Jump to content

ఆల్ ది బెస్ట్ జగనన్నా


Msdian

Recommended Posts

One of my telangana friend about jagan.

జగన్ మీద...తెలంగాణా వాడి ప్లెయిన్ టాక్.

2014 లో జగన్ స్టేజిల మీద స్పీచ్ ఇస్తే డోకు వస్తుండె. ఆ గొంతేందో..ఆ చేయి ఊపుడేందో అనుకునెడిది. సమైక్య రాష్ట్రం నినాదంతో మానుకోటలో రాళ్ళపూజ చేయించుకున్నపుడు తెలంగాణా వాదులు "అరే బాగైంది" అనుకుంటుండె. ఐనా తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరైనా అనుకుంటరా?. ఏమి అంత తొందర?. కాంగ్రెస్ లోనే ఉండి వాళ్ళ నాన్న లాగా మెల్లిగా ఎదగవచ్చు కదా అనుకుంటుండె. వాళ్ళమ్మ గారు చెల్లెలూ కూడా జగన్ విషయంలో కష్టపడి పోవటం చూస్తే అవసరమా వీళ్ళకు ఇవన్నీ అనిపిస్తుండె. తీన్మార్ మల్లన్న జగనాలును పొటుకు పొటుకు తిడ్తే చూసి బగ్గం నవ్వుకుంటుండె. ఇక ఆయన మీద కేసులు. ఏంటో లక్షల కోట్లు అవినీతి చేశాడట, క్విడ్ ప్రో కో అట. అని ఇవన్నీ విన్నాం. అప్పట్లో జైల్లో వేశారు అంటే బాగైంది అని సంతోషించాం. లేకపోతే తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడతాడా అనే కోపం ఉండింది. ఆ తర్వాత అతడి మీద నేరారోపణలు అనీ అవి రుజువు ఐతే శిక్ష తప్పదనీ అన్నారు. ఇక మనోడికి చిప్ప కూడే గతి అనుకున్నాం. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అందుకే జైలులో ఉంచుతున్నారనీ చదివినపుడు నిజమే అంత పని చేసినా చేస్తాడనుకున్నాం. మెల్లిమెల్లిగా ఏమర్థం అయిందంటే...అక్కడ ఏదో అమానవీయ చర్య ఏదో కొనసాగుతోంది అని. కేవలం జైలులో పెట్టడం కోసమే ఛార్జి షీట్ల మీద ఛార్జి షీట్లు వేస్తున్నారనీ అర్థమైంది. ఇదేంటీ ఇంత అవసరమా అనిపించింది. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంటు వచ్చింది. ఆయన కేసుల విషయంలో ఏ కదలికా లేకుండా ఉంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనేలాగా ఉందని తెలిసింది. నాలుగేళ్ళ పాలనలో ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేదు. ఆయనపై నేరారోపణలు ఉన్నాయి కానీ ఋజువు కాలేదు. అంతమాత్రానికే జగన్ దొంగ దొంగ  అంటూ ప్రచారం చేయటం చూస్తుంటే ఏదో తేడా కొట్టింది. యంగ్ రాజకీయ నాయకుడు కదా .. ఎందుకు ఇతడి రాజకీయ జీవితం తో ఆడుకుంటున్నారు అనిపించింది. అసెంబ్లీ లో ఆయన తీరు మొదట్లో నవ్వు తెప్పించేది. కానీ మాట్లాడేటపుడు విషయంలో పూర్తి అవగాహన తెచ్చుకుని మాట్లాడుతూ ఉన్నాడనిపించింది. అనవసర ఆరోపణలకంటే డేటా చేతిలో పట్టుకుని అధికార పార్టీ ని తిప్పలు పెడుతుంటే మొట్ట మొదటి సారిగా కొంత గౌరవం కలిగింది. ఈయన ఆషామాషీ వ్యక్తి కాదు. సం థింగ్ ఈజ్ దేర్ అనిపించింది. ఐనా అధికార పార్టీ వాళ్ళు ఆయనను మాట్లాడనీయకుండా మైకులు కట్ చేస్తుంటే అరే ఏంటి ఒక వ్యక్తి తో విబేధించవచ్చు కాని కనీసం మాట్లాడనివ్వవచ్చు కదా అని బాధ వేసింది. ఆ తర్వాత రోజాను ఒక సంవత్సరం సస్పెండ్ చేయటం, వైసీపీ నుండి 23 మందిని రాజీనామా చేయించకుండానే పార్టీ ఫిరాయించటం ఇత్యాదివి చూశాక జగన్ మీద సానుభూతి పెరిగింది. ఆ విషయమై జగన్ ఎంత మాట్లాడినా, మొత్తుకున్నా కనీసం పట్టించుకున్నట్లు కూడా కనబడలేదు అధికార టీడీపీ అధినేత. కనీసం స్పీకర్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో ఇదంతా జగన్ ని పొలిటికల్ గా వీక్ చేయటం కోసమే అని అర్థం అయింది. అంటే జగన్ అంత పవర్ ఫుల్ లీడరా అని ఆరా తీస్తే అప్పటి ఎలక్షన్లలో అధికార పార్టీ కి జగన్ పార్టీ కి ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదని తెలిసింది. అంటే రాష్ట్రంలో దాదాపు అంతే శాతం మంది జగన్ ని ముఖ్యమంత్రి గా కోరుకున్నారా?. ఏముందని కోరుకున్నారు?. మళ్ళీ సం థింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ గయ్ అనిపించింది.

