Jump to content

చంద్రబాబు మళ్లీ వేసేశారు..


TampaChinnodu

Recommended Posts

 
 
 
 
Chandrababu Naidu Bluntly Claims That He Built Begumpet Airport - Sakshi

నాటి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌(ఫొటో క్రెడిట్‌ పి.అనురాధా రెడ్డి), (ఇన్‌సెట్‌లో చంద్రబాబు నాయుడు)

చరిత్రంటే నారా వారిదేనని మరోసారి రుజువుచేశారు చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలోనైనా, భరింపశక్యంకాని గప్పాలు కొట్టడంలోనైనా తమను మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్‌, ఆస్కార్‌లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్‌ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్‌ రాకెట్‌ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేసిన ఆయన హైటెక్‌ సిటీ కాకుండా ఓ బ్రహ్మాండ నిర్మాణాన్ని తాజాగా తన ఖాతాలో వేసేసుకున్నారు. అదే బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌!

కట్టింది నేనే: తెలంగాణ టీడీపీ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్‌ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్‌ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్‌ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్‌ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయిపోయాయి...
(డిలిట్‌ చేసిన బాబు ట్వీట్‌ స్ర్కీన్‌షాట్‌)
babu-1.jpg
బ్రీఫ్‌గా బేగంపేట చరిత్ర: 1930లో తొలుత హైదరాబాద్‌ ఎయిరో క్లబ్‌ పేరుతో నిజాం ప్రభువు బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. అనంతరం దక్కన్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్ధిల్లింది. 1937లో తొలి టెర్మినల్‌, 1972లో కొత్త టెర్మినల్‌ భవనాలను నిర్మించారు. 2008లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేనాటికి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ దేశంలోనే అత్యంత రద్దీగల ఆరో విమానాశ్రయంగా ఉండింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఓల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌గా పిలుస్తోన్న బేగంపేట విమానాశ్రయంను ఏవియేషన్‌, మిలటరీ ట్రైనింగ్‌ కోసం, అప్పుడప్పుడూ వీవీఐపీల రాకపోకల కోసం కూడా వినియోగిస్తున్నారు.
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ పాతఫొటోలు కొన్ని..
10_2.jpg
babu-2.jpg
babu-5.jpg
babu-3.jpg
తప్పు తెలుసుకున్న తర్వాత సవరించిన ట్వీట్‌ ఇది..
babu-15.jpg
 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

thankyou Sendral Sir . Nee government ki mundu Hyderabad people used to drink petrol since water was not available. 

tenor.gif?itemid=11614996

 

Kallu man not petrol.

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

oka typo ki ee range lo beating chesukuntunaru ante.. how pathetic lifes you guys are leading... navu vastundi

typo ante meaning ni marcheyandi iga...kavalni type chesinru adi..typo antey begumpet ki badulu shameerpet ano inkedo type cheyali....it's pur lie that was very intentional...shamshabad kuda 2005 lo construction started

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

oka typo ki ee range lo beating chesukuntunaru ante.. how pathetic lifes you guys are leading... navu vastundi

Bhayya antha experience vundi ala matladutunte dobbutaru 

Socila platform lo anukovadam common kadhee db vunadhi anukovadaniki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...