Jump to content

Devuda trumph tweer pk valla?


whatsapp

Recommended Posts

banner1.jpg
 

 BREAKING NEWS :

logo1.png
 
  1.  Home
  2. లోకల్
  3. పవన్ లేఖకు ట్రంప్ ట్వీట్ ....

పవన్ లేఖకు ట్రంప్ ట్వీట్ ....

  • LOCAL
  •  
  •  12-Jan-2019
  •  
  •  147
2ac7309d6055e62b0c1e46771c7bca28.jpg

 

అతను నిజంగా ఆరడుగుల బుల్లెట్

జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేఖ తో  స్పందించిన అగ్రరాజ్య అధ్యక్షుడు

ప్రవాస భారతీయుల హెచ్ 1బీ వీసా సమస్యలు పరిష్కరించాలని ట్రంప్ కు లేఖ రాసిన పవన్ కళ్యాణ్ 

 త్వరలో నిబంధనల సరళీకరణ.... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

ప్రవాసీలకు ఊరట....హెచ్‌1బీ వీసాదారుల్లో అనిశ్చితికి తెరపడే అవకాశం

అతను నిజంగా ఆరడుగుల బుల్లెట్.... ఎవరి మాటా వినని, ఎవరిని లెక్క చేయని అగ్ర రాజ్య అధ్యక్షుడు సైతం అతని లేఖ కు సానుకూలంగా స్పందించాడు. అతను కోరినట్లుగా సహాయం చేయడానికి కిందికి దిగి వచ్చాడు. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్  సైతం ప్రవాస భారతీయుల హెచ్ 1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తామని, ప్రవాస భారతీయులకు సహాయం చేసే చర్యలు తీసుకుంటామని స్వయంగా మాటిచ్చాడు. మరి అలాంటి మాటలు ట్రంప్ నోటి రావడానికి కారణం ఎవరు. ఆయన మరెవరో కాదు జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

ఇటీవల పవన్ జనసేన ప్రవాస గర్జన కార్యక్రమం నిమిత్తం యూఎస్ఏ కు వెళ్ళాడు.  పవన్ USA కు వెళ్ళినప్పుడు H1B వీసా హోల్డర్ల యొక్క దురవస్థను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. వీసా కోసం వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నాడు. వీసా పొందేందుకు యూఎస్ఏ ప్రభుత్వం భారతీయులకు విధిస్తున్న షరతులు, ఆంక్షలు విన్నాడు. ఇవన్నీ విని,  చూసిన తరువాత పవన్ స్పందించాడు. ప్రవాస భారతీయుల హెచ్ 1బీ వీసా సమస్యలు పరిష్కరించడానికి తనవంతు పాత్ర పోషించాలని భావించాడు. అందుకే ప్రవాస భారతీయుల హెచ్ 1బీ వీసా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక మంది యూఎస్ఏ సెనేటర్లను సంప్రదించి, వారి తో పవన్ చర్చలు చేశాడు.  ఇక అంతటితో ఆగకుండా ప్రవాస భారతీయుల హెచ్ 1బీ వీసా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఏకంగా USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు 2 పేజీ ల  లేఖ రాశాడు. 

పవన్ లేఖ ప్రభావం డోనాల్డ్ ట్రంప్ స్పందించాడు. వలస విధానంపై నిత్యం రుసరుసలాడే డోనాల్ట్‌ ట్రంప్‌ నోటి నుంచి హెచ్‌1 బీ వీసా వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నాం. నిబంధనలు సరళీకరిస్తున్నాం అనే మాటలు వచ్చాయి. వేల మంది టెకీల్లో కొత్త ఆశలు చిగురించే ప్రకటన ఇది.. శాశ్వత పౌరసత్వం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న లక్షల మందికి తీయని సంక్రాంతి కానుక ఇది. 

హెచ్‌1 బీ వీసా వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నాం. నిబంధనలు సరళీకరిస్తున్నాం. మీరు అమెరికాలోనే ఉండేవిధంగా అవకాశాలు కల్పించబోతున్నాం. దేశ పౌరసత్వం పొందేందుకు కూడా మార్గం ఏర్పరచబోతున్నాం. మంచి ప్రతిభ, విశేష నైపుణ్యం ఉన్నవారు అమెరికాలో తమ విద్య, ఉద్యోగావకాశాలు కొనసాగించుకోవాలన్నది మా అభిలాష అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.  వలస విధానంపై ఉక్కుపాదం మోపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ఈ విషయం ప్రకటించడం విశేషం. 

హెచ్‌1బీ ద్వారా పౌరసత్వం పొందే అవకాశాలు ఇన్నేళ్లూ లేవు. ఇపుడు తొలిసారిగా ట్రంప్‌ ప్రతిపాదిస్తుండడం విశేషం. ఈ నిర్ణయం ఓ రకంగా వీసా విషయంలో ఓ భరోసా. అక్కడున్న వారికి, మన దేశం నుంచి వెళ్లే వారికీ తమ విద్యా ఉద్యోగ అవకాశాలు ప్లాన్‌ చేసుకోడానికి ఓ అవకాశం కల్పిస్తుంది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక- అమెరికా ఫస్ట్‌ నినాదంతో భారతీయ టెకీల గుండెల్లో గుబులు రేపారు. హెచ్‌-4 వీసా ఎత్తేశారు. అమెరికాలో మాస్టర్స్‌ చేసినవారికే తొలి ప్రాధాన్యం అంటూ హెచ్‌1బీ వీసా దరఖాస్తుల వడపోతకు ఓ దిశను ఏర్పరిచారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అనేక నియమాలు తెచ్చారు. ఫలితంగా అనేక అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలు కూడా భారతీయులకు బదులు అమెరికన్లనే ఉద్యోగులను పెట్టుకోవడం మొదలుపెట్టాయి. తాజా ట్వీట్ల ప్రకారం- ఆయన నైపుణ్యం ఉన్న వారి హెచ్‌1బీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. 

పవన్ ఒక్క లేఖ ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా దిగివచ్ఛేలా చేయడం పవన్ కళ్యాణ్ కు ఉన్న శక్తికి నిదర్శనం. 

అయితే పవన్ రాయడం వల్లే ట్రంప్ స్పందించాడు అని కాదు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏ లీడరు దృష్టి పెట్టని అంశాన్ని పవన్ మాత్రం అర్ధం చేసుకున్నాడు , అందుకే లేక రాసాడు అని జనసేన సెంట్రల్ సెల్ వైస్ చైర్మన్ శాంతి ప్రసాద్ సింగ్లురి ట్వీట్ చేసారు. దీని పై అయన చేసిన కొన్ని ట్వీట్లను మీరు చదవొచ్చు. 

 

This is the Power of Pawan Kalyan. When Pawan went to USA and after seeing the plight of H1B Visa holders, he responded and interacted with many Senators and even wrote Letter to President of USA.

Yellow people here, trolled and heckeled that Pawan is immature@realDonaldTrump

 
 
 
 

 

 

 

Tags : pawan kalyandonald trump h1b visapk on h1b visa
 
102Shares
 
 
 
 
sidebar-banner4.jpg

About Us

telugucircles.com is a digital news platform reporting and writing on issues in India, with a specific focus on the Telugu states. It was founded by Madhu Sudhan Reddy Sandhi in 2018.

SUBSCRIBE

© 2018, News. All rights reserved

Designed & Developed By Arka Infoteck

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...