Jump to content

Looks like Nitish is preparing to quit NDA


AndhraneedSCS

Recommended Posts

బిహార్‌లో ‘సీటు’మాటు రాజకీయాలు! 
25 లోక్‌సభ స్థానాలు కోరుతున్న జేడీ(యూ) 
పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నీతీశ్‌ మంతనాలు 
తమ సీట్లకు కోత పెట్టొద్దని అమిత్‌ షాను కోరిన పాసవాన్‌! 
ఎన్డీయే పక్షాల సమావేశం 
నేపథ్యంలో సీట్ల పంపకంపై మొదలైన వేడి

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల్లో సీట్ల సెగ మొదలైంది! 40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌లో 25 చోట్ల బరిలోకి దిగుతామని... ముఖ్యమంత్రి నీతీశ్‌ నేతృత్వంలోని జేడీ(యూ) మనసులో మాటను బయటపెట్టింది. మరోవైపు, తమ సీట్లకు కోత పెట్టవద్దంటూ... భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి (ఎల్జేపీ) నేత రాంవిలాస్‌ సాసవాన్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏను వీడిన నీతీశ్‌ మళ్లీ అదే గూటికి చేరడంతో... రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బిహార్‌లో లోక్‌సభ సీట్లను ఎన్డీఏ పక్షాలు ఎలా పంచుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

2019 సంగ్రామం సమీపిస్తున్న తరుణంలో... ఈనెల 7న ఎన్డీఏ పక్షాలు సమావేశం కానున్నాయి. ఈ క్రమంలో పట్నాలోని ముఖ్యమంత్రి నీతీశ్‌ నివాసంలో ఆదివారం రాత్రి జేడీ(యూ) కోర్‌ కమిటీ మంతనాలు సాగించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ త్యాగి, పవన్‌ వర్మలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా హాజరుకావడం విశేషం! సమావేశం తర్వాత పవన్‌వర్మ మాట్లాడుతూ-‘‘బిహార్‌లో ఎన్డీఏకు నీతీశ్‌ సారథ్యం వహిస్తారు’’ అని వెల్లడించారు. పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌ అలోక్‌ మరింత స్పష్టంగా స్వరం వినిపించారు. ‘‘ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల పంపకం విషయంలో అస్పష్టతేమీ లేదు. 25 స్థానాల్లో జేడీ(యూ), 15 స్థానాల్లో భాజపా పోటీ చేయడం ఆనవాయితీ. ఇప్పుడు చాలా పార్టీలు కూటమిలో ఉన్నందున... అన్ని పక్షాల అధినేతలు చర్చించి, సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు’’ అని ట్వీట్‌ చేశారు.

ఆ ఫార్ములా ఇప్పుడు పనిచేస్తుందా? 
2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీని భాజపా తెరపైకి తేవడాన్ని నీతీశ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలోనే ఎన్డీఏ నుంచి జేడీ(యూ) బయటకు వచ్చేసింది. దీంతో 2014లో బిహార్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అంతకుముందు వరకూ జేడీ(యూ) 25 సీట్లలో, భాజపా 15 సీట్లలో పోటీ చేసేవి. కానీ, గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, ఎల్జేపీలతోపాటు ఉపేంద్ర కుశ్వాహ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఈ కూటమికి మొత్తం 31 సీట్లు వచ్చాయి. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు 6 స్థానాల్లో పాగా వేశాయి. జేడీ(యూ) మాత్రం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

4ap-politics1a.jpg

పాసవాన్‌ పావులు... 
జేడీ(యూ) మంతనాల నేపథ్యంలో- ఎల్జేపీ అధినేత పాసవాన్‌ కూడా పావులు కదిపారు. 2014లో భాజపా-ఎల్జేపీ మైత్రికి పునాదులు వేసిన తన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌తో కలిసి ఆదివారం భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయ్యారు. జేడీ(యూ) పునరాగమనంతో బిహార్‌లో చోటుచేసుకున్న కొత్త రాజకీయ సమీకరణాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఏదేమైనా, తమ సీట్లలో మాత్రం కోత విధించవద్దని షాను పాసవాన్‌ కోరినట్లు తెలిసింది.

మునుపటి ప్రాధాన్యం దక్కుతుందా? 
జేడీ(యూ)కు కాషాయపార్టీ మునుపటి ప్రాధాన్యం ఇవ్వబోదని నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. భాజపా నేత, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ సోమవారం దిల్లీలో మాట్లాడుతూ... ‘‘మోదీ జాతీయ నేత. ఎన్డీఏకు చుక్కాని. నీతీశ్‌కుమార్‌ బిహార్‌లో నాయకుడు. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదు. మనసులు కలిశాయి. ఇక సీట్ల పంపకం పెద్ద విషయం కాబోదు’’ అన్నారు. కుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎన్డీఏ ఎదుర్కొంటుందని భాజపా నేత, మరో కేంద్ర మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

 

Source: Eenadu

Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

2 seats unna party 25 adagatam endo

Elections ki almost 1 year undi. Do you understand the motive of bringing this up so early? He wants to come out of NDA and is looking for a reason 

Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

i think its better to go alone, and tie up later.

If they do that, they will do "Lallu + Congress" a big favor 

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

2 seats unna party 25 adagatam endo

Bodi hawa ledhu ipudu ... lallu+congress ki malli votlu guddhutharu.. BJ gallaki BJ cheyyakunda bayatakosthe Nitish ki kuda manchidhi ani nfdb lo kongara bro tolded

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Well, the source say everything...

 

 

2 hours ago, DaleSteyn1 said:

E

Nitish will settledown with 10 le this is all eenadu fabricated news 

News is not fabricated as it appeared in multiple places.

 

https://www.indiatoday.in/india/story/why-nitish-kumar-s-25-15-seat-sharing-proposal-can-t-work-in-bihar-1249850-2018-06-04  

 

 

Link to comment
Share on other sites

4 hours ago, AndhraneedSCS said:

Elections ki almost 1 year undi. Do you understand the motive of bringing this up so early? He wants to come out of NDA and is looking for a reason 

he did that mistake in 2013,

hes not a fool to repeat it. this is called public posturing

nits on his own can't win more than 2 seats

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...