Jump to content

రియల్‌.. రివర్స్‌.. ఆందోళనలో పెట్టుబడిదారులు


Hydrockers

Recommended Posts

రియల్‌.. రివర్స్‌.. ఆందోళనలో పెట్టుబడిదారులు
జిల్లాలో భూముల ధరలు ఢమాల్‌
40 నుంచి 60 శాతం పడిపోయిన ధరలు
అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక రియల్టర్ల సతమతం
రోజురోజుకు ధరలు తగ్గుతున్నా కొనుగోళ్లకు వెనకంజే
నిలిచిపోయిన స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు, ప్లాట్ల విక్రయాలు
 
 
 
 
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అమరావతి.. అహో అనుకుంటూ జిల్లాలో భూములు కొన్నవారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ ఇక్కడ పెట్టుబడులు పెట్టి రూ.కోట్లు సంపాదించాలనుకున్నవారు అసలకే మోసం వచ్చిందంటూ అల్లాడిపోతున్నారు. రాజధాని సహ జిల్లా వ్యాప్తంగా స్థలాలు, భూములు, పొలాలు, ఇళ్ల క్రయవిక్రయాలు స్తంభించాయి. రాజధాని ప్రకటనతో భూముల ధరలు ఆకాశాన్నంటగా ప్రస్తుతం అథఃపాతాళానికి దిగజారిపోతున్నాయి. భూమిని నమ్ముకున్న వారికి ఏ డోకా ఉండదని, ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటుందని నమ్మిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఊహించని విధంగా రాజధానిపై ప్రకటనలతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైందని రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు.
 
 
 
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానితో పాటు జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కదలిక వచ్చింది. రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ జరిగిన ప్రచారంతో పెద్ద ఎత్తున రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు ఒక స్థాయి కలిగిన వారు రాజధానిలో భూములు కొనుగోలు చేశారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానితో పాటు జిల్లాలో భూముల ధరలు పెరుగుతాయని భావించి ఎక్కువ మంది కొనుగోలుకు మక్కువ చూపారు. అయితే వారి ఊహలకు విరుద్ధంగా జరగడం.. అదే సమయంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు మారడం.. రెండు రోజులుగా అమరావతిపై వస్తున్న ప్రకటనలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒక్కసారిగా స్తంభించింది. దీంతో క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో ఆందోళన నెలకుంది. రాజధాని ప్రాంతంలో గతంలో ధరలు పెరిగిన సమయంలో అనేక మంది కుటుంబ అవసరాలకు ఎకరం, అరెకరం అమ్ముకున్నారు. ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయని ఆశించి అమ్ముకోకుండా ఎదురు చూసిన వారు ప్రస్తుతం ధరలు పడిపోవడంతో చింతిస్తున్నారు.
 
ఎన్నికలకు ముందు గుంటూరుతో పాటు రాజధాని ప్రాంతంలోనూ భూములను కొనుగోలు చేశారు. వారు కూడా నేడు చింతిస్తున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక సతమతమవుతున్నారు. ఒకప్పుడు రాజధానిలో ఎకరం కోటి నుంచి రెండు కోట్ల వరకు ధర పలికింది. తదనంతర పరిణామాల్లో ఎకరం రూ.50 లక్షల నుంచి కోటికి పడిపోయింది. తాజాగా ఆ ధర మరింత పడిపోతుందని భయపడుతున్నారు. తాజా పరిస్థితులతో జిల్లాలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. అప్పులు ఇచ్చిన వారు, తెచ్చిన వారు ఇద్దరూ తీవ్రంగా నష్టపోవడం తప్ప మరో మార్గం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే అనేక మంది వ్యాపారులు నష్టాల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్ళారు. కొంతమంది అధికారికంగా, అనేక మంది అనధికారికంగా ఐపీలు పెట్టేశారు. తాజా పరిస్థితులతో మిగిలిన వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమరావతిపై నీలినీడలు కమ్ముకోవడంతో రూ.కోట్లు పెట్టుబడులు పెట్టి స్థలాలు కొనుగోలు చేసిన రియల్టర్లలో భూముల ధరలు ఇప్పుడు ఎంతకు దిగుతాయో అన్న ఆందోళన సతమతం చేస్తోంది.
 
