Jump to content

Jaffa galla politics on BC reservations


ParmQ

Recommended Posts

CBN ae Pratap Reddy and Ramanjaneyulu tho case vesadu BC reserevations ki against ga annaru kadhara. Aa saara kottu natthi bothsa gadaithe press meet petti maree public ga propaganda.

88253647_3275933082420260_24108410181370

 

 

Link to comment
Share on other sites

బీసీలపై కక్షతోనే ఇలా చేశారు: చంద్రబాబు

030320cbnn-brkk1.jpg

అమరావతి: సీఎం జగన్‌ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 33ఏళ్ల పాటు ఉన్న రిజర్వేషన్లను కాపాడలేకపోయారని.. బీసీలపై కక్షతోనే ఇలా చేశారని ఆయన ఆక్షేపించారు. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాల్సిన అవసరముందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచే సమర్థమైన నేతలు రావాలనే ఉద్దేశంతో 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్‌ కల్పించామని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపుతో అనేక బీసీ కులాలు రాజకీయంగా పైకి ఎదిగాయని చెప్పారు. 

ఎందుకు శ్రద్ధ పెట్టలేదు?

‘‘ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలకు 24 శాతం మాత్రమే వస్తాయి. అదే జరిగితే 1987లో ఇచ్చిన రిజర్వేషన్ల కంటే మూడు శాతం తగ్గుతుంది. అమరావతిని నాశనం చేసేందుకు దానికి సంబంధించిన కేసు కోసం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో న్యాయవాది ముకుల్‌ రోహత్గీని తీసుకొచ్చారు. ప్రభుత్వ ధనాన్ని ఆయనకు దోచిపెట్టారు. అదే బీసీ రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీఎం జగన్‌తో పాటు న్యాయవాదుల వైఫల్యమిది. మండలి రద్దు కోసం దిల్లీ వెళ్లి లాబీయింగ్‌ చేశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కాపాడటంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదు’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆ ఇద్దరూ మీ వాళ్లు కాదా?

‘‘తెదేపా హయాంలో బీసీ సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చి నిధులు కేటాయించాం. బీసీలకు ప్రత్యేకంగా కేటాయించిన రూ.3600 కోట్లను మళ్లించారు. ఆదరణ పథకం కింద పంపిణీ చేయాల్సిన పనిముట్లను గోదాముల్లో ఉంచారు. 7లక్షల మంది బీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి దరఖాస్తు చేస్తే ఫలితం లేకుండా పోయింది. బీసీలు ఎక్కువగా ఉండే శాసన మండలిని రద్దు చేస్తామంటున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి వైకాపాకు చెందిన వాళ్లు కాదా? కావాలనే కేసు వేసి రిజర్వేషన్లు అడ్డుకున్నారు. అసత్యాలు చెప్పడం వైకాపా నేతలకు అలవాటుగా మారింది’’ అని తెదేపా అధినేత ఆరోపించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...