Jump to content

అజ్ఞాత అతిధి - (story series written by me) -(part 5 updated)!!

dasari4kntr

Recommended Posts

37 minutes ago, dasari4kntr said:

3 - ప్రయాణం 

కొన్ని వారాల తర్వాత … ఒక రోజు… సమయం రాత్రి  8:30 PM

అఖిలేష్, పని ముగించుకుని …పార్కింగ్ కి వచ్చి కార్ లో కూర్చున్నాడు…కార్ స్టార్ట్ చేసి, ఇంటికి బయలు దేరటానికి రెడీ అవుతున్నాడు … 

దూరంగా  బైక్ ఇంజిన్ సౌండ్ వస్తూ  పోతు వుంది… 

ఎవరా అని తలతిప్పి చూసాడు… తన team mate అశోక్, తెగ ట్రై చేస్తున్నాడు బైక్ స్టార్ట్ చెయ్యడానికి … కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వనంటుంది..  ఒక పక్క మబ్బు ఉరుముతోంది … 

పని ఎక్కువ ఉండడం తో … తనతో పాటు తన టీం లో కొంత మంది లేట్ గా ఇళ్లకు వెళ్లడం స్టార్ట్ చేస్తున్నారు … 

కార్ ఆపి .. అశోక్ దగ్గరికి వెళ్ళాడు అఖిలేష్ … 

అఖిలేష్ : ఏమైంది అశోక్… 

అశోక్ : ఏమో సార్ , పెట్రోల్ ఫుల్లుగా వుంది… కానీ బైక్ స్టార్ట్ అవ్వడం లేదు … 

అఖిలేష్ :వాతావరణం చల్లగా వుంది కదా … ఇంజిన్ కూల్ అయిందేమో … చోక్ ఇచ్చి ట్రై  చేశావా ?

అశోక్ : చేశాను సార్..కానీ వర్క్ అవ్వలేదు .. 

అఖిలేష్ : నేను ట్రై చేస్తాను..ఇవ్వు .. 

[అశోక్ బైక్ హేండిల్ ని .. ఇచ్చాడు అఖిలేష్ కి]

అఖిలేష్.. ట్రై చేస్తున్నాడు …. ఎలాంటి ఫలితం లేదు … 

ఒక పది నిమిషాల నిరంతర ప్రయత్నం తర్వాత… బైక్ స్టార్ట్ అయింది … కానీ అఖిలేష్ ఆ ఆనందంలో క్లచ్ వదిలేసాడు … [బైక్ డ్రైవ్ చేసి చాలా రోజులు అవ్వడం వలన…]

[బైక్ అలా ముందుకు ఎగిరి .. ఎదురుగా ఉన్న గోడని గుద్దుకుని కింద పడింది.. ముందు లైట్ పగిలి … బైక్ పరిస్థితి ఇంకా అద్వాన్నం అయింది … ]

అఖిలేష్ కింద పడి ఉన్నాడు… 

అశోక్: అయ్యో సార్ .. మీరు ఓకేనా ?

అఖిలేష్ : పైకి లేస్తూ …i am ok అంటూ .. అబ్బా అన్నాడు .. 

[అఖిలేష్ మోకాలి పై పడడం తో .. కొంచెం దెబ్బ తగిలింది]

అఖిలేష్ : ...sorry ashok… మీకు హెల్ప్ చేద్దామని వచ్చి .. మీకు ఇంకా ప్రాబ్లెమ్ చేశాను .. మీ బైక్ ని ఇక్కడే వదిలేయండి .. రేపు సెక్యూరిటీ స్టాఫ్ కి చెప్పి నేను రిపేర్ చేయిస్తాను .. ఈ రోజుకి నా కార్ లో రండి.. నేను వదిలిపెడుతాను మీ ఇంటి దెగ్గర … 

అశోక్: its ok  sir, నేను టాక్సీ లో వెళ్ళిపోతాను… అందులోనూ..మీకు కాలికి కూడా దెబ్బ తగిలింది…నేను వుండే చోటు మీకు దూరం కూడా … 

అఖిలేష్: thats fine...చిన్నదెబ్బె..కొంచెం దొకుంది… కానీ నేను డ్రైవ్ చేయగలను …పదండి కార్లో కూర్చోండి…

[వర్షం మెల్లగా మొదలవడం తో...ఇద్దరు కార్లో కూర్చుని అశోక్ ఇంటివైపు బయలుదేరారు]

[కార్లో…]

అఖిలేష్ : అశోక్ నీకొక బాబు అన్నావ్ కదా...స్కూలు కి .. వెళ్తున్నాడా ?

