Jump to content

మీరు నాకు పెద్దన్నయ్యలాంటివారు


snoww

Recommended Posts

మీదే పెద్దన్న పాత్ర

చంద్రబాబుకు మాయావతి సూచన
దిల్లీ, లఖ్‌నవూల్లో కీలక భేటీలు
రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌లతో వేర్వేరు సమావేశాలు
శరద్‌ పవార్‌, శరద్‌ యాదవ్‌, సురవరంలతోనూ సమాలోచనలు
ఈనాడు - దిల్లీ

ap-main1a_25.jpg

మీరు నాకు పెద్దన్నయ్యలాంటివారు. ఎప్పుడూ గౌరవిస్తూ వస్తున్నారు. అందువల్ల మీ మాటను నేను గౌరవిస్తాను. మోదీకి వ్యతిరేకంగా దేశంలోని మిగతా పక్షాలను కలిపే బాధ్యతను మీరే తీసుకోవాలి. పెద్దన్న పాత్ర పోషించాలి.

- మాయావతి

 

మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఒక్కతాటిపై నడవాలన్న ఆయన ప్రతిపాదనను రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, శరద్‌పవార్‌లు అంగీకరించినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ ‘ఉయ్‌ ఆర్‌ వన్‌’ అని చెప్పగా, మాయావతి మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించి అందర్నీ కలిపే బాధ్యతను భుజానకెత్తుకోవాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తీరిక లేకుండా చర్చల్లో మునిగారు. ఉదయం దిల్లీలో రాహుల్‌గాంధీతో, సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లతో కీలక సమాలోచనలు చేశారు. అంతకు ముందు దిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఎంపీ డి.రాజా, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఎల్‌జేడీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ఎన్డీయేతర కూటమి, దాని నాయకత్వానికి ఒక స్పష్టమైన రూపు తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబునాయుడు దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కూటమిలో కీలక భూమిక నిర్వహించబోయేందుకు అవకాశం ఉన్న పార్టీ అధినేతల అభిప్రాయాల ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనతో ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. ఉదయం రాహుల్‌గాంధీతో సమావేశమైనప్పుడు ఆయన ‘ఉయ్‌ ఆర్‌ వన్‌ (మనం అంతా ఒక్కటే)’ అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాన్నిబట్టి చంద్రబాబు జరిపే సమావేశాలు, వాటి ఆధారంగా తీసుకొనే నిర్ణయాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనే భావనను రాహుల్‌ వ్యక్తం చేసినట్టయ్యిందన్న అభిప్రాయం తెదేపాలో వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు లఖ్‌నవూ బయలుదేరి వెళ్లి తొలుత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, తర్వాత బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. 23వ తేదీ ఫలితాల తర్వాత వారు ఏం చేయాలనుకుంటున్నారు? జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారు? అన్న అభిప్రాయాలను చంద్రబాబువారి నుంచి రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే అఖిలేష్‌యాదవ్‌ యూపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాయావతి మాత్రం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి సిద్ధమయ్యారు. అందువల్ల ఆమె మనోభావాలను కూలంకషంగా తెలుసుకొని వాటిని రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లాంటి వారితో పంచుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. దీనితో చంద్రబాబు శనివారం రాత్రికి విజయవాడ వెళ్లాల్సి ఉన్నా దాన్ని మానుకొని తిరిగి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన మరోసారి రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అఖిలేష్‌, మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి చెప్పి స్పష్టమైన వైఖరికి వచ్చిన తర్వాత మిగతా అన్ని మిత్రపక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయొచ్చని తెదేపా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ap-main1b_17.jpg

