Jump to content

లక్ష డాలర్ల వేతనం.. గూగుల్‌లో తెలుగు యువకుడి జాక్‌పాట్..

snoww

Recommended Posts

లక్ష డాలర్ల వేతనం.. గూగుల్‌లో తెలుగు యువకుడి జాక్‌పాట్..

636990188978213958.jpg

  • అతను నూజివీడు ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థి
నూజివీడు టౌన్‌, జూలై 17: నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన పూర్వ విద్యార్థి కుంటముక్కల శివరామకృష్ణ ఉద్యోగ వేటలో జాక్‌పాట్‌ కొట్టాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్‌ సంస్థలో లక్ష డాలర్ల వార్షిక వేతనం (మన కరెన్సీలో రూ.68.84లక్షలు)తో ఉద్యోగం సంపాదించినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ డి.సూర్యచంద్రరావు బుధవారం తెలిపారు. కృష్ణాజిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ 2008లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ప్రథమబ్యాచ్‌లో సమీకృత ఇంజనీరింగ్‌ విధానంలో ప్రవేశం పొందాడు. అనంతరం ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 9.27 గ్రేడ్‌తో బీటెక్‌ పూర్తి చేసుకుని కార్నెగిమెల్లన్‌ విశ్వవిద్యాలయం సిల్కాన్‌ వ్యాలీ నుంచి సాప్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో ఎంఎస్‌ పూర్తి చేశాడు. అనంతరం గూగుల్‌ మౌంటెన్‌వ్యూఫర్‌ వరల్డ్‌ ఐపీ టీమ్‌లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో సాప్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా నియమితుడైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా శివరామకృష్ణను డైరెక్టర్‌ సూర్యచంద్రరావు అభినందించారు.
Link to comment
Share on other sites

10 minutes ago, snoww said:

asalu ila US companies lo jobs vachina vallu e visa mida vastaru ikkadiki, L1 a  leka inka edaina visa vunda ??

Link to comment
Share on other sites

8 minutes ago, gambling_raja said:

asalu ila US companies lo jobs vachina vallu e visa mida vastaru ikkadiki, L1 a  leka inka edaina visa vunda ??

MS chesadu kada vayya 

Link to comment
Share on other sites

Advertisements eyya ledha. Okappudu, maa area la IIT ante ne telvadu. Oka saari maa relative ki IIT KGP la BTech metallurgy la seat occhindi. OC candidate, no reservation, after 2 long terms in Nellore Narayana. Appudu pedda advertisement vesaru on eenadu la. And a short news item too.

Link to comment
Share on other sites

endi vaa, eennad, sashi, abn, annni paper lo eedi nnews vundi

నూజివీడు ట్రిపుల్‌ఐటీ పూర్వ విద్యార్థి, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్‌లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. వెల్వడానికి చెందిన లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు అతనిని విద్యలో ప్రోత్సహించడంతో ఈ ఘనత సాధించాడు.

నూజివీడు: శివ వెల్వడంలోని లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి చదివి 564 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు. ఆరేళ్లు ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. 9.27 గ్రేడ్‌ పాయింట్లతో 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. పీయూసీ దశలోనే సాంకేతికతపై ఆసక్తితో పైథాన్‌ అనే ప్రోగ్రామింగ్‌ భాష, కోడింగ్‌ ప్రపంచానికి దగ్గరయ్యాడు. బీటెక్‌ డిగ్రీతో పాటు సీఎస్‌ఈ విభాగంలో మైనర్‌ డిగ్రీ కూడా పొందాడు. ఎలక్ట్రానిక్స్‌, డేటా బేస్‌, డేటా స్ట్రక్చర్‌, మేనేజ్‌మెంట్‌ సిస్టం, అల్గోరిథమ్స్‌, రోబోటిక్స్‌ వంటి అంశాల్లో పట్టు సాధించాడు. అదే సంవత్సరం నూజివీడు క్యాంపస్‌లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో టీసీఎస్‌లో ఉద్యోగం సాధించాడు. అందులో రెండున్నరేళ్లు ఉద్యోగం చేశాడు. టీసీఎస్‌కు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో గల సీఎంయూ (కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయం)తో అవగాహన ఒప్పందం ఉంది. ఈమేరకు సీఎంయూ వనరులను ఉపయోగించుకుంటూ ప్రపంచ స్థాయి ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందాడు. సీఎంయూలో ఎంఎస్‌ చేస్తూ 2019లో 3.6/4 గ్రేడ్‌ మార్కులతో పట్టా అందుకున్నాడు. అనంతరం శివ తన ప్రతిభతో గూగుల్‌లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. నాసా ఇంజినీర్లతో కలసి అంకుర సంస్థ కోసం కూడా పని చేస్తున్నాడు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య డి. సూర్యచంద్రరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అతనిని అభినందించారు.

అందరి ప్రోత్సాహంతోనే: శివరామకృష్ణ

తల్లిదండ్రులు లేని నన్ను సొంత బిడ్డగా ఆదరించి లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు విద్యలో ప్రోత్సహించారు. సీఎంయూలో చదివే అవకాశం రావడం నా అదృష్టం. డాక్టర్‌ డీబీ పాఠక్‌, సాఫ్ట్‌వేర్‌ డొమైన్‌ ఆచార్య జియాజాంగ్‌ల మార్గదర్శకం నా ఉన్నతికి దోహదపడింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...