అశోక్: వెళ్తున్నాడు సర్...7 సంవత్సరాలు ఇప్పుడు …

అఖిలేష్ : nice, ఎలా వుంది ఫామిలీ లైఫ్… జీతం సరిపోతుందా ?

అశోక్ : పర్లేదు సర్ … పిండి కొద్ది రొట్టె … happy గా వున్నాం ..అది చాలు.. 

[కార్ ప్రయాణం సాగుతుంది … కొంచెం దూరం పోయాక ]

అశోక్: మీ పెళ్లెప్పుడు..సార్...మన టీమ్ లో..మీరొక్కళ్ళే బ్యాచిలర్ [ కుతూహలంగా ]

అఖిలేష్: చేసుకోవాలి అశోక్...నీకు తెలిసిన సంబంధం ఉంటే మాట్లాడు…[నవ్వుతూ]

అశోక్: ఓకే సర్...మా ఊర్లో… [అంటూ స్టార్ట్ చేశాడు]

అఖిలేష్: నవ్వుతూ...అశోక్ నేను జోక్ చేసాను…నాకు పెళ్లి పైన strong opinions ఉన్నాయి… 

అశోక్ : చెప్పండి సర్ … అవి ఏమిటో … మా ఇంటికి చేరుకోవడానికి మనకింకా 20 నిమిషాలు  పడుతుంది… 

అఖిలేష్ : నేను పుట్టి పెరిగింది మా ఊర్లోనే … చిన్నప్పటి  నుంచి సహజంగానే ముక్కు సూటిగా ఉండడం నా మనస్తత్వం … ఈ కాలం అమ్మాయిలకి ఆలా ఉండడం నచ్చట్లేదు … అంతెందుకు ఊర్లో వున్న నా సొంత మరదళ్లకే నా విధానం నచ్చలేదు … actual గా నాకు వాళ్ళు నచ్చలేదు అనుకో .. 

నాకు కొంచెం...short temper ఎక్కువ… అది మీకూ  తెలుసుకదా 

అశోక్: [ అవును అన్నట్లు తల ఊపుతూ]

అఖిలేష్: కొంచెం ఓర్పు, individuality, ఇంకొకరిని అనుకరించకుండా తాను తనలా వుండే అమ్మాయి దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నా...

మా అమ్మ అదే పనిగా అడుగుతుంది … పెళ్లి ఎప్పుడు చేస్కుంటావురా ? అని… రేపు ఎల్లుండి అని సాగదీస్తున్నా … 

మనసుకి నచ్చకుండా చేసుకుని … జీవితాంతం ఉండాలంటే కష్టం కదా… 

అశోక్ : పెళ్లంటే  అదే కదా సర్ … adjustment అవ్వడం ...మీరెంత ఇష్టపడి కొనుక్కున్న బట్టలైనా , కార్ ఐన ఇంకేదయినా వస్తువు అయినా … మీకు వాటిపై ఆ మోజు ఒక్క సంవత్సరమే…ఆ వస్తువులకి కూడా మన పై మోజు పోయిందా అని ఆలోచించం… ఎందుకంటే అవి వస్తువులు...వాటికి ప్రాణం, ఫీలింగ్స్ వుండవు … అవి చెప్పలేవు … 

కానీ పెళ్లి చేసుకుంటే …అలాకాదు..  మీలా ఇష్టాలు, అయిష్టాలు , మోజులు చూపే వాళ్ళు, చెప్పే వాళ్ళు  మీతోనే ఉంటారు … మీకున్న ఫీలింగ్సే … వాళ్ళకి ఉంటాయి … 

అప్పుడు వాళ్ళని  మీరు ఇష్ట పడుతూ  వాళ్ళ ఇష్టాన్ని తిరిగి పొందడం అనేది మీకు కర్తవ్యం అవుంతుంది… మీ లైఫ్ లోకి వచ్చే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది...

ఈ  process నే ఒకరి ఫై ఒకరు ప్రేమ చూపించుకోవడం అంటారు … సర్ ...

అఖిలేష్ : [ఒక్క సారి అశోక్ వైపు చూసి] నువ్వు చెప్పిన దాంట్లో కొంతవరకే అర్థం అయింది...మిగిలింది అనుభవిస్తే కానీ అర్థం అవ్వదేమో....

