Jump to content

శశి


Crazy_Robert

Recommended Posts

ఏవో ఇదివఱకేన్నడూ ఎరగని కోర్కెల నన్నిటిని  బయటకు  లాగుకొని వచ్చెను. వానికి అంతములేదు. ఆ కోర్కెలు ఫలించ వెన్నడునూ. అందరానివి. మానవశక్తి కతితములు.  ఆహ, ఆ స్వరముల  సౌందర్యము? ఆ గాలితో యూగు ఆకుల గీతములతో,  ఒడ్డును ముద్దిడు అలలశబ్దముతో ఆ సౌందర్యమున ధ్వనించు ఆత్మగానముతో కలిసి మెలసి ఒకటే ఆ వెన్నెల మార్ధవమును, ఆ మేఘముల రంగులను ,  ఆ ఆకసపు నీలపులోతును, ఆ నీటి ప్రకాశమును, ఆ భూమి సౌజన్యమును, ఆ పచ్చిక లావణ్యమును, చెట్ల నీడల నిశ్శబ్దమును,  పరిమళమును, అంతటిని ఆత్మ సామిప్యమునకు  కొని వచ్చి వడిచినదా గానము. "కావలెను " "కావలెను " మహాతృష్ణతో అరచినది. "కావలెను. ఏమి కావలెనో తెలియదు. ఈ సౌందర్యముకన్న,ఈ దేహ సౌఖ్యముకన్నఅధికమ్తేనది,  శాశ్వతమ్తెన దెదియో కావలెను" అని నరనరముల నుండి  భూమి రంధ్రముల నుండి, చేట్లయాకుల చిన్ననోళ్ళనుండి,చంద్రకిరణములనుండి ,ఆ జలకణముల నుండి మహాబాధతో విలపించినదా  గానము. దుఃఖము భరింపరానిద్తెనది. సౌందర్యము నిలువదు.  మేఘ- ములు పరువేత్తుచున్నవి. రంగులు మాయమ్తెనవి చూచునంతలో, అనుభవించునంతలో,    ముట్టుకోనునంతలో నిలువక - పోవుచున్నది  సౌందర్యము. యేది యేది ఆ సౌందర్యము అని పర్వులేత్తినది ఆ గానము.
ఆ గాన మధుర్యమునకు  కృష్ణుడు నిద్రావివశుడయ్యెను.
శశిరేఖ కండ్ల నుండి  జలజలమని నీరు వ్రాలెను.

 

Link to comment
Share on other sites

Just now, Crazy_Robert said:

ఆ వెన్నెల మార్ధవమును, ఆ మేఘముల రంగులను ,  ఆ ఆకసపు నీలపులోతును, ఆ నీటి ప్రకాశమును, ఆ భూమి సౌజన్యమును, ఆ పచ్చిక లావణ్యమును, చెట్ల నీడల నిశ్శబ్దమును,  పరిమళమును, అంతటిని ఆత్మ సామిప్యమునకు  కొని వచ్చి వడిచినదా గానము.