- రాజధాని ప్రకటన తరువాత గుంటూరులో విపరీతంగా అపార్టుమెంట్లు నిర్మించారు. మొదట్లో అందుకు అనుగుణంగానే కొనుగోళ్ళు జరిగాయి. ఆ తరువాత కొంత వరకు కొనుగోళ్ళు మందగించాయి. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగాయి. కొద్ది నెలలుగా అపార్టుమెంట్ల ఫ్లాట్ల కొనుగోళ్ళలో కూడా స్తబ్ధత ఏర్పడింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లోని అపార్టుమెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. నష్టాలకు అమ్ముకోలేక పలువురు ఫ్లాట్లను అలాగే ఉంచుకున్నారు.
 
 
- ఏడాది పొడవునా నిత్యం రద్దీగా కనిపించే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎన్నికల నాటి నుంచి వెలవెలబోతూ కనిపిస్తుంది. కొద్ది నెలల క్రితంతో పోల్చుకుంటే కురగల్లు, నీరుకొండ గ్రామాల పరిధిలో స్థలాల ధరలు సగానికిపైగా పడిపోయినా కొనేవారు లేరు. నవులూరు, యర్రబాలెం గ్రామాల పరిధిలో కూడా సగం ధరకు కూడా ఎవ్వరూ అడగడం లేదు.
 
- రాజధానిలో పనులు జరుగుతున్నప్పుడు తుళ్లూరు, తాడికొండ మండలాల్లో పొలాలు, స్ధలాలకు వివరీతమైన డిమాండ్‌ ఉంది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి లాం వెళ్లేదారిలోని ప్రధాన రహదారి వెంట ఉన్న పొలాలు ధరలు కూడా సగానికి సగం పడిపోయాయి. మేడికొండూరు మండలంలో ఎన్నికల ముందు రూ.50 నుంచి 60 లక్షలు పలికిన ఎకరం పొలం ఇప్పుడు రూ.25 నుంచి 30 లక్షలుంది. ఫిరంగిపురంలో ఎరకం రూ.2 కోట్లు వరకు పలగ్గా ప్రస్తుతం 1 కోటికి పడిపోయింది. రేగడి పొలం గతంలో రూ.50 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.23 లక్షలకు పడిపోయింది.
 
- రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో కన్నా వారసత్వ అమరావతిలో భూములకు డిమాండ్‌ ఉంది. అమరావతి, విజయవాడ రోడ్డులోని వెంచర్లలో ధరలు తగ్గిపోయాయి. ఐదు నెలల క్రితం వరకు ఎకరం రూ1 కోటి నుంచి 2 కోట్ల వరకు పలికింది. ప్రస్తుతం ఎకరా రూ.60 లక్షలకు తగ్గినా కొనేవారు లేరు.
 
- బెల్లంకొండ మండలంలో గతంలో ఎకరం రూ30 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.10 లక్షలకు కూడా అడిగేవారులేరు. బెల్లంకొండ శివారులో ఎకరం రూ.25 లక్షలకు కొనుగోలు చేసి అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్‌ చేయించుకున్న వారు ప్రస్తుతం ఇటువైపు చూడటంలేదు. 75త్యాళ్లూరులో ఎన్నికల తరువాత ఎకరం 33 లక్షలకు కొనుగోలు చేసేందుకు రూ.2 లక్షలు అడ్వాన్సు ఇచ్చి ఫలితాల తరువాత భూముల ధరపడి పోవడంతో అడ్వాన్సు వదిలేసుకున్నారు. అచ్చంపేట మండలంలో గతంలో ఎకరం రూ.30 నుంచి 40 లక్షలు ధర పలగ్గా నేడు రూ10 నుంచి 20 లక్షలకు ధరపడి పోయింది.
 