[ఇంతలో అఖిలేష్ వుండే ప్లేస్ వచ్చింది...అది ఒకచిన్న గల్లీ...ఒక కార్ మాత్రమే పెట్టె రోడ్లు … చుట్టూ అపార్ట్మెంట్స్… దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వుండే ప్రదేశం ]

అంతలో వర్షం ఇంకొంచెం ఎక్కువ అయింది …. 

అశోక్: సర్.. ఈ గల్లీ మొదట్లో కార్ ఆపండి … నేను నడుచుకుని వెళ్ళిపోతాను… 

అఖిలేష్ : పర్లేదు  అశోక్.. వర్షం ఎక్కవైంది .. గొడుగు కూడా లేదు.. మీ ఇంటి ముందే వదిలిపెడ్తాను పద .. అంటూ గల్లీ లోకి మెల్లగా కార్ ని తీసుకెళ్తున్నాడు… 

ఆలా ఇరుకు సందు లో కొంచెం లోపలికి వెళ్ళాక… కార్ ఆపాడు అఖిలేష్..

అశోక్ కార్ దిగి..thank you sir అని చెప్పి, డిన్నర్ చేసి వెల్దురురండి… అనిపిల్చాడు

“లేదు అశోక్...మరో సారి వస్తాను..ఇప్పటికే బాగా లేట్ అయింది”

ఓకే అనిచెప్పి ...పరుగున తన ఇంట్లోకి వెళ్ళాడు … అశోక్

అఖిలేష్ తన కార్ లో .. వెనక్కి తిరిగి దారి చూస్తూ కార్ ని రివర్స్ లో .. వెనక్కి పొనిస్తున్నడు … 

వీధి  లైట్ వెలుగుతూ ఆగుతూ ఉండడం వల్ల … వెనక దారి సరిగా కనిపించట్లేదు … అలాగే వెళ్తున్నాడు  వెనక్కి ఆగి  ఆగి … 

ఇంకాసేపట్లో ఆ గల్లీ నుంచి బయటికి వస్తాడనంగా … ఎవరో గొడుగు పట్టుకుని గల్లీ లోకి వస్తున్నారు ... 

వారిని తప్పించపోయి .. గల్లీ కి పక్కగా పార్క్ చేసి వున్న సైకిల్స్ ని గుద్దాడు…  కార్ వెనకనుంచి … 

ఆ సైకిల్స్ దారికి  అడ్డంగా పడ్డాయి … కార్ రివర్స్ చేయటానికి లేకుండా … 

ohh shoot..అను కుంటూ .. కార్ డోర్ తెరిచి … ఒక్క ఉదుటున వచ్చాడు కార్ లోంచి బయటికి … 

ఒక్కసారిగా  అదుపు తప్పి కింద పడబోయి .. కార్ ని పట్టుకుని నిలుచున్నాడు .. [అప్పుడు తనకి అర్థం అయ్యింది … office దగ్గర తగిలిన దెబ్బ ..చిన్నది కాదు అని ]

అలానే కుంటుకుంటూ వెళ్లి .. దారికి అడ్డం గా పడిన సైకిల్స్ ని ఎత్తుతున్నాడు … 

అంతలో .. ఆ సైకిల్స్ పై ఎవరిదో చేయి పడింది తనకి సహాయం చేస్తున్నట్టు … 

మొదట చీకట్లో అర్థం కాలేదు కానీ … ఎవరో ఆడ వాళ్ళు అని అర్థమైంది … 

ఇంతలో ఒక పెద్ద ఉరుము … ఆ వెలుగులో చూసాడు ఆమెని … ఎక్కడో చూసిన జ్ఞ్ఞాపకం … 

కొన్ని క్షణాల్లో గుర్తుకువచ్చింది … ఆమె ఎవరో కాదు … coffee shop లో తాను దురుసు గా ప్రవర్తించి ఉద్యోగం లోంచి తీసి వేయించిన  “అలేఖ్య”...

(ఇంకా వుంది next part coming soon)

Super @dasari4kntr gaaru. Bagundi....waiting for next 

  • Upvote 1
Link to comment
Share on other sites

46 minutes ago, ShruteSastry said:

i like where this is going. Okko scene climax la undi bruh.

Waiting for next one.

1 hour ago, Ellen said:

Super @dasari4kntr gaaru. Bagundi....waiting for next 

thank you guys....

Link to comment
Share on other sites

On 5/4/2020 at 12:00 PM, dasari4kntr said:

1 - పొరపాటు 

mumbai మహానగరం - మధ్యాహ్నం 12:00 PM
 
అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని  ఏవో files చూస్తున్నాడు తన computer లో …
 
అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు 
 
phone లో client PA..
 
