Jump to content

ఖర్చులు తగ్గించుకోండి ఇలా..


kevinUsa

Recommended Posts

న్ని జాగ్రత్తలు పాటిస్తే పెళ్లి ఖర్చుల్ని తగ్గించుకోవచ్చని ‘డోలీ సాజాకే రఖ్‌నా’ సహవ్యవస్థాపకురాలు రాగినీ శ్రీవాస్తవ, బ్యాండ్‌ బాజా.కామ్‌ సీఈఓ సచిన్‌ సింఘాల్‌ తదితర వెడ్డింగ్‌ ప్లానర్లు సూచిస్తున్నారు. ఈ సూచనలు అన్ని వేళలా, అందరికీ నచ్చకపోయినా.. కొన్నయినా ఉపయోగపడతాయని వారు అంటున్నారు.

3hyd-main2g_1.jpg

* ఇతరుల్ని పెళ్లి ఖర్చుల్ని చూసి వారిని అనుకరించొద్దు. మీ ఆర్థిక స్థోమతను బట్టి ప్లాన్‌ చేసుకోండి.

* నగరం/పట్టణం నడిబొడ్డున కాకుండా.. ఊరి శివార్లలో పెళ్లి మంటపాల్ని బుక్‌చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.

* హోటళ్లు, రిసార్టుల్లో కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో, ఒక మోస్తరు ఫంక్షన్‌ హాళ్లలో పెళ్లి పెట్టుకుంటే.. పన్నుల తలనొప్పి ఉండదు.

* ముహూర్తాల సమస్య లేకపోతే...ఆఫ్‌సీజన్‌లో పెళ్లిపెట్టుకుంటే ఫంక్షన్‌ హాళ్లు కాస్తంత చౌకగా దొరుకుతాయి.

* పెళ్లిని వారాంతంలో కాకుండా వారం మధ్యలో పెట్టుకుంటే ఖర్చులకు కొంత కళ్లెం వేయొచ్చు.

3hyd-main2e_1.jpg

* ఖరీదైన పెళ్లి ఆహ్వాన పత్రికలు కాకుండా.. సంప్రదాయ ఆహ్వాన పత్రికలవైపు మొగ్గండి. లేదంటే ఓ డిజిటల్‌ వీడియోను తయారుచేయించి.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా పంపండి. సొంత వెడ్డింగ్‌ కార్డుల్ని డిజైన్‌ చేసుకునే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించుకోండి.

* ముఖ్యులు, ఆప్తులు, తప్పకుండా పిలవాల్సిన స్నేహితులు, బంధువుల్నే పెళ్లికి ఆహ్వానించండి. మొహమాటానికి ముఖపరిచయస్తుల్ని సైతం పిలిచి.. ఖర్చులు పెంచుకోకండి.

3hyd-main2d_1.jpg

* అందర్నీ ఆకట్టుకునే మంచి వంటకాల్నే పరిమితంగా వండించండి. లెక్కకు మించి వండించడం వల్ల వృథా ఎక్కువ. ఖర్చూ పెరుగుతుంది.

* పెళ్లి తేదీ ఎలాగూ తెలుసుకాబట్టి.. చాలా ముందుగానే ఆఫ్‌సీజన్‌లో, డిస్కౌంట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెళ్లి దుస్తుల్ని కొనుక్కోండి.

3hyd-main2f_1.jpg

* భోజన ఏర్పాట్లు, పువ్వులు, అలంకరణ, అద్దెలు, దుస్తులు, నగలు.. ఇలా ఏయే ఖర్చులుంటాయో ముందే లెక్కరాసుకోండి. ఖర్చు మరీ అదుపు తప్పుతుందని అనుకున్నప్పుడు మీరు రాసుకున్న జాబితాలో మొదటి, ద్వితీయ ప్రాధాన్యాల్ని ఎంచుకుని.. మూడో ప్రాధాన్యాన్ని పరిహరించడానికి ప్రయత్నించండి.

* టేబుళ్ల వద్ద కూర్చుని తినే భోజనాల కన్నా.. ఫ్యామిలీ తరహా బఫేల వైపు ఎక్కువగా మొగ్గుచూపండి.
* ఫొటోల పేరుతో భారీగా ఖర్చుచేయొద్దు.
* పెళ్లిళ్ల సందర్భంగా మద్యం సరఫరాను నివారించండి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...