Jump to content

RIP RGV


Athadu007

Recommended Posts

1 hour ago, reality said:

Arey RGV ga ....chey kaani, Athi cheyaku... RIP anadam celebrate cheyadame...

Nee yebrasi lekkalaki Shavam tho dance cheyyadam celebrate cheyadam emo...

 

16 minutes ago, guduraju said:

Veedu society ki virus

 

1 hour ago, ekunadam_enkanna said:

rgv sacchadu anukonna!

RIP 

Link to comment
Share on other sites

ఆర్జీవీ క్వశ్చన్‌: చంద్రబాబు ఏమన్నా ఒసామా బిన్‌ లాడెనా?

rgv.jpg

తన ఇంటి మీద డ్రోన్‌ ఎగిరితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంతలా ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ ‘సంచలనాల’ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్లో సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించేశాడు. అంతే కాదు, చంద్రబాబు ఏమన్నా ఒసామా బిన్‌ లాడెన్‌ లాంటోడా.? లేకపోతే, చంద్రబాబు తన బ్యాక్‌ యార్డ్‌లో ఏవన్నా దాచకూడనివి దాచారా.? అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సినీ వర్గాల్లోనూ కలకలం సృష్టిస్తోంది.

గత కొద్ది రోజులుగా చంద్రబాబు నివాసం మీద నానా యాగీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు హైద్రాబాద్‌ నుంచి అమరావతికి మకాం మార్చుతూ, ఆ సమయంలో లింగమనేని గెస్ట్‌ హౌస్‌ మీద మమకారం పెంచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భవనం నిర్మించారని అప్పట్లోనే ఆ భవనంపై ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచీ ఇప్పటిదాకా చంద్రబాబు అదే నివాసంలో వుంటున్నారు. అక్కడినుంచి చంద్రబాబుని ఖాళీ చేయించడానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ గత రెండున్నర నెలలుగా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

తాజాగా వరద ముంచుకొచ్చింది.. చంద్రబాబు ఇకనైనా ఆ భవనం ఖాళీ చేయాలంటూ స్వయంగా మంత్రులు రంగంలోకి దిగి యాగీ షురూ చేశారు.. పైగా, చంద్రబాబు ఇంటి వద్ద ఆ యాగీ జరుగుతుండడం గమనార్హం. ఆ భవనం మునిగితే చంద్రబాబుకేంటి నష్టం.? లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అది. అయితే, చంద్రబాబు నివాసం గనుక, అక్కడ డ్రోన్ల వాడకంపై కొన్ని అభ్యంతరాలుంటాయి. అధికారికంగా ప్రభుత్వ ఆదేశాలు వుంటే.. అది వేరే సంగతి. ‘వైఎస్‌ జగన్‌ ఇంట్లో వుండే ఓ వ్యక్తి సూచన మేరకు డ్రోన్‌ ఎగురవేశాం..’ అని నిందితులు చెప్పడం చూశాం. మరి, దీన్నెలా అర్థం చేసుకోవాలి.?

ఇంతకీ, ఈ ఎపిసోడ్‌లోకి రామ్‌గోపాల్‌ వర్మ ఎందుకు వచ్చినట్లు.? ఇంకెందుకు, రామ్‌గోపాల్‌ వర్మకి చంద్రబాబు అంటే పీకల్దాకా ‘కసి’ వుంది. తన సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కి చంద్రబాబు అడ్డుతగిలారన్నది వర్మ వెర్షన్‌ కావొచ్చు. కానీ, చంద్రబాబుని విలన్‌గా చూపించే సినిమాని చంద్రబాబు ఎలా సమర్థిస్తారు.? ప్రస్తుతానికైతే వైఎస్‌ జగన్‌ మోచేతి నీళ్ళు తాగే పని సమర్థవంతంగా రామ్‌గోపాల్‌ వర్మ చేస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణలకి ఆయన వాదనలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చాలా భవనాలు వరదల కారణంగా మునిగిపోయాయి. పేదల ‘గోడు’ అంతా ఇంతా కాదు. మంత్రులు అక్కడెక్కడా కన్పించడంలేదు. అందరికీ చంద్రబాబు నివాసమే టార్గెట్‌.! ఏమో, అక్కడ ఏమన్నా వీళ్ళు కోరుకుంటోన్నది వుందేమో. అందుకోసమే, అందరూ ఎగబడ్తున్నారేమో.!

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...