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో ముందుకు..
ఆదివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో భవిష్యత్తు ఫలితాలపై ఒక స్పష్టమైన సరళి వెలువడే అవకాశం ఉన్నందున దాని ఆధారంగా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు 2004లో మాదిరి 145 సీట్ల దాకా వస్తే దాని నేతృత్వంలో కూటమి ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మిగతా ఏ ప్రాంతీయపార్టీకీ అన్ని సీట్లు వచ్చే అవకాశం లేనందున తప్పనిసరిగా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుందని, దానివల్ల మిత్రపక్షాలు త్వరగా కాంగ్రెస్‌తో కలిసి నడవానికి మానసికంగా సిద్ధమవుతాయని పేర్కొంటున్నారు. అలాకాకుండా కాంగ్రెస్‌ 100 సీట్ల దగ్గర ఆగిపోయి, యూపీలో ఎస్పీ, బీఎస్పీలకు 50కిపైగా సీట్లు వస్తే కర్ణాటక తరహా పరిస్థితులు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్‌ పెద్దపార్టీగా ఉన్నప్పటికీ భాజపాను దూరంగా పెట్టడానికి విధిలేని పరిస్థితుల్లో ప్రాంతీయపార్టీలకు మద్దతిచ్చి అండగా నిలబడాల్సి వస్తుందని చెబుతున్నారు. అందువల్ల ఇందులో ఏ పరిస్థితి ఎదురైనా పక్కకు మళ్లకుండా అందరూ కలిసికట్టుగా నడిచేలా ప్రతిపక్షాలను మానసికంగా సిద్ధం చేసే పనిని చంద్రబాబు చేస్తున్నట్లు తెదేపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలితాల తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి ఎవరు ఏపాత్రనైనా పోషించవచ్చని, అయితే పాత్రలు మారాయన్న కారణంతో కూటమి నుంచి దూరం కాకుండా కలిసికట్టుగా ఉండటానికే సిద్ధమైతే బాగుంటుందన్న భావనను చంద్రబాబు ఇప్పుడు అఖిలేష్‌, మాయావతి ముందు వ్యక్తంచేసినట్లు సమాచారం. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. మాయావతి ఏది చెబితే తాను దాంతో ఏకీభవిస్తానని అఖిలేష్‌యాదవ్‌ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు గంటసేపు అఖిలేష్‌తో మాట్లాడినప్పుడు ఆయన మిత్రధర్మానికి కట్టుబడి మాయావతి మాటకు తాను గౌరవం ఇస్తానని, ప్రస్తుతం ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఏకీభవిస్తానని, అందులో రెండో మాటకు తావులేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత చంద్రబాబు మాయావతి నివాసానికి వెళ్లి సుమారు గంటన్నరపాటు సమావేశం అయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ఏయే పార్టీలకు ఎంతమేరకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరించి 23 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ భాజపాకు మెజార్టీ రాదు కాబట్టి మోదీ అధికారం చేపట్టకుండా ఎన్డీయేతర కూటమి పక్షాలకు మద్దతివ్వాలని ఆమెను కోరినట్లు తెలిసింది. అందుకు ఆమెకూడా సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకత్వాల గురించి కాకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎన్డీయేతరపక్షాలన్నీ ఒక్కతాటిపై నడవాలన్నదానిపైనే వీరి మధ్య ప్రధాన చర్చ జరిగిందని, అందుకు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలిసింది.

ap-main1c_13.jpg

 

ap-main1d_11.jpg

 

ap-main1e_12.jpg

Link to comment
Share on other sites

Quote

దీనితో చంద్రబాబు శనివారం రాత్రికి విజయవాడ వెళ్లాల్సి ఉన్నా దాన్ని మానుకొని తిరిగి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన మరోసారి రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

@3$%

Link to comment
Share on other sites

9 hours ago, snoww said:

Didi okka statement isthey malli salla paduthadu @3$%

As long as pushpam batch is there cbn is welcomed any where

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

As long as pushpam batch is there cbn is welcomed any where

but if he gets 5 to 8 seats also welcome chestara ee range lo?

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

but if he gets 5 to 8 seats also welcome chestara ee range lo?

Good question if the others get good numbers who knows

They may not need jaggu support

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Good question if the others get good numbers who knows

They may not need jaggu support

They ante evaru ?

Congress or BJP?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...