Jump to content

మా బిడ్డలు తప్పు చేస్తే శిక్షించండి -


Somedude

Recommended Posts

మా బిడ్డలు తప్పు చేస్తే శిక్షించండి

కొండంత దుఃఖంలోనూ ఆ తల్లుల గుండె నిబ్బరం
కలకలం రేపిన పశువైద్యురాలి హత్యోదంతం

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌ - మక్తల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో పశువైద్యురాలి హత్య కేసులో నిందితులకు కఠినశిక్ష విధించాలన్న డిమాండు పెరుగుతోంది. ఆ నలుగురిని ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ అన్ని వర్గాల నిరసనలు టీవీల్లో శనివారం ప్రసారమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిసర గ్రామాల్లో ఉంటున్న నిందితుల కుటుంబీకులు సైతం ఈ డిమాండ్లకు గొంతు కలుపుతున్నారు. తప్పు చేస్తే తమ బిడ్డలైనా శిక్ష పడాల్సిందేనంటూ నిందితుల తల్లులు కోరుతుండటం విశేషం. కూలీనాలీ చేసుకునే నిరుపేదలైన వీరంతా ఓ వైపు ఉబికివస్తున్న కన్నీటిని అదిమి పడుతూ... తమ కొడుకులు తప్పు చేస్తే శిక్షించాలంటూ గుండెనిబ్బరం చూపుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులు వారి ఇళ్లకు వచ్చారు. మహ్మద్‌ తండ్రి హుసేన్‌, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుమప్పలను పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. నవీన్‌కు తండ్రి లేరు. ఆ సమయంలో వారి బిడ్డలతో ఫోన్లో మాట్లాడించినట్లు సమాచారం. అత్యాచార సంఘటన సమయంలో నిందితులు ధరించిన దుస్తులను కూడా పోలీసులు తీసుకెళ్లారు.

నిందితుల తల్లులు ‘ఈనాడు’, ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడుతూ వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే ..

30hyd-main13d.jpgఅంతా మా దురదృష్టం
ఈ సంఘటన జరగడం మా దురదృష్టం. నా బిడ్డ ఎక్కువగా ఇంటి వద్దే ఉండేవాడు. లారీ పనికి పోతున్నప్పటి నుంచీ నాలుగైదు రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. స్నానం చేసి రెండు గంటలు ఉండి సేఠు (యజమాని) ఫోను చేశాడని వెంటనే తిరిగి వెళ్లేవాడు. ఇంత పెద్ద నేరం చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఊరిలో అందరితో బాగుండేవాడు. అందరూ నీ కొడుకుకు శిక్ష పడటం ఖాయమంటున్నారు.   వృద్ధాప్యంలో అండ కోల్పోవడం దౌర్భాగ్యం. (కన్నీటి పర్యంతమవుతూ).
- మౌలాబీ, ప్రధాన నిందితుడు మహ్మద్‌ తల్లి
30hyd-main13c.jpgతప్పు చేస్తే ఉరి తీయండి
నా బిడ్డ తప్పు చేస్తే ఉరి తీయండి.. లేదా బాధితురాలిని కాల్చినట్లు కాల్చివేయండి. తప్పు చేయకపోతే మాత్రం ఇంటికి పంపండి. నా కోడలు గర్భవతి. కుమారుడు చేసిన పాపం మా కుటుంబానికి అంటవద్దు. అంత ఘోరం చేసినవాళ్లను ఉరి తీసినా తప్పు లేదు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుకొంటున్నారు.
- జయమ్మ, చెన్నకేశవులు తల్లి
30hyd-main13b_2.jpgఏ శిక్ష వేసినా తప్పు లేదు
మా బిడ్డ బయట ఏం తప్పులు చేసేవాడో తెలియదు. ఇంట్లో మాత్రం బుద్ధిగా ఉండేవాడు. లారీ పనులకు వెళ్లినప్పటి నుంచి చెడుబుద్ధులు అబ్బినట్లు తెలుస్తోంది. ప్రజలంతా ‘మీ కొడుకు తప్పు చేశాడ’ని అంటున్నారు. అంత ఘోరం చేసినవాడిని ఏం చేసినా తప్పు లేదు. నా కొడుకును మిగతా ముగ్గురితో పాటు శిక్షించాలి. 
- లక్ష్మి, నవీన్‌ తల్లి
30hyd-main13a_5.jpgనా కడుపున చెడబుట్టాడు
నా కుమారుడిని వైద్యులు పరీక్షిస్తున్నారట. ఆ పరీక్షలో తప్పు చేసినట్లు తేలితే వాడికి ఏ శిక్ష అయినా విధించండి. ఇంటికి రోజూ పోలీసులు వచ్చిపోతుంటే వాడు నా కడుపున చెడబుట్టాడని అనిపిస్తోంది. 
- మణెమ్మ, శివ తల్లి

Feel sad for these mothers. Dhananjoy Chatterjee, Delhi gang rape convicts and now these guys. All are from poor families. Middle class and rich parents are always able to provide better education and groom their kids well. Society needs fundamental change (from Govts) in providing access to good education and well manners. Emotional ranting about killing these criminals may not give long-lasting solution. It will fizzle out as soon as we see another sensational news on the TV or it would be business as usual after a few weeks later.

  • Upvote 1
Link to comment
Share on other sites

38 minutes ago, riashli said:

Veellu ala anakapothe ooru janalu vellani tantaru . Namma budhi kavatledu anta, antha planned ga rape chesaru, anthaka mundu enni sarlu chesi untaro. 

 

Link to comment
Share on other sites

40 minutes ago, riashli said:

Veellu ala anakapothe ooru janalu vellani tantaru . Namma budhi kavatledu anta, antha planned ga rape chesaru, anthaka mundu enni sarlu chesi untaro. 

I am not at all supporting them but assume if the culprits are middle class or above. ee range lo ayithe backlash vachedi kaadu. 

victim evaraina a class ayinaa , chesindi evadinaa a range vaadaina same ilaanti response vachina roju  all will be good

to be frank our society is ** up 

Link to comment
Share on other sites

47 minutes ago, riashli said:

Veellu ala anakapothe ooru janalu vellani tantaru . Namma budhi kavatledu anta, antha planned ga rape chesaru, anthaka mundu enni sarlu chesi untaro. 

Crime chese vadu evadu intlo chesi cheyyadu.. unless entire family belongs dacoits or some gang like dandupalyam

enni sarlu chesi untaro.. undochu undaka povachu. don;t assume.

Ala ani nenu vallani support chestunnanani ardham chesukoku. Vallu chesina Neraniki veellani lagadam endhuku!!! 

Link to comment
Share on other sites

56 minutes ago, FullMoon said:

Crime chese vadu evadu intlo chesi cheyyadu.. unless entire family belongs dacoits or some gang like dandupalyam

enni sarlu chesi untaro.. undochu undaka povachu. don;t assume.

Ala ani nenu vallani support chestunnanani ardham chesukoku. Vallu chesina Neraniki veellani lagadam endhuku!!! 

Veedhilo rakhshasudu intlo devullu la ayipotara? Rakhshasudu ekkadaina rakhsasude. Parents ni blame cheyatledu but ilanti statements chuste blood boil avutundi. 

Link to comment
Share on other sites

1 minute ago, FullMoon said:

good you don;t blame parents.

Again, vadu rapist and murderers.. kani valla intlo vallu oorlo vallu evvariki ee nera pravrutti gurinchi teliyadu.

 

Valla intlo gani oollo gani chesi unte ee patiki uthiki aaresi untaru.. ee roju choose avasarame undadhu.

+1...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...