bl@st

Link to comment
Share on other sites

సృష్టిలోని మాధుర్యం ప్రేమ అయితే 
ఆ ప్రేమకి అసలు సిసలయిన రూపం శశిరేఖ..!
గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోయే 
పచ్చి నిజం శశిరేఖ..!
చలం గారి ముద్దుబిడ్డ శశిరేఖ..!
చంచలం లాగ కనిపించే సంచలనం శశిరేఖ ..!
చివరికి చలనం లేనిది అయిపోయింది శశిరేఖ..!
పదహారువేల మంది తో ఉన్న కృష్ణుడు దేముడూ, ప్రేమ మూర్తి.. అయితే.. 
ప్రేమ తో నే చివరి వరకూ బ్రతికి ప్రేమతోనే చచ్చిపోయిన 
ప్రేమ తో నే కడవరకు ప్రయాణం సాగించి 
ఆ ప్రణయ ప్రళయంలోనే జీవితాన్ని ముగించిన దేవత కాదా శశిరేఖ..?!
ప్రాణానికి ప్రాణం అంటూ ప్రేమించిన ప్రేమ 
చివ్వరిదాకా నిలుపుకోరెందుకు
ప్రేమ నశించిన బంధానికి విలువ ఏంటి 
అంటూ నిలదీసిన శశిరేఖ..!
తనని ప్రేమించిన వారికే ఆ ప్రేమ దక్కుతుందని 
ఖరాఖండీగా తేల్చి చెప్పేసిన శశిరేఖ..!
ప్రేమ లేని పెళ్ళిళ్ళు ఎందుకు 
ప్రేమ ఉన్నాక అసలు ఇక పెళ్లి ఎందుకు
కొన్నాళ్ళకి ప్రేమ పోతోంది ఎందుకు
అంటూ.. ఇప్పటికీ సమాధానాలు రాని ప్రశ్నలని
నిర్భయంగా బయటపెట్టిన శశిరేఖ..!
సంస్కారవంతుల ముసుగులలో ఉండే ఈ నాగరికులకి 
అర్ధం కాని పెద్ద చిక్కు ముడి శశిరేఖ..!
ప్రేమకీ బంధాలకీ స్త్రీ కీ స్వేచ్చకీ 
సంఘం పెట్టిన ఆంక్షలని 
తోసిరాజన్న శశిరేఖ ..!
మనసుకి ఎప్పుడూ మలినం అంటనిది,
మనసులో ఒకటి బయటికి ఒకటి 
ముసుగు ఎప్పుడూ ధరించనిది.
ఏ కష్టాలకీ జడవనిది.. శశిరేఖ..!
సోమరితనంతో జీవితాన్ని గడిపేసే చవటాయిలకి (కృష్ణుడు)
క్రూరత్వాన్ని మనసు నిండా నింపుకున్న రాక్షసులకి (సుందర రావు)
ప్రశ్నించే దమ్ము లేని తలదించుకు బ్రతికే దద్దమ్మలకి (రామా రావు)
ఎవ్వరికీ దక్కనిది శశిరేఖ..!
ప్రేమించామంటూ ఆమె వెంటపడిన వారెవ్వరికీ లొంగని శశిరేఖ 
ప్రేమకి మాత్రమే ఎప్పుడూ తలవంచిన శశిరేఖ..!
శరముల వంటి సందేహాలని సంఘానికి ఎక్కుపెట్టిన శశిరేఖ
సమాధానం చెప్పే వారే లేరని తెలిసి 
పగలబడి నవ్వి నవ్వి అలసి విశ్రాంతి తీసుకున్న శశిరేఖ..!
ఎక్కడున్నాడో తెలియని ఈశ్వరుడికి గుడి కట్టినవారు 
కళ్ళముందే ఉన్న ప్రేమమయిని లోకం లోంచి సాగనంపేసారు
అసంపూర్ణ మనసుల మనుషులతో ఇమడలేక 
అర్ధాయుష్షుగా వెళ్ళినపోయిన సంపూర్ణ వ్యక్తి శశిరేఖ..
కాకిలాగ వందేళ్ళు కాదు.. 
బ్రతికిన అన్ని రోజులు హంస లాగా 
ఠీవితో బ్రతికిన రాజ హంస శశిరేఖ..!
కోల్పోతే తప్ప ఆమె ఏంటో అర్ధం కాలేదు ఎవ్వరికీ 
విలువయిన వజ్రం కదా ఈ శశిరేఖ..!
రోజుకి ఒకరిని ప్రేమించమనే
సందేశం కాదు ఆమెది..
పవిత్రతకి అర్ధం 
శరీరానిదా మనసుదా 
అనే సందేహం ఆమెది..!
ఎంత అర్ధం చేసుకున్న వాళ్లకి అంత..
ఎలా అర్ధం చేసుకుంటే అలా..
అంతే ఈ శశిరేఖ..!
ఎవరేం ఊహించుకున్నా..
ఎవరెన్ని తిట్టుకున్నా..
ఎవరెలా వెలేసినా.. 
ఎవరేం అనుకున్నా..
అది ఆమె తప్పు కాదు . ?!
ప్రేమ అంటే హంగులు ఆర్భాటాలు ప్రదర్సనలు.. అంతేనా..?
వంపులు సొంపులు కన్నెపిల్లలు పదహారేళ్ళు.. అంతేనా..?
అబద్ధాలు నిరూపణలు పెళ్ళిళ్ళు పిల్లలు ఏడుపులు.. అంతేనా..?
ప్రమాణాలు కోరికలు బహుమతులు తళుకులు బెళుకులు,, అంతేనా..? 
ఇంతే తెలుసు కొందరికి..
అయితే వీరికి.. 
చలం గారి అచంచల మూర్తి
హృదయవాసిని ఈ శశిరేఖ..
పరిచయం కావాల్సిందే..!

Link to comment
Share on other sites

Sasirekha is the story of a woman and her love for 3 different men at 3 different stages in life. Chalam explores the concept of love at different stages of life so beautifully. As a teenager, she's attracted to Krishna who praises her and worships her like a deity. Once she matures and grows into an adult, she falls for Sundar Rao who comes across as an intelligent man with clear views on everything in his life.

recent ga edho cinema chusthe idhe anipinchindhi.. but still.. sasirekha novel ni cinema theesthe classic la migilipoddhi 

Link to comment
Share on other sites

 మన అభిప్రాయాలు ఉన్నతములైనప్పడు మన సంబంధం కూడా ఉన్నతమే అవుతుంది.తప్ప తప్పకాకపోవడం, మన వుద్దేశ్యాల్ని పట్టివుంటుంది గాని,మనం చేసే పనుల్ని బట్టి వుంటుందా ఇంకొకరిమీదప్రేమ పెట్టుకొని  తమ భర్త లనేవాళ్ళతో పడి వుండటం లేదూ?అది పాపం కదూ? అదే వప్పకునేప్పడు, మన ప్రేమ తప్పా