- మాచర్లలో 2009 నుంచి 2014 వరకు ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌కు దశ దిరిగింది. రాయవరం జంక్షన్లో ఎకరం కోటిన్నర వరకు ధర పలికింది. మాచర్ల లో 13వ వార్డులో 2014 నుంచి మూడు, నాలుగేళ్లపాటు సెంటు రూ.15 లక్షల వరకు పలికింది. ప్రస్తుతం సెంటు ధర రూ.10 లక్షలకు మించి లేదు. సాగర్‌ ప్రధాన రహదారిలో రూ.5 లక్షలున్న పొలాలు రెండేళ్ల క్రితం రూ. 20 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ధరలు రూ. 15 లక్షలకు దిగజారాయి.
 
- అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు వినుకొండలో కర్నూలు- గుంటూరు హైవే రోడ్డుకు ఇరువైపులా భూములు ఎకరం ధర రూ.50 లక్షల నుంచి కోటి వరకు పలికింది. మిగిలిన మండలాల్లో కూడా రూ.25 లక్షల నుంచి 40 లక్షల వరకు ధర ఉండింది. ప్రస్తుతం గుంటూరు-కర్నూల్‌ రోడ్డుకు ఇరువైపులా భూముల ధరలు పెరగకపోగా పెట్టుబడిలు పెట్టిన వారికి రూపాయి వడ్డీకూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదని వాపోతున్నారు.
 
- రాజధాని నిర్మాణంతో పల్నాడు ప్రాంతంలో భూముల ధరలకు నాలుగేళ్లుగా రెక్కలొచ్చాయి. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారికి ఇరువైపుల భూములు కోటి రూపాయలకు పెరిగింది. మొన్నటి వరకు ఎకరం 80 లక్షలు పలికిన భూములన్నీ ఇప్పుడు 20 లక్షలకు మించి కొనేవారే లేరు. పిడుగురాళ్ల ప్రాంతంలో గతంలో 25 లక్షల వరకు ఉన్న అపార్ట్‌మెంట్‌ ధర ఇప్పుడు 18 లక్షలకే చేరుకుంది. అయినా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి.
 
- చిలకలూరిపేట నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంత ఆశాజనకంగా లేదు. నాలుగేళ్ల క్రితం ఎకరా రూ.1కోటికి పైగా పలికిన భూములు ప్రస్తుతం రూ.60 లక్షలకు చేరుకున్నాయి. అది కూడా అడిగేవారు ఉండటం లేదు. ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న భూములు మునిసిపాలిటీ పరిధిలో గతంలో సెంటు రూ.3లక్షల వరకు కూడా అమ్మకం చేశారు. ప్రస్తుతం సెంటు భూమి రూ.2లక్షలకు పరిమితమైంది. జాతీయ రహదారి వెంబడి ఎకరా రూ.1కోటి పలికిన భూములు రూ.30లక్షలకు చేరాయి.
 
- సత్తెనపల్లి ప్రాంతంలో గతంలో ఎకరం పొలం 50 లక్షలు దాకా ఉండగా ప్రస్తుతం 20 నుంచి 25 లక్షలకు పరిమితమైంది. సెంటు స్థలం పట్టణంలో 4లక్షల వరకు ఉండగా నేడు 2 లక్షలుగా ఉంది. కొత్తగా ఎవరూ వెంచర్లు కూడా ఈ ప్రాంతంలో వేయటంలేదు.
 