ఇక జగన్ సానుభూతి యాత్రలు చూస్తే కామెడీగా ఉండింది. ఏంటో ఈయన అందరివీ చెంపలు నిమురుతాడు అనుకునేది. ఐతే ఒకసారి వైసీపీ కార్యకర్త ఐన ....గారి ఇంటర్వ్యూ చూశాను. ఆమె జగన్ ని డిఫెరెంట్ గా ప్రజెంట్ చేశారు. ఆయన చాలా ఎమోషనల్ వ్యక్తి అనీ ఎవరినైనా బాధలో అలా చూడగానే చాలా సహజంగానే వారిని దగ్గరికి తీసుకుంటాడనీ చెప్పించావిడ. ఆ తర్వాత కొన్ని వీడియోలు చూశాను. ఆవిడ చెప్పింది నిజమే అనిపించింది. కల్మషం లేకుండా సహజంగా అతడు ఆ విధంగా అవతలి వ్యక్తిని పలకరిస్తాడని అర్థమైంది.  ఇంకా గౌరవం పెరిగింది. ఆ తర్వాత అతడు ఇచ్చే స్పీచ్ లలో ఎంతో పరిణతి కనబడింది. ముందరిలా నవ్వుకోవడానికి వీలుగా కాకుండా ఏదో చేయాలనే తపన కనబడింది. అందుకు తాను ముఖ్యమంత్రి కావాలనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని అర్థమైంది. ముఖ్యంగా పాదయాత్రలు చేస్తూ వేల కిలోమీటర్లు నడవటం, ప్రజలను కలవడం, వాళ్ళ బాగోగులను తెలుసుకోవటం ఇత్యాదివి నన్ను అట్రాక్ట్ చేస్తాయి. ఎవరైతే గ్రామం గ్రామం ఈ దేశంలో తిరుగుతారో వారికి ఈ దేశ ఆత్మ అర్థం అవుతుంది. గాంధీజీ కావచ్చు స్వామీ వివేకానంద కావచ్చు రాహుల్ సాంకృత్యాయన్ కావచ్చు ..వీళ్ళంతా భారతీయ ఆత్మను పట్టుకోగలిగారు. ఈ దేశానికి ఏం కావాలో తెలుసుకోగలిగారు. గతంలో రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబు, వైఎస్ లు పాదయాత్రలు చేశారు. తప్పకుండా ఆ పాదయాత్ర వాళ్ళకు రాష్ట్ర సమస్యలను దగ్గరినుండి చూపించి ఉండింటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఏది తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి అనేది వీర గుణం. అందునా రాజకీయ నాయకులు ఏసీల్లో తిరుగుతూ ప్రజలకు మేలు చేసేస్తాం మార్పు తీసుకొస్తాం అనుకోవటం మూర్ఖత్వం. సింపుల్ గా చెప్పాలంటే నడిచి ప్రజల మధ్య కు చేరిన వాడు , వాడు ఎవడైనా సరే గొప్ప వాడు ఔతాడు. ప్రజలు వాడికి ఎన్నో నేర్పిస్తారు. అలా జగన్ , ఆయనలో ఉండే చిత్త శుద్ధి, కంపాషన్ తప్పకుండా ఆయనలో మార్పు తీసుకుని వచ్చి ఉంటుంది.అలా నడిచేస్తే  మార్పు ఏమీ రాదు అనుకుంటే, అది ఈ నేలను అవమానించడమే. మనం నడిచి ప్రజల దగ్గరకు పోయినా మనకూ మన ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 

