Jump to content

మమ్మల్ని అడిగెదెవరు?


Somedude

Recommended Posts

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఆయన ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే.. రోజూ ఎందరో తమ సమస్యలు విన్నివించుకునేందుకు వస్తుంటారు... 17 ఏళ్ల బాలిక కూడా తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని ఆయనను అభ్యర్థించింది.. అలాగేనంటూ నమ్మకంగా చెప్పి ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి అభియోగం. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే ఎమ్మెల్యే అనుచరులు ఆమెను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినందుకు బాధితురాలి తండ్రిని పోలీసు కస్టడీలోకి తీసుకొని కేసు పెట్టించారు.తీవ్రంగా కొట్టడంతో కస్టడీలోనే చనిపోయారు. చివరకు సీఎం ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు ఆందోళనకు దిగడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని ఉన్నావ్‌ కేసు ఉదంతమిది. బాధితురాలి బంధువులపైనే కేసులు నమోదు చేయడం వారిని కొట్టడం చివరకు వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో ట్రక్కుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించడం... లాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
అయితే బాధితురాలి కుటుంబానికి అండగా సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఏం చేసినా తమను అడిగెదెవరని విర్రవీగిన వారికి అడ్డుకట్ట పడుతోంది. 

కుల్దీప్‌సింగ్‌ సెంగర్‌.. అన్నీ పార్టీలకు ఇష్టమే.
ఈ ఘటనలో ప్రథమ ముద్దాయి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగర్‌కు దాదాపు అన్ని రాజకీయపక్షాల మద్ధతు ఉండటం గమనార్హం. 2002లో బీఎస్పీ నుంచి , 2012లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2017లో భాజపా తరఫున గెలిచారు. దీంతో పాటు ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చేవారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావ్‌ నుంచి విజయం సాధించిన భాజపా ఎంపీ సాక్షి మహారాజ్‌ ఎమ్మెల్యే సెంగర్‌ ఉంటున్న జైలుకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

వెంటాడి.. వేటాడి..
బాధితురాలికి జరిగిన అన్యాయన్ని ప్రశ్నిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సింది పోయి పోలీసు యంత్రాంగం వారిపైనే కేసులు నమోదుచేసింది. ఆ కుటుంబంపై జరిగిన దాడులు క్రమమిది..
జూన్‌ 4, 2017 : సెంగర్‌ తనపై అత్యాచారం చేసినట్టు బాలిక ఆరోపణ. ఎమ్మెల్యే నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
జూన్‌ 11, 2017 : బాలిక కిడ్నాప్‌..ఎమ్మెల్యే అనుచరుల సామూహిక అత్యాచారం
జూన్‌ 20 , 2017 : అరారియా గ్రామంలో బాలికను గుర్తించిన పోలీసు బృందాలు
జూన్‌ 22, 2017 :  బాధితురాలిని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన పోలీసులు అయితే కేసులో ఎమ్మెల్యే పేరును ఆమె చెప్పినా పోలీసులు నమోదు చేయలేదు.
ఏప్రిల్‌ 3, 2018 : బాధితురాలి తల్లి న్యాయస్థానంలో పిటిషన్‌ దాలు చేయడంతో కుటుంబం ఉన్నావ్‌కు చేరుకుంది.  ఆ సాయంత్రమే బాధితురాలి తండ్రిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసినపోలీసులు
ఏప్రిల్‌ 5, 2018 : బాలిక తండ్రిపై పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే అనుచరుల దాడి, పరిస్థితి విషమం
ఏప్రిల్‌ 8, 2018 : సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మాహుతి చేసుకునేందుకు బాధితురాలి యత్నం, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌
ఏప్రిల్‌ 9, 2018 : జైలులోనే బాలిక తండ్రి మృతి

న్యాయవాదుల అభ్యర్థన మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు
ఏప్రిల్‌ 12, 2018 : సెంగర్‌, అతని అనుచరుడు అతుల్‌సింగ్‌లను అరెస్టు చేసిన సీబీఐ
జులై 2 2019: బాధితురాలి చిన్నాన్న అరెస్టు. 19 ఏళ్లనాటి కేసును వెలికితీసిన పోలీసులు, 10 ఏళ్ల కారాగార శిక్ష విధింపు
జులై 28, 2019 :బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు, బాధితురాలి బంధువులు ఇద్దరు మృతి, తీవ్రగాయాల పాలైన బాధితురాలు, న్యాయవాది
ఆగస్టు 2 : ఈ ఘటనకు సంబంధించిన నాలుగు కేసులను ఉన్నావ్‌ నుంచి దిల్లీకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు. బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశం

ప్రస్తుత పరిస్థితి..
సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న అనంతరమే ఆ కుటుంబానికి ఉపశమనం లభించింది. తనకు న్యాయం కావాలి అన్న పోరాటంలో బాధితురాలి తండ్రి, ఇద్దరు బంధువులు ప్రాణాలు కోల్పోయారు.

కనీసం రేషన్‌ కూడా ఇవ్వలేదు..
బాధితురాలి కుటుంబానికి గత సంవత్సరకాలం ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందలేదని తెలుస్తోంది. ఆమె కుటుంబంలోని ఏకైక సంపాదనపరుడైన చిన్నాన్నను సైతం జైలుకు పంపడంతో దీనావస్థలో బతుకుతోందీ కుటుంబం..

 

Luring minor into, then rape, beating and killing her father in police custody, the other family members, and now creating accident where victim and lawyer both seriosuly injured..and the lorry used has blackened number plate... enni twists? Sad.

Link to comment
Share on other sites

3 minutes ago, jobseeker1 said:

Ilanti police and politicians ni vongopettadam Naxals vallane aitadi.... vaallemoo kanumerugavtunnaaru 😥

vote aney weapon use chesi alaantollani intlo kurchopettochu

Link to comment
Share on other sites

6 minutes ago, tom bhayya said:

vote aney weapon use chesi alaantollani intlo kurchopettochu

Doesn’t matter if he is elected or not man... police genuine ga lenantha kaalam ilantivi jarugutune untai... 

anduke police ollani evadaina kottinappudu I don’t feel sorry for them .... lk gaallu 

Link to comment
Share on other sites

1 hour ago, JAMBALHOT_RAJA said:

India lo justice kante vomerica lo gc twaraga vastadi

ikkada GC anna edho oka roju vasthundhi anna hope untundhi..

india lo common ppl ki nyayam jarugadam ane matter ki scope ye ledhu....

 

oh god..maree intha anyayama? 

Link to comment
Share on other sites

20 minutes ago, jobseeker1 said:

Doesn’t matter if he is elected or not man... police genuine ga lenantha kaalam ilantivi jarugutune untai... 

anduke police ollani evadaina kottinappudu I don’t feel sorry for them .... lk gaallu 

police vyavasthani mana politicians eppudo ongo bettaru...utter low salaries and no benefits..

edho okala baagu padali ante okkate dhaari .....lanchalu...

ivi ravali ante manchi area lo posting kosam politicians ki dabbulu ivvali and ilanti cases vishyam lo favour cheyali..otherwise they cant survive

ee problem ki root cause police kadhu....people..

politicians know..ilantivi enni chesina vote ni konocchu and last ki ee verri janam ki edho oka biscuit vesthe chalu..like free food, ration and pension pathakalu isthe chaalu win avuthamu ani...so vallu emi kavali anna chestharu..vallu padhavi lo unnatha varaku police lu vellani emi cheyyaleru....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...