- పొన్నూరు మండల పరిధిలోని దొప్పలపూడి, వల్లభరావుపాలెం, ఉప్పరపాలెం, చింతలపూడి, తదితర గ్రామాల్లో ఎకరం పొలం రూ.40 లక్షలు ధర పలుకగా ప్రస్తుతం 20 లక్షలకు మించిలేదు. రియల్‌ఎస్టేట్‌ రంగం కుదేలు కావటంతో పొన్నూరు అర్బన్‌, రూరల్‌ పరిధిలో 125 అపార్ట్‌మెంట్లు 125, 20 ఎకరాల్లో వెంచర్లలో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
 
- తెనాలి పట్టణ నడిబొడ్డుగా ఉన్న కొత్తపేట అష్టలక్ష్మి, గుడి రోడ్డులో ఒక స్థలాన్ని గజం రూ.80 వేలకు ఆశించిన యజమానికి రూ.52 వేలు వరకు పలకడంతో ఆ ధరకే అమ్ముకున్నట్లు తెలిసింది. రాజధాని ప్రకటనకు ప్రస్తుతం వ్యత్యాసం చూస్తే పట్టణంలోనే 60 శాతం ధరలు పడిపోయాయి. పట్టణ వెలుపల ప్రాంతాలు అయితే అడిగే వారే లేకుండా పోయారేజ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కొనే వారు లేరు.
 
- బాపట్ల రైలుపేట పరిసరప్రాంతాలలో ఒకప్పుడు సెంటు ధర 7లక్షల ఉండేది. ప్రస్తుతం 6 నుంచి 5 లక్షలకు పడిపోయింది. ఇస్లాంపేటలో ఒకప్పుడు 12 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం 7నుంచి 8 లక్షలకు తగ్గింది. సూర్యలంకరోడ్డులో 12లక్షలు ఉండగా ప్రస్తుతం 8 నుంచి 9 లక్షలకు పడిపోయింది. అప్పికట్ల పరిపరప్రాంతాల్లో ఎకరం పొలం గతంలో 70 లక్షల వరకు ఉంటే ప్రస్తుతం 40 లక్షలకు పడిపోయింది.
 
- తీరప్రాంతంలోని రేపల్లె నియోజకవర్గంలో గతంలో పంట పొలాలను రియల్‌ఎస్టేట్‌ భూమిగా మార్చి అధిక ధరలకు విక్రయించారు. పెనుమూడ రోడ్డులోని వెంచర్లలో గతంలో 4 లక్షల వరకు ధర ఉండగా ప్రస్తుతం రూ.3 లక్షలన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. రేపల్లె పట్టణంలో అపార్ట్‌మెంట్‌లు రూ.35 లక్షల నుంచి రూ.40లక్షల వరకు గతంలో అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం రూ.25లక్షల నుంచి రూ.35లక్షల వరకు అమ్మకాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
 
 
 
రియల్టర్ల వలస
హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రస్తుత పరిణామాలతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో కుదేలైనా రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రస్తుతం ఊపందుకుంది. ఇదే సమయంలో జిల్లాలో రాజధాని సహా ఇతర ప్రాంతాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా కుదేలైంది. పెద్దసంఖ్యలో రియాల్టర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లి పెట్టుబడులు పెడుతున్నారు.
 
 
పెట్టుబడుదారులు దివాళా
రాజధాని నేపథ్యంలో వివిధ సంస్థలు, బిల్డర్లు కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు, గుంటూరులో పెద్దఎత్తున అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాల మారడంతో గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. గతంలో రూ.50 లక్షలు అమ్మిన ఫ్లాటు ఇప్పుడు రూ.35 లక్షలు కూడా పలకడం లేదు. దీంతో పెట్టుబడిదారులు దివాలా తీస్తున్నారు.
 
 
 
అసలుకే మోసం..
అమరావతి ప్రకటనతో పెరిగిన ధరలతో రాజధాని గ్రామాల్లో భూములు అమ్మి పల్నాడు ప్రాంతంలోని వినుకొండ, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో గతంలో పెద్దసంఖ్యలో భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు 60 శాతం వరకు పడిపోయాయి. కనీసం తమ పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కానరాక లబోదిబో మంటున్నారు.
 
