Jump to content

పావు నిమిషంలో నేలమట్టం!


Assam_Bhayya

Recommended Posts

పావు నిమిషంలో నేలమట్టం! 

సచివాలయ భవనాల కూల్చివేతలో ఆధునిక సాంకేతికత 
తొలగింపునకు రూ. 10 కోట్ల వ్యయం 

3డీ చిత్రీకరణ ద్వారా ముందే పరిశీలన 
ఈనాడు, హైదరాబాద్‌

22main19a_1.jpg

యాభై అడుగుల ఎత్తున్న సౌధం. ఇటుకపై ఇటుక పేర్చుతూ పోతే రెండేళ్లకు గానీ పూర్తికాని నిర్మాణం. కానీ, నేల మట్టం చేయడానికి పట్టే సమయం పావు నిమిషమే! అవును.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇది సాధ్యం.  తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేతపై అధ్యయనం చేపడుతోంది. దీనికి ఇంప్లోజన్‌ విధానాన్ని అమలు చేయాలని  భావిస్తోంది. ఈ విధానం వల్ల చుట్టు పక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సమయంలో కూల్చివేతలకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు. ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో 3డీ చిత్రీకరణ ద్వారా ముందుగానే నమూనా తయారుచేసి చూస్తారు.

22main19b.jpg

ఇంప్లోజన్‌ విధానం: ఎక్స్‌ప్లోజన్‌ విధానంలో పేలుడు వల్ల శకలాలు ఎంతో వేగంతో దూరంగా పడతాయి. దీనికి వ్యతిరేకమైనది ఇంప్లోజన్‌ విధానం. ఇదీ పేలుడే కాని స్తంభాలకు జిలెటిన్‌ స్టిక్స్‌ అమర్చి పేల్చడంతో ఎన్ని అంతస్తుల భవనమైనా అర నిమిషంలోపే నేలమట్టం అవుతుంది. శకలాలు పైకి లేచే అవకాశం ఉండదు. దుమ్మూ ధూళి మాత్రం అనూహ్యంగా ఉంటాయి.

* రెండేళ్ల కిందట అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇంప్లోజన్‌ విధానాన్ని వినియోగించింది. రెండు దఫాలు కూల్చినప్పటికీ భవనం పూర్తిగా కూలలేదు. సాంకేతికాంశాల్లో లోపాలే కారణమని తేలింది.

22main19bc.jpg

రూ. 10 కోట్లు 
సచివాలయంలోని అన్ని బ్లాకుల కూల్చివేతకు అయ్యే వ్యయం అంచనా

సచివాలయ భవనాల సంగతులివి.. 
* ఈ ప్రాంగణంలో 11 బ్లాక్స్‌ ఉన్నాయి. 
* అన్ని బ్లాకుల్లో కనిష్ఠంగా 3 అంతస్తులు, గరిష్ఠంగా 7 అంతస్తులు ఉన్నాయి. 
కూల్చివేత వ్యర్థాల్లో కలప కొంతవరకు పనికి వస్తుందని అంచనా. ఇనుప చువ్వలను తుక్కుగా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. శిథిలాలను లోతట్టు ప్రాంతాలకు తరలిస్తారు.

ఇంప్లోజన్‌ విధానాన్ని పరిశీలిస్తున్నాం 
ఇంప్లోజన్‌ విధానంతో త్వరితగితిన కూల్చివేత పూర్తవుతుంది. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగదు. ఈ విధానంతో దుమ్ము ఒక్కటే సమస్య. సాధ్యాసాధ్యాలన్నింటిపైనా అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.

- సునీల్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి
Link to comment
Share on other sites

3 hours ago, jobseeker1 said:

Orei pulkasa kulgottaka poi itakalu verukondi... mi capital ki panikostai 

not a fair comment at this point of time bruh.

Link to comment
Share on other sites

1 hour ago, Assam_Bhayya said:

not a fair comment at this point of time bruh.

Roju proddunne pulkas vachi maa dabbulu free ga 10gi thintunnaru ani yedustaar va... anduke anna mivi miru thiskellandi ani....nuvvu roju db ki raavemole.....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...