తర్వాత జగన్ ఆయన మీద వేసిన కేసుల గురించి రోజూ ఏడుస్తున్నట్టు కనబడలేదు. ప్రతీ శుక్రవారం కోర్టులో హాజరు కావటం అనేది ఒక సివిలియన్ గా గౌరవమైన విషయం. నేరారోపణలు ఉన్నాయి. కానీ ఆయన గొప్ప నేత కాబట్టి కోర్టు ధిక్కారం చేయాలి అనుకోలేదు.  ఈ దేశ న్యాయవ్యవస్థ ను గౌరవించి బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించాడు. నేరం నిరూపించి శిక్ష వేస్తే న్యాయానికి తల ఒగ్గుతాడు అనిపించేలా గుడ్ సివిక్ బిహేవియర్ తో కనబడ్డాడు.   ఇక, ప్రత్యేక హోదా విషయం లో మొదటినుంచీ ఒకే వాణిని వినిపించారు జగన్. హోదాతో ఏమీ రాదు ప్యాకేజీ బెటర్ అని అనలేదు. ఒక వ్యక్తి ‌మీద గౌరవం ఎపుడు పెరుగుతుంది అంటే ఆ వ్యక్తి ఒకే మాట మీద నిలబడినప్పుడు. పూటకో మాట మాట్లాడేవాళ్ళు ఎంతటి వారైనా విసుగు తెప్పిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతం తప్పో ఒప్పో దానికే కట్టుబడి ఉండాలనుకునే వాళ్ళకు స్వతహాగానే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సిద్ధాంతాన్ని ఎక్జిక్యూట్ చేయటంలో పరిణతి లేకపోవచ్చు కానీ మాటైనా నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉందా లేదా అనేది మనుషులకు తెలిసిపోతూ ఉంటుంది. అందుకే జగన్ మీద గౌరవం ఇంకా పెరుగుతుంది.
ఇక మొన్నటి తెలంగాణ ఎలక్షన్లలో జగన్ పార్టీ లేనే లేదు. అదేంటి కనీసం కాలో చెయ్యో పెట్టవచ్చు కదా...కొంతైనా తన బలం చూపించుకున్నట్టు ఉంటుంది అనుకున్నాను. కానీ టీవీ నైన్ ఇంటర్వూ లో "నేను ఏ తెలంగాణ సమస్య విషయంలో కనీసం మాట్లాడలేదు ... అలాంటపుడు ఏ కారణం చెప్పి తెలంగాణా లో ఓట్లు అడగమంటారు"  అని విస్పష్టంగా చెప్పినపుడు అరే ఇతడు నిజాయితీగల ప్రజల మనిషి అనిపించింది. హాట్సాఫ్ అనుకున్నాను. నన్ను ఒప్పించగలిగాడు అనుకున్నా. పూర్తిగా థూథూ అనుకున్న నేను మెల్లగా జగన్ ని ఒప్పుకోగలిగానంటే మామూలు విషయం కాదు. అంత సులభంగా ఎవర్ని నమ్మే రకం అభిమానించే రకం కాదు నేను. ఏమైతేనేం మొత్తానికి అట్లా జగన్ కి అభిమానిని అయ్యాను. చంద్రబాబు పార్టీ అతడిని ఎన్ని విధాలుగా తొక్కేయాలని చూసినా ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఇంతింతై వటుడింతై ఎదిగిన ఎదుగుతున్న జగన్ ని నోరారా అన్నా అని కూడా పిలవాలని అనిపించింది.  జగనన్న ఈ సారి ఎలక్షన్లలో గెలిచినా గెలవకపోయినా తప్పకుండా ఒక గొప్ప లీడర్ గా ఎదిగి రాగలడనే నమ్మకం కలిగింది. కానీ రాష్ట్రం మార్పు కోరుకుంటోంది. జగనన్న మీటింగ్ లకు జనం ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు. సో... ముఖ్యమంత్రి ఆయనే కావాలని కోరుకుంటున్నాను. 

ఆల్ ది బెస్ట్ జగనన్నా...

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mettastar

    11

  • JambaKrantu

    9

  • Msdian

    8

  • solman

    5

Popular Days

Top Posters In This Topic

Just now, Idassamed said:

Kya hua Rey Kaka?

'NO comments' ani aa ardham kaka.  antha pedhadhi chadhavali antey kasatam ane cheppali

Link to comment
Share on other sites

4 minutes ago, JambaKrantu said:

Naa vote neeke Jagan.. Nuvvu maravani nenu oppukuntunna clip ready for Jagan biopic after 20 years..

ante inthaku mundu edava anaaa nee opinion?

anna apudu pule, ipudu pule

Link to comment
Share on other sites

naku jagan gurinchi telvadhu man , cheppu............ maku telsindhi okkate.......... CASES , Laksha Crores & Most corrupted ani..

atla ,  alanti candidate  CM antey  

Link to comment
Share on other sites

11 minutes ago, JambaKrantu said:

Naa vote neeke Jagan.. Nuvvu maravani nenu oppukuntunna clip ready for Jagan biopic after 20 years..

 

10 minutes ago, solman said:

CITI_c$y

 

Link to comment
Share on other sites

6 minutes ago, kingcasanova said:

ante inthaku mundu edava anaaa nee opinion?

anna apudu pule, ipudu pule

:giggle: AADU EPPATIKIII EDAVE.. AADINI Support chese vallu anta kante edavannara edavalu 

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

eesari TG lo poti cheyinchukondi 

daridram maakoddu pakka state ki pattali ani korukune daridramaina banisalu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...