“Mr. అఖిలేష్, ఈ రోజు  3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు.  ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.“
 
అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన కంప్యూటర్ లో క్యాలెండర్ చెక్ చేసుకుంటూ … ఫోన్లో, “లేదు నేను ఈరోజే అగర్వాల్ గారిని కలుస్తాను.. ఈ రోజు appointment confirm చెయ్యండి”
 
ok అఖిలేష్ , మీకు అగర్వాల్ తో 3:00 PM to 4:00 PM appointment confirm, అని PA ఫోన్ పెట్టేసింది.
 
[అఖిలేష్, ఒక Financial Adviser, తన వృత్తిలో ఎంతో పేరు వున్న వ్యక్తి.  అగర్వాల్ ఒక పెద్ద jewlery shop ఓనర్, తనకి ఇండియా అంతటా షాప్స్ వున్నాయి. ]
 
అఖిలేష్, వెంటనే, కొన్ని డాక్యూమెంట్స్ ప్రింట్ తీసుకుని , బ్యాగ్  సర్దుకున్నాడు, క్లయింట్ ని కలవడానికి. 
 
క్లయింట్ వున్న చోటుకి , గంటా గంటన్నర ప్రయాణం, parking lot కి వచ్చి తన కార్ స్టార్ట్ చేసాడు..
 
తాను ఏ client దగ్గరికి వెళ్తున్న మొదట ఆగేది, తన మిత్రుడి తమ్ముడు కిషోర్ coffee shop దగ్గరే. ఆ కాఫీ షాప్ చాలా అధునాతనంగా ఉంటూ అన్నిసౌకర్యాలు ఉండడంతో, అక్కడ కాఫీ తాగుతూ, క్లయింట్ మీటింగ్ కి  డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతాడు. ఆ కాఫీ షాప్ లో ఉన్న  ప్రతి స్టాఫ్ తనకు  పరిచయమే. ఆ కాఫీ షాప్ పెట్టటానికి, కిషోర్ కావలిసిన surety ఇచ్చి లోన్ సహాయం కూడా చేసింది అఖిలేషే..
 
కార్ ని , కాఫీ షాప్ ముందు పార్క్ చేసి, లోపలి వెళ్ళాడు. కౌంటర్ లో వున్న supervisor ని కిషోర్ ఎక్కడ అని అడిగాడు. కిషోర్ బయటకి వెళ్లాడని చెప్పడం తో, తనకి కాఫీ పంపించమని supervisor కి చెప్పి … ఒక ఖాళీ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు ..
 
తనకి కుడి పక్కన టేబుల్ లో ఒక ఫామిలీ వుంది .. మొగుడు పెళ్ళాం, ఇద్దరు చిన్న పిల్లలు .. పిల్లలు చూడడానికీ 7-8 సంవత్సరాలు అనుకుంట .. కానీ వాళ్ళ అల్లరి చూస్తే అలా అనిపించడం లేదు .. ఒకళ్ళని ఒకళ్ళు వెంబడించుకుంటూ .. టేబుల్ చుట్టూ తిగుతున్నారు … ఆ మొగుడు పెళ్ళాం ఏ ఏమీ పట్టనట్లు .. ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.. 
 
అఖిలేష్, తాను client meeting కి ప్రిపేర్ అవుతూ, డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటున్నాడు...
 
ఇంతలో, ఒక అందమైన యువతి కాఫీ ట్రె పట్టుకుని తన టేబుల్ దగ్గరికి వస్తుంది… ఆమెనే ఆలా దూరం నుంచే చూస్తున్న అఖిలేష్ కి మనసులో ఆనందం మరియు ఆశ్యర్యం … అంత అందమైన అమ్మాయిని అలా చూడడం చాలా ఆనందంగా వుంది, అందులోను తాను, తన టేబుల్ దగ్గరికి వస్తుంది, అలాగే ఆశర్యం తనని ఇంతకూ ముందు ఈ షాప్ లో ఎప్పుడు చూడలేదు … బహుశా తాను కొత్తగా జాయిన్ అయ్యి ఉంటుంది అనుకున్నాడు మనసులో …
 
ఆ అమ్మాయి కాఫీ ట్రే ని నిదానం గా టేబుల్ పైన  కొంచెం దూరం లో పెట్టి …కాఫీ కప్ సాసర్ ని తనం ముందు పెట్టబోతు  ముందుకు వంగింది …
 
