Jump to content

సాటి తెలుగు తెలంగాణా సోదరులకు వ్రాయునది ఏమనగా

SonyKongara

Recommended Posts

సాటి తెలుగు తెలంగాణా సోదరులకు వ్రాయునది ఏమనగా,

శుభాకాంక్షలు. తెలంగాణా సాధించారు. ఫలితాన్ని నాయకత్వానికి ముందు నిలిచిన కెసీఅర్ గారికి ఇచ్చారు. ఆయన కూడా మిమ్మల్ని మెప్పించేలా పరిపాలించాడని అనిపిస్తోంది. లేదంటే 9 నెలలక ముందేm మరో సారి మీరు అధికారం ఇస్తారని, ఆయన ముందస్తుగా తన అధికారాన్ని త్యాగం చేసేంత తెలివి తక్కువాడు కాదు కదా. మరో సారి ఆయననే గెలిపించుకొన్నా, ఇంకెవరిని గెలిపించుకొన్నా, మీ తెలుగు సోదర ఆంధ్రాకు ఆనందమే.

కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విడిపోక ముందు కలిసి వుండాలని ఆశించాము. ఏ సామాన్యుడూ దొంగిలించాలని ఆశపడలేదు. మన హైదరాబాదుతో వున్న దశాబ్దాల బంధం, ఒక భావోద్వేగం. విడిపోయిన ప్రతిసారి అనుభవించే మాకే తెలుస్తుంది. అందుకే మా ఉద్యోగులు విడిచి వచ్చేప్పుడు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. రోజు రోజుకూ మెల్ల మెల్లగా కుదుట పడ్డాము. మానసికంగా ఇక మనది కాదు అని తెలుసుకొన్నాము.

అమరావతి నుండి మొదలెట్టాము. ఉమ్మడిగా వున్నప్పుడు తరమలేని కరువును పొలిమేరలు తరిమాము. విశాఖ, తిరుపతి, అమరావతి, దేనికదే ప్రత్యేకతతో అభివృద్ధి సాధిస్తోంది. మధ్యలో హుద్ హుద్ లాంటి విపత్తులు, కేంద్ర అహంకారంతో అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నా. అన్యాయమైన విభజన మీరు చెయ్యమనలేదు. కాని మీకు ఎక్కువ న్యాయం చేసి మాకు అన్యాయమే చేసింది కాంగ్రెస్స్. మీరు కృతజ్ఞత చూపుతారో లేదో మేము పట్టించుకోలేదు. కాని దానికి సమాధి కట్టాము. మీరు కూడా ప్రక్కన బెట్టినందుకు సంతోషించాము.

ఇప్పుడు దానికన్నా మించిన అన్యాయం చేస్తోంది మోడీ ప్రభుత్వం. దానికీ మూడింది అని నిర్ణయం తీసుకొన్నాము. మా తెలివి, శ్రమ, వనరులు, బలం, బలహీనతలు ఏవో తెలుసుకొని 500 పైగా జాతీయ స్థాయి అవార్డులు వచ్చేలా, అందరూ శ్రమించారు ఇక్కడ. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఓ రకంగా కేంద్రం మీద తప్పితే, అన్ని విధాల సంతోషంగా వున్నాము.

మీ మీద అస్సలు బాధ, కోపం లేదు. పైగా ఇన్నాళ్లకైనా మా నెత్తిన పాలు పోసారని, తలచుకొన్నప్పుడల్లా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని, చాలా సార్లు మనసులో అనుకొన్నాము.

ఇంకా ఇన్నేళ్లైనా, మేము అన్నీ త్యాగం చేసి వచ్చేసినా, తిడుతూ వుంటే, మాకు బాధ వేస్తోంది. మాది ఒకే ఒక చిన్న కోరిక, సోదరులుగా… చేతకాని మీ నాయకులు అలాంటి మాటలు మాట్టాడినప్పుడు సంతోషించకండి, చప్పట్లు కొట్టకండి.

కసిగా మాతో పోటీ పడండి అభివృద్ధిలో. అదే మేము కోరుకొనేది. ఓ ఉత్తర కొరియా, ఓ పాకిస్తాన్ లెక్క పొరుగు దేశాల మీద కసిని అభివృద్ధి చేసుకొన్నట్టు కాకుండా, మీ జీవితాల నాణ్యతా ప్రమాణాల మీద, మీ నాయకులను నిలదీసి, పాలించుకోండి. మా మీద మీ నాయకుల ఏడుపుతో, వారి అసమర్థను కప్పేసుకొంటున్నారు. చిన్నపిల్లాడు ఇంటిలో చాడీలు చెబుతూ వుంటే విసుగొస్తొంది. అటువంటి సానుభూతే మీ మీద. అలాంటి సానుభూతిని, సాటి తెలుగు సోదరులైన మీ మీద చూపడం మాకూ ఇష్టం లేదు.

పోటీలో ఎవరు అభివృద్ధి సాధించినా, తెలుగు జాతి కీర్తి నిలబడుతుంది. దశాబ్దాలు కలిసి వున్నాం అనే చిన్నపాటి సోదర భావంతో ఆలోచించి, మీ బతుకు బాట, తలరాత మీరే వ్రాసుకోండి. దేశంలో, ప్రపంచంలో… వాళ్ళు తెలుగోళ్లు అనే అసూయను చూసి, గర్వపడేలా.

Link to comment
Share on other sites

3 hours ago, SonyKongara said:

idhi rasina yedava sannasi evari bro, sml_gallery_12949_2_67493.thumb.gif.9502

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...