Jump to content

డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ


snoww

Recommended Posts

ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మంగళవారం స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకెలాంటి సమాచారం లేదని, ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను అపహరించినట్లు తాజాగా వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్‌ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం.

టీడీపీ యాప్‌లోకి ఓటర్ల మాస్టర్‌ డేటా..
ఓటర్ల మాస్టర్‌ డేటా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటా టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా ఆధార్‌ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్‌ డేటాలోనే ఆధార్‌ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Quote

డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

GHMC Taken Action Against RP Thakur Illegal Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. ప్రశాసన్‌ నగర్‌లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్‌ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Link to comment
Share on other sites

4 employees kanapadatledu ani whatsapp lo guntur dist  ps ki msg cheste 4 hours lo dsp level officer tho dongatanam case pettinodi daggara ki came

Enta fast ga work chestunaroi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...