Jump to content

భారతీయ రైల్వేకి


Yaman02

Recommended Posts

రైళ్లలో ఏ వస్తువునూ వదలడం లేదు!

0419384BRK-BEDSHEETS.JPG

న్యూదిల్లీ: రైళ్లలో చోరీ చేయడానికి వీలున్న ఏ వస్తువునూ కొందరు ప్రయాణికులు వదలడం లేదు. ఫ్యాన్లు, బెడ్‌ షీట్లు, మెత్తలు.. ఇలా అన్ని వస్తువులూ భారీగా చోరీలకు గురవుతున్నాయి. తాజాగా, రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం... 2017లో ప్రయాణికులు రైళ్లలోంచి 1.95 లక్షల టవల్స్‌, 81,736 బెడ్‌ షీట్లు, 55,573 మెత్తల కవర్లు, 5,038 మెత్తలు, 7,043 దుప్పట్లను చోరీ చేశారు. ఇవే కాకుండా, 200 టాయిలెట్‌ మగ్గులను, దాదాపు 1,000 ట్యాప్‌లను, 300 ఫ్లష్‌ పైపులను దొంగిలించారు. అంతేగాక, ఫ్యాన్లు, కిటికీలకు ఉండే ఐరన్‌ గ్రిల్స్, రైల్వే ట్రాక్స్‌ కూడా చోరీకి గురయ్యాయి. ప్రయాణికులు చోరీ చేసిన ఈ మొత్తం వస్తువుల విలువ రూ.2.97 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. చోరీ చేసిన వాటిల్లో కొన్నింటిని రైల్వే పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ప్రయాణికులు చోరీ చేసిన వస్తువులు వివరాలను కూడా రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో 79,350 టవల్స్‌, 27,545 బెడ్‌ షీట్లు, 21,050 మెత్తల కవర్లు, 2,150 మెత్తలు, 2,065 దుప్పట్లను ప్రయాణికులు చోరీ చేశారు. చాలా దూరం ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం రైల్వే ఈ సదుపాయాలు కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఆరు నెలల్లో ఈ చోరీల వల్ల రైల్వేకు వచ్చిన నష్టం రూ.62 లక్షలు. రైళ్లలో అందించే ఒక్కో బెడ్‌ షీట్ ధర.132, టవల్‌ ధర రూ.22, మెత్త ధర రూ.25 ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికులకు అందించిన ఈ వస్తువులు బాధ్యతగా తమకు తిరిగి అప్పగించాల్సి ఉంటుందని వారు అన్నారు.

రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు పలు వస్తువులను చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన షబ్బీర్‌ అనే ఓ వ్యక్తి మూడు దుప్పట్లు, ఆరు బెడ్‌ షీట్లు, మూడు మెత్తలు చోరీ చేసి తీసుకెళుతుండగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి అరెస్టు చేశారు. ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ఆ వ్యక్తి... తన బ్యాగులో వాటన్నింటినీ పెట్టుకుంటుండగా చూసిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ రైల్వేకి ఇటువంటి చోరీల వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు వస్తున్నాయి.

Link to comment
Share on other sites

2 minutes ago, JAPAN said:

veellantha professional ga ticket book chesukoni mari dongathanam chesthunnara ayithe

AC class lo particular ga Napkins nokkestaru saale gaallu , antuke ippudu ivvatla attenders...Em kakkurtho edavalaki..

Link to comment
Share on other sites

1 minute ago, mmharshaa said:

naku doubt ee attenders kooda nokkesi passengers meeda tosestaaru

Attenders nokkesthe handover to laundry time lo lekka chupinchaali vaadu, theda vasthe vaadi jobulonchi pay cheyyali...

Before they used to give napkin by default in AC class linen pack now bcoz of this chori ippudu adigithe gaani ivvatla although some zones like SCR still are giving by default.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...