Jump to content

షాక్‌: సోషల్‌ మీడియాలో మహిళా క్రికెటర్‌ నగ్నచిత్రం


kakatiya

Recommended Posts

షాక్‌: సోషల్‌ మీడియాలో మహిళా క్రికెటర్‌ నగ్నచిత్రం

మంచి పని కోసమే చేశానన్న సారా టేలర్‌

sra.jpg

లండన్‌: ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న చిత్రాన్ని పంచుకుంది. దుస్తులేమీ లేకుండా వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న చిత్రం పోస్ట్‌ చేసింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేయడం గమనార్హం. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు ఆమె సొంతం. బ్యాటింగ్‌లోనూ సారాకు తిరుగులేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీ సేనకు ఓటమి రుచి చూపించింది ఆమే.

అతిగా ఆత్రుత చెందడం వంటి మానసిక సమస్యతో 30 ఏళ్ల సారా టేలర్‌ చాలాకాలంగా బాధపడుతోంది. దాంతోపాటు వ్యక్తిగత కారణాలో ఆమె ప్రస్తుతం ఎక్కువగా క్రికెట్‌ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో ఈ మధ్యే జరిగిన యాషెస్‌ టీ20 సిరీస్‌ నుంచి స్వయంగా తప్పుకొంది. ఇందుకు ఆత్రుత సమస్య కారణం కాదని తెలిపింది. 2016లోనూ ఆమె విరామం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం సర్రేస్టార్స్‌ తరఫున మైదానంలో అదరగొడుతోంది సారా. తన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తోంది. మహిళల దేహానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆమెను ఉమెన్స్‌హెల్త్‌ యూకే ఆహ్వానించింది.

‘నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్‌ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్‌హెల్త్‌ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది! దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే’ అని సారా టేలర్‌ తన నగ్న చిత్రానికి వివరణ ఇచ్చింది.

Link to comment
Share on other sites

3 hours ago, nokia123 said:

Battalu Leni pic ki, women’s health awareness ki enti relation? Just curious

Breast cancer awareness kosam 10k walks chesatru ga.. whats the link between walk and cancer? Nothing

to bring ppls attention to certain cause.. they do 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...