Link to comment
Share on other sites

వాలిన సూర్యడామే  శిరోజములపై గవక్షములోనుండి దాని కల్లుకోనిన సూర్యకాంతము తిగే ఆకులలోనుండి  మేరయుచుండెను. ఆ విశాల నేత్రముల నుండి కన్నీరు జలజల రాలుచుండెను.వెక్కివెక్కి వచ్చు దుఃఖముతో  వక్షము కదలుచుండెను.వ్రాత ఒక్క అక్షరంమ్తెనను సాగలేదు. వ్రాయబోవునప్పటికి పోరలిపోరలి దుఃఖమువచ్చి కాగితము, చేతులు   తదియుచుండెను  

Link to comment
Share on other sites

1 minute ago, BeerBob123 said:

E thds enduku manaki poat on Ammu ba

lite bro.. nenu alochinche angle janalaki nacchatledhemo.. so aa topic vodilesi.. elago eeroju na mood dhobbindhi kabatti... ma shashi darling gurinchi chadhuvukuntunna... at least oka adadhanipaina respect ayina vosthadhemo... 

Link to comment
Share on other sites

మొదట పురుషుడు స్త్రీని బలహినురాలిని  చేసి స్వాధీనం చేసుకున్నాడు. సృష్టియందు పురుషుడికి స్త్రికంటే ఎక్కువ శరీరబలం వుండడంచేత స్త్రీని తనసోత్తు చేసుకొన్నాడు. తననుంచి  వెళ్ళిపోతే  యీర్ష్యకనుక  శాశ్వతంగా తనదాన్ని చేసుకోడానికి పెళ్ళి అనే దాన్ని కనిపెట్టినారు. పురుషుడు తన వాడవుతాడు  కదాయని స్త్రి కూడా సంతోషపడ్డది. వివాహానికి అధికారం ఇచ్చేందుకు ఈ శ్వరున్ని కూడా తీసుకువచ్చి పెట్టినారు. అన్ని బానిసత్వాలూ కూడా పోవలసిందేగని, ఎట్లాగో పోకుండా, మహాబంధమ్తె  చుట్టుకుంది.

Link to comment
Share on other sites

Just now, Crazy_Robert said:

మొదట పురుషుడు స్త్రీని బలహినురాలిని  చేసి స్వాధీనం చేసుకున్నాడు. సృష్టియందు పురుషుడికి స్త్రికంటే ఎక్కువ శరీరబలం వుండడంచేత స్త్రీని తనసోత్తు చేసుకొన్నాడు. తననుంచి  వెళ్ళిపోతే  యీర్ష్యకనుక  శాశ్వతంగా తనదాన్ని చేసుకోడానికి పెళ్ళి అనే దాన్ని కనిపెట్టినారు. పురుషుడు తన వాడవుతాడు  కదాయని స్త్రి కూడా సంతోషపడ్డది. వివాహానికి అధికారం ఇచ్చేందుకు ఈ శ్వరున్ని కూడా తీసుకువచ్చి పెట్టినారు. అన్ని బానిసత్వాలూ కూడా పోవలసిందేగని, ఎట్లాగో పోకుండా, మహాబంధమ్తె  చుట్టుకుంది.

marriage ante idhenemo.. love ayina ..arranged ayina.. 

Link to comment
Share on other sites

బ్రతకడమే ఉపకారం. సద్గుణాలు  నేర్చుకోడానికి. నీ శక్తుల్ని అభివృద్ది  చేసుకొని,వికసింపజేకోడానికి, యీ శ్వరుడు నిన్నిక్కడికి పంపించాడు.దాని కోసం పాటుపడాలి.

Link to comment
Share on other sites

Goppa Goppa adallu  mana ammallo..akkallo..ammammalo.. bharyalo undocchemo kani..

Goppa goppa ammailu just pusthakallone unnarura abbai...

adhi kuda vallani aradhinche nalanti vallu pogide kavithallo.. kathallo..

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, Crazy_Robert said:

Goppa Goppa adallu  mana ammallo..akkallo..ammammalo.. bharyalo undocchemo kani..

Goppa goppa ammailu just pusthakallone unnarura abbai...

adhi kuda vallani aradhinche nalanti vallu pogide kavithallo.. kathallo..

Vellu kuda ammayile so vallu unnara leda annadi kadu point chuse kallallo undi problem ..just saying dear brother :)

Link to comment
Share on other sites

3 hours ago, Amrita said:

Vellu kuda ammayile so vallu unnara leda annadi kadu point chuse kallallo undi problem ..just saying dear brother :)

Neekinka akkada vishayam ardham kaledhu akka ...

ammai ga unnapudu Ye adapilla ki jeevitham ante teleedhu ... Pellayyako.. Thallayyako ame lo assal cinema start avthadhi .. appatidhaka maharani la bathikinollu kuda sardhukupoyi bathakalsi vosthundhi .. alantapude aa ammai lo magadu dhevatha ni chusthadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...