Jump to content

భవిష్యత్ మాంద్యం మరో మహమ్మారే... వందేళ్ల వ్యవధిలో అతిపెద్దదన్న ఐఎంఎఫ్!


All_is_well

Recommended Posts

  • ఎన్నో ఏళ్లు పట్టి పీడించనున్న మాంద్యం
  • ప్రపంచానికి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం
  • రికవరీ వస్తే మాత్రం గణనీయమైన వృద్ధి
  • రిపోర్టును విడుదల చేసిన ఐఎంఎఫ్
 
tn-8082326232fa.jpg
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గడచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత మాద్యంలోకి కూరుకుపోనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ప్రపంచ జీడీపీ ఇప్పటికే 3 శాతానికి పైగా పడిపోయిందని, వైరస్ కారణంగా ఏర్పడే మాంద్యం, ఎన్నో ఏళ్లు పట్టి పీడించనున్న మరో మహమ్మారి అభి అభిప్రాయపడింది. మాంద్యం కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 9 ట్రిలియన్ డాలర్లు నష్టపోనుందని అంచనా వేసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్, తాజా అంచనాలను మీడియాకు విడుదల చేశారు.

వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చి, పరిస్థితి కుదుటపడితే, 2021లో 5.8 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆమె అంచనా వేశారు. ప్రస్తుతం వేసిన అంచనాలు కచ్చితత్వంతో కూడినవి కాదని, పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇప్పటికే షట్ డౌన్ అయ్యాయని, ఆరోగ్య వ్యవస్థలను కాపాడుకోవడంపైనే దృష్టిని సారించాయని వెల్లడించిన ఆమె, రికవరీ మొదలైనా, అది ఎంత బలంగా ఉంటుందన్న విషయంపైనా అనిశ్చితి నెలకొని వుందని పేర్కొంది.

ఇక 2020, 2021లో వైరస్ కారణంగా ఏర్పడే నష్టం, జపాన్, జర్మనీల ఆర్థిక వ్యవస్థలను కలిపితే వచ్చే మొత్తానికన్నా అధికమేనని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇప్పటికే వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ప్రజలు బాధపడుతూ ఉండగా, 1.20 లక్షల మందికి పైగా మరణించారు. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోగా, వాణిజ్య కార్యకలాపాలు మూతపడ్డాయి. టూరిజం పూర్తిగా దెబ్బతింది. సమీప భవిష్యత్తులో మరింత నష్టం కళ్లముందు కనిపించనుందని, వైరస్ మహమ్మారి మరింత కాలం కొనసాగినా, కేసుల సంఖ్య బాగా పెరిగినా, ఎన్నో సంస్థలు మూతపడతాయని, నిరుద్యోగ సమస్య ఆకాశానికి ఎగబాకుతుందని హెచ్చరించింది.

ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ల కీలక సమావేశాలు జరుగనున్న తరుణంలో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. 1930లో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్ తరువాత, ఈ మాంద్యం అత్యంత ప్రభావాన్ని చూపనుందని వ్యాఖ్యానించిన ఐఎంఎఫ్, ప్రపంచ పరిస్థితిని 'ది గ్రేట్ లాక్ డౌన్' అని అభివర్ణించింది. 
Link to comment
Share on other sites

ప్రస్తుతం వేసిన అంచనాలు కచ్చితత్వంతో కూడినవి కాదని, పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు .... rest trump will take care bro ... he didn't give approinment for recession anta until next election 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...