 
తగ్గినా కొనేవారు లేరు
రాజధాని నిర్మాణ పనులు నిలిచి పోవడంతో రైతులకిచ్చిన ప్లాట్ల ధరలు పడిపోయాయి. ఎన్నికల అనంతరం గజం రూ.50 వేలు పలుకుతుందని ఆశించగా 40 శాతానికిపైగా ధరలు పడిపోయాయి. రాజధానికి ఆనుకుని ఉన్న వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో ప్రస్తుతం సగానికిపైగా ధరలు తగ్గాయి. అయినా కొనే వారు కానరావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
 
 
అమ్ముకున్నవాడే ధన్యుడు
ప్రస్తుత పరిణామాల్లో నాడు భూములు అమ్ముకున్న వాడే ధన్యుడని పలువురు అంటున్నారు. రాజధాని ప్రకటన సమయంలో గుంటూరు, రాజధాని ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. ఎకరం కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ధర పలికింది. ఆ పరిస్థితిని, ఆ డబ్బును జీవితంలో చూడలేమని ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం వాపోతున్నారు. చేయి మార్చి డబ్బు సంపాదించుకుందామని అగ్రిమెంట్లపై కొనుగోలు చేసిన వారు భూములు కొనలేక, అడ్వాన్స్‌ మొత్తం వదులుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 
 
లబోదిబో..
2014లో రాజధాని ప్రకటన తర్వాత జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉవ్వెత్తున ఎగిసింది. 2019 ఎన్నికల అనంతరం అంతకన్నా వేగంగా పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే... ఎంతో కొంతకు ప్లాట్లు అమ్మేసి చేతులు దులిపేసుకోవడమే ఉత్తమమన్న ధోరణి ప్లాట్ల యజమానుల్లో కనిపిస్తోంది. అయితే పోయి పోయి చేతుల కాల్చుకోవడం ఎందుకులెమ్మన్న ధోరణిలో కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితులతో ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
Link to comment
Share on other sites

papam prajalu.............. siggu vundali itlanti situation thechina politicians ke .

nashanam aypotharu ra  

Link to comment
Share on other sites

1 minute ago, Biskot2 said:

papam prajalu.............. siggu vundali itlanti situation thechina politicians ke .

nashanam aypotharu ra  

Rates perigithe govt ki credit ivvaru ga.. ippudu kuda anthe 

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

@tacobell fan 

 

I think Amaravathi makes sense but all other areas lo kuda taggaya?

AP అంతా almost MG అయ్యింది .. real ఎస్టేట్ అంటే ఇప్పుడు ఎవరికీ ఇష్టం లేదు ...no one seeing any progress either near future or distant .  small and medium businesses running in losses ..

Link to comment
Share on other sites

4 minutes ago, Hitman said:

AP అంతా almost MG అయ్యింది .. real ఎస్టేట్ అంటే ఇప్పుడు ఎవరికీ ఇష్టం లేదు ...no one seeing any progress either near future or distant .  small and medium businesses running in losses ..

let's see what happens. 

AP 3 puvvulu 6 kayalu ga vardillutundi ani  @snoww and @Hydrockers kalisi @DaleSteyn1 ki brief chesaru 

 

 

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Appu chesi konatam endi ehe

Realtors saala Mandi Ade sestharu. Since margins are big they don't care about interests.  But ilanti downturn lo punch paduthadi . 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

Realtors saala Mandi Ade sestharu. Since margins are big they don't care about interests.  But ilanti downturn lo punch paduthadi . 

Margins ekkuva unte risk kuda anthe ga

So ee sari fasak

Link to comment
Share on other sites

inflation lo entha fast ga rise aythey, antha fast ga paduthundi

 

Hope, people in Bezwada area forget caste differences, and work with each other as humans and make the region suitable for living for everyone.

Caste emi anam petadu, paravu nilapadu - balupu tevadam thappa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...