ఇంకా తన అందాన్ని ఆస్వాదిస్తున్నాడు అఖిలేష్ తన మనసులో … ఈ రోజుల్లో ఎలాంటి మేకప్ లేకుండా ఇంత సహజసిద్ద అందమైన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి తనకి …
 
[ అఖిలేష్ వయసు 30 సంవత్సరాలు , ఇంకా పెళ్లి కాలేదు… తనకి తండ్రి లేడు, అమ్మ తన సొంత వూరు అయిన పల్లెటూర్లో ఉంటూ పొలాలు చూసుకుంటుంది.  తనకి వరుస అయ్యే మరదళ్ల్లు ఊళ్ళో వున్నా, వాళ్ళకి వున్న పట్నం పోకడలు నచ్చకపోవడం తో, వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ప్రాక్టికల్ గా ఉండడం అఖిలేష్ మనస్తత్వం, కానీ తన తల్లి నుండి పెళ్లి చేసుకోమని ఒత్తిడి.
 
“మనలా మనం ఉండాలి … ఇంకోకిరిని అన్వయించడం సరి కాదు” అని బలం గా నమ్మే వ్యక్తి అఖిలేష్. ]
 
అలా ఆమెనే చూస్తున్న అఖిలేష్ కి ఒక్కసారిగా చురుక్కుమని కాలింది… కాఫీ కప్ ఒలికి .. వేడి వేడి కాఫీ తన మీద పడింది...
 
ఒక్క క్షణం క్రితం ఏమి జరిగిందంటే …
 
పక్క టేబుల్ లో వున్నా చిన్న పిల్లలు పరిగెడుతూ .. ఆ అమ్మాయి ని నెట్టేశారు… అదుపు తప్పి, ఆమె కాఫీ కప్పు ని టేబుల్ పైన వదిలేసింది …
 
ఆ కాఫీ అఖిలేష్ తన  client  కోసం తయారు చేసుకున్న డాక్యూమెంట్స్ పైన, తన డ్రెస్ పైన పడడంతో [అదీ client visit కు వెళ్లేముందు] … అప్పటి వరకు ఎంతో ప్రశాంతం గా వున్న అఖిలేష్... ఏమి జరిగిందో తెలుసుకోకుండా, ఒక్కసారిగా what the h-ell...are you blind?  you just ruined my appointment  అని గట్టిగా అరిచాడు …
 
ఆ అమ్మాయి :  s0rry sir...sorry sir…అసలు ఏమి జరిగిందంటే…
 
అఖిలేష్ : stop nonsense… కళ్ళు నెత్తిన పెట్టుకుని పని చేస్తున్నావా… do you have any idea how valuable this meeting to me?
 
ఆ అమ్మాయి :  నా తప్పు ఏమిలేదు sir...పక్క నున్న పిల్లలు… [అంటూ చెప్పబోతోంది…]
 
పక్క టేబుల్ father : ఇదిగో అమ్మాయి...నువ్వు తప్పు చేసి మా పిల్లల పైన చెప్తావా...కాఫీ షాప్ అంటే అన్నిరకలా customers ఉంటారు… నీకు సర్వ్ చేయడం తెలియక తప్పు చేసి...మా పిల్లల పైన నెట్టకు...
 
పక్క టేబుల్ mother : పదండి ఇక్కడి నుంచి అసలు.. ఇలాంటి place కి రావడం మనదే తప్పు…
 
అఖిలేష్ : ఇదిగో supervisor, ఇటు రా, ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకంటే…కిషోర్ బిజినెస్ చేసినట్టే…
 
ఇంతలో supervisor పరిగెత్తుకుంటూ వచ్చి… s0rry sir...కిషోర్ గారు, వచ్చిన వెంటనే ఈ విషయం చెప్తాము..అంతలోపు మీరు కిషోర్ గారి  office లో రెడీ అవ్వండి...మీ  documents ని మా స్టాఫ్ ని పంపి..మల్లి printouts తీయిస్తాము…అని చెప్పాడు..
 
అఖిలేష్ అక్కడి నుంచి కిషోర్ రూమ్ కి వెళ్లి ...రెడీ అయ్యాడు...ఇంతలో..తన documents ప్రింట్స్ కూడా వచ్చాయి...అవి మల్లా సరి చేసుకుని...తన client ని కలిసేటందుకు బయలుదేరాడు…

H&T@aa place la nenu vundi vunte naa name ki nyayam chesevaanni 

  • Haha 2
Link to comment
Share on other sites

4- పరిచయం 

[రాత్రి : 10:00 PM..వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతుంది]
 
అఖిలేష్: హలో అలేఖ్య గారు … నన్ను గుర్తుపట్టారా … ?
 
[అలేఖ్య ఆశ్చర్యం తో .. లేదు అని తలా ఊపింది.. ]
 
అఖిలేష్: నేను...ఆ రోజు coffee shop లో …మీరు నాకు కాఫీ ఇస్తుంటే ...అది వొలికి నా మీద పడింది … నేను ఏమి జరిగిందో తెలుసుకోకుండా పెద్ద గొడవ చేసాను … 

అలేఖ్య: ఓహ్ మీరా!!! … నా పేరు మీకు ఎలా తెలుసు ? ఇక్కడేం చేస్తున్నారు..?

అఖిలేష్: నాతో పాటు పని చేసే వ్యక్తి… ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు … అతన్ని డ్రాప్ చేద్దామని వచ్చాను… 

తిరిగి వెళ్లబోతుంటే .. ఇలా సైకిల్స్ అడ్డంగా పడిపోయాయి .. ఇంతలో మీరు వచ్చారు … 

మీ పేరు కిషోర్ చెప్పాడు … 

..sorry..అండి … ఆ రోజు నేను కొంచెం అతిగా ఆవేశపడ్డాను …
 
అలేఖ్య : కొంచెం ?
 
అఖిలేష్ : కొంచెం  కాదు … కొంచెం ఎక్కువే … [తప్పు చేసిన భావనతో]

అలేఖ్య :[కొంచెం కోపం... కొంచెం అమాయకత్వం తో]

ముందు ఈ సైకిల్స్  పట్టుకోండి …బరువంతా నా మీద వదిలేశారు .. 

[ఇద్దరు కలిసి … ఆ కింద పడ్డ సైకిల్స్ ని తీసి పక్కకి పెడుతున్నారు... జోరున వర్షం పడుతోంది …  తడిసి ముద్దవుతున్నారు… 

ఆ సైకిల్స్ హ్యాండిల్స్ ఒక దానిలో ఒకటి ఇరుక్కు పోయి … ఒక పట్టాన రావట్లేదు..

అఖిలేష్ కాలి నెప్పిని భరిస్తూ … చిన్న గా మూల్గుతూ … కుంటుతున్నాడు ]

[అలేఖ్య గమనించింది… అఖిలేష్ కుంటుతూ ఉండడాన్ని .. ]

అలేఖ్య : ఆ రోజు, బాగానే నడుస్తున్నారుగా… ఇప్పుడేమైంది .. కుంటుతున్నారు …  

అఖిలేష్ : ఇందాకే గంట క్రితం.. ఒక చిన్న దెబ్బ తగిలింది ఆఫీస్ దగ్గర… ఫ్రెండ్ కి హెల్ప్ చేయబోయి కింద పడ్డాను .. 

అవునూ... ఇందాక నేను గుర్తు లేదన్నారు… ఇప్పుడేమో నేను ఆ రోజు ఎలా నడిచానో చెప్తున్నారు… 

అలేఖ్య : మీకు హెల్ప్ కావాలా ? లేదా సమాధానం కావాలా ?

అఖిలేష్ : ... sorry...sorry… ఈ టైం లో … మీ హెల్ప్ చాలా అవసరం నాకు … please help..

[కొంచెం కొంచెం గా…  వర్షం ఎక్కువవుతుంది.. అఖిలేష్ నిలుచోటానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు]

అలేఖ్య: చిన్న దెబ్బ అన్నారు … మరీ అంతలా కుంటుతున్నారు? అసలు ఏమైంది ?

[అంటూ తన మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి … అఖిలేష్ కాళీ వైపు చూసింది .. ప్యాంటు మోకాలి నుంచి కింద వరకు రక్తం మరకలు ]

అలేఖ్య : మీరు చూసుకున్నారో లేదో… మీ మోకాలి పైన రక్తం కారుతుంది ..  

అఖిలేష్ : ఒహ్హ్ అవునా!!! … చూసుకోలేదు … 

అలేఖ్య : నిలుచోవడానికే కష్ట  పడుతున్నారు.. ఇంటి వరకు వెళ్ళగలరా ? కార్ లో first aid కిట్ ఉందా?

అఖిలేష్ : first aid లేదు కార్ లో … అయినా పర్లేదు.. నేను వెళ్లిపోగలను .. 

[ఒక్క సారిగా వర్షం మరింత ఊపు అందుకుంది..గాలి కూడా తోడవటం తో.. ఒక్