Jump to content

చర్చకు సిద్ధం antunna Padula fights veerudu


snoww

Recommended Posts

బాబు తప్పుతో జగన్‌ గెలుపు!
02-08-2019 03:16:23
 
 
637003125859820835.jpg
  • బీజేపీతో ఉంటే టీడీపీ గెలిచేది
  • రాష్ట్రాభివృద్ధికి నాలుగేళ్ల కృషి
  • అంతా వృథా చేస్తున్న జగన్‌
  • రాజధానికి బ్యాంకులు దూరం
  • పెట్టుబడిదారుల వెనుకంజ
  • మోదీ వల్లే ఏపీ అభివృద్ధి
  • సహేతుకంగానే కేంద్రం వైఖరి
  • దీనిపై చర్చకు సిద్ధం
  • సుజనా చౌదరి స్పష్టీకరణ
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)
2018 మార్చి 8... కేంద్రంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీ కటీఫ్‌ చెప్పిన రోజు! ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే దురదృష్టకరమైన రోజుగా భావిస్తానని కేంద్ర మాజీ మంత్రి, ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆ రోజు అదే జరగకపోతే... ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేవారని అభిప్రాయపడ్డారు. ‘‘టీడీపీ చేసిన తప్పిదంవల్లే జగన్‌ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం సుమారు నాలుగేళ్లపాటు టీడీపీ-బీజేపీ కలిసి సాగించిన కృషిని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడా రాజధాని నిర్మాణ ప్రాజెక్టు నుంచి వైదొలిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి నెలకొంది’’ అని సుజనా చౌదరి పేర్కొన్నారు. బీజేపీలో చేరిన దాదాపు నెల రోజుల తర్వాత... తన నిర్ణయం వెనుక కారణాలను మరింత స్పష్టంగా బయటపెట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
 
వ్యూహాత్మక తప్పిదం...
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదాలవల్లనే టీడీపీ ఓడిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మోదీ హయాంలో దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు, తర్వాత ఎందుకు సరైన అంచనాలు వేయలేకపోయారో నాకు అర్థంకాలేదు. దాదాపు నాలుగేళ్లపాటు ఎన్డీఏలో కొనసాగి ఏపీలోని ప్రతి జిల్లాలో ఏదో ఒక కేంద్ర ప్రాజెక్టు అమలవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా బూచి చూపించి కేంద్రం నుంచి తప్పుకోవడం సరికాదు. ఈ విషయాన్ని పొలిట్‌ బ్యూరోలో భేటీలో స్పష్టంగా చెప్పాను. కానీ, చంద్రబాబునాయుడు మరో రకంగా ఆలోచించారు. చివరి నిమిషంలో కూడా పొత్తును కాపాడేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందుకు ఆయన రాసిన లేఖే నిదర్శనం. నా రాజకీయ ఎదుగుదలకు కారణమైన చంద్రబాబుకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. అందుకే బీజేపీతో తెగతెంపులు ఇష్టం లేకపోయినా... పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేశాను. ఎన్నికల ఫలితాల తర్వాత నేను చెప్పిందే సరైనదని రుజువైంది.
 
 
మోదీ వల్లే మేలు...
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ సర్కారు ఏపీ ప్రయోజనాలపట్ల పూర్తి సహేతుకంగా వ్యవహరించింది. వెంకయ్య సహకారం కూడా ఎంతో ఉపకరించింది. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టంగా చెప్పగలను. దీనిపై చర్చకు సిద్ధం. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును పూర్తి చేసిన అనుభవం ఉన్న మోదీ ఆ అవగాహనతో పోలవరం పట్ల ఉదారంగా వ్యవహరించారు. మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో కేంద్రం నుంచి అత్యధిక మొత్తం పొందుతున్న ఏకైక జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రమే.
 
 
హోదా... ప్యాకేజీ...
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ద్వారానే ఏపీకి ఎక్కువ నిధులు వస్తాయి. ఈ విషయంలో నాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ప్యాకేజీపై రాజ్యసభలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనను నేను ముందుగానే చంద్రబాబుకు పంపించి... ఆయనతో ఆమోద ముద్ర వేయించుకున్నాను. కానీ, తర్వాత ఆయన మరో రకంగా ఆలోచించారు. పైగా... మార్చి 1న అమిత్‌ షాతో చర్చించేందుకు టీడీపీ తరఫున వచ్చిన కుటుంబరావు, రామ్మోహన్‌ నాయుడు... మార్చి 4న అరుణ్‌ జైట్లీతో చర్చించేందుకు వచ్చిన యనమల రామకృష్ణుడు రాష్ట్రానికి ఏం కావాలో స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు వైఖరి ప్రదర్శించారు. నిజానికి రెవెన్యూ లోటు కూడా న్యాయ సమ్మతంగానే కేంద్రం భరించింది. తెలంగాణకు అదనంగా ఎంత అదాయం లభించిందో లెక్కకట్టి లోటును అంచనా వేసింది. రాజ్‌ భవన్‌, హైకోర్టు, సెక్రటేరియట్‌ నిర్మాణానికి కేంద్రం రూ. 1500 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే మరో రూ. 1000 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఎప్పుడో చెప్పింది.
 
 
టీడీపీని చీల్చితే ఏమొస్తుంది!
ఏపీలో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రకటనల గురించి విన్నాను. కానీ, మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరినా... బీజేపీ అధికారంలోకి రాదు కదా! రాష్ట్రంలో బలపడి అధికారంలోకి రావాలన్నదే మా లక్ష్యం. విపక్షంలో చీలిక తేవాలనే యోచన లేదు. అయితే, టీడీపీ నేతలు ఎవరైనా బీజేపీల చేరాలనుకుంటే స్వాగతిస్తాం.
 
 
స్నేహం కొనసాగి ఉంటే...
నాలుగేళ్లలోనే కేంద్రం చిత్తశుద్ధితో ఏపీ అభివృద్ధికి ఎంతో సహకరించింది. కేంద్రంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే ఇంకా ఎన్నో ప్రయోజనాలు వేగవంతంగా లభించేందుకు ఆస్కారం ఉండేది. విదేశీ రుణాలు కూడా అందేవి. ఇప్పుడు దేశం మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠ పెరిగింది. సభ్యత్వ రీత్యా మాత్రమే కాదు, లభించిన ఓట్ల రీత్యా చూసినా బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. ప్రజల ఆలోచనా విధానాన్ని నాయకులు గ్రహించాలన్నదే నా అభిమతం.
Link to comment
Share on other sites

CBN kayyam pettukokunda BJP toh dosthi continue chesi vunte iyala oka range lo vuntunde....kam se kam united opposition job less politicians tho compare chesukuni at least collar ana egaresetodu

 

Link to comment
Share on other sites

Quote

రాజ్‌ భవన్‌, హైకోర్టు, సెక్రటేరియట్‌ నిర్మాణానికి కేంద్రం రూ. 1500 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. 

@idibezwada bro. @SujanaChowdary vuncle edo antunnadu 

Lokesham saar deeniki opposite gaa tweet vesthada , or manode ani lite theesukuntaada 

Link to comment
Share on other sites

Quote

మార్చి 1న అమిత్‌ షాతో చర్చించేందుకు టీడీపీ తరఫున వచ్చిన కుటుంబరావు, రామ్మోహన్‌ నాయుడు... మార్చి 4న అరుణ్‌ జైట్లీతో చర్చించేందుకు వచ్చిన యనమల రామకృష్ణుడు రాష్ట్రానికి ఏం కావాలో స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు వైఖరి ప్రదర్శించారు.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...