share on other sites

3 hours ago, Kontekurradu said:

dont worry man, Mana DORA PM ayyaka, anni probelms solve sesthadu ani ITM seppadule. 

pfdb_brahmi38.gif?1377272905
 

topic edi ina neeku andulo CBN ni pogadaali , dora ni , Jagan ni thittali anthey kada.

ok ok. CBN is number one leader in world , Amaravathi is top 5 city in the world . 

Link to comment
Share on other sites

On 4/13/2018 at 9:53 PM, boeing747 said:

i heard from many friends in india that major reasons for not depositing is the fear of unavailability of cash when needed, and inka chala areas lo cash business nadustandi and those guys are fearing to deposit as anni transactions ki aadhar etc chustunnaru ani, as i said oka false fear lo unnar chala mandi.

and ee madhya bank vallu kuda tega fees estunnaru chinna chinna vatiki kuda, obviouly ppl are getting pissed off, seeing ppl like malya, nirav modi etc running away doing frauds while common janatha are being scruitinised/punished for small/trivial things

Add so many banks scams happening these days. People lost trust on banks. 

Link to comment
Share on other sites

On 4/14/2018 at 4:13 AM, TampaChinnodu said:

topic edi ina neeku andulo CBN ni pogadaali , dora ni , Jagan ni thittali anthey kada.

ok ok. CBN is number one leader in world , Amaravathi is top 5 city in the world . 

ok ok i like pk pfdb_brahmi38.gif?1377272905

Link to comment
Share on other sites

Cash crunch, technical ‘glitch’ delay payment of salaries in AP 

More than 22,000 government employees are yet to get their salary for the month of March, even as the Finance Department authorities are working hard to fix the glitch.

Amaravati: A cash crunch on one hand and a software glitch on the other has resulted in freezing of bill payments running into thousands of crores of rupees in Andhra Pradesh, for over a month now, official sources said.

More than 22,000 government employees are yet to get their salary for the month of March, even as the Finance Department authorities are working hard to fix the glitch.

 

In fact, the salary and pension was paid only on April 7, a week behind schedule, because of the “software problem”. There are a total of 7.9 lakh employees and pensioners on government rolls in the state.

The non-release of funds by the Centre is being cited as one reason for the cash crunch. “We have to get about Rs 3,000 crore for the multipurpose Polavaram project and another Rs 350 crore under the backward districts development grant.

This has been causing a strain on our payments position,” a senior official of the Finance Department pointed out. In all, payments worth Rs 8,000 crore have been stalled “for various reasons,” the official said.

This apart, another Rs 1,500 crore worth bills have been pending with the Treasury due to non-clearance by the state government. Of Rs 8,000 crore, half relate to payments for capital works and the balance to various government schemes.

The state government recently introduced the Comprehensive Financial Management System, which is an integrated payment network.

However, inadequate training of staff and also the glitches in transition from the old software to the new CFMS software have resulted in freezing of payments. In Krishna district, for example, payments worth Rs 800 crore have been stalled and the Pay and Accounts Office (PAO) has been asked not to make any releases.

“Just for a day on March 27, we were asked to release 20 per cent of the dues and immediately thereafter further payments were kept on hold,” a PAO official said.

In January, cultural shows were organised in all the 175 Assembly constituencies in the state as part of the state government’s 10-day mass outreach programme ‘Janmabhoomi,’ but the artists have not been paid their remuneration yet.

“We could not pay even Rs 1,000 to an artist, which is really painful. We have adequate budget, but the government stalled all payments,” rued an official of the Department of Culture. The Department of Culture, in all, owes over Rs 3 crore to artists for various programmes. “Without salary, majority of the Kuchipudi teachers are reluctant to work and we can’t force them.

This may adversely affect the government’s ambitious programme to promote Kuchipudi, the native dance form of the state,” the Culture Department official said. Meanwhile, State Finance Secretary Muddada Ravichandra told PTI that the ‘software problem’ caused by the transition to CFMS has indeed affected the payments.

“All data has to be totally re-entered into CFMS from the old system. Staff are also not totally familiarised with the new system despite one round of training.” “We are now giving them hands-on training for two days on April 17 and 18 so that we can overcome the problems,” the secretary said.

There was no financial crisis as such but non-release of funds by the Centre has resulted in some problem, he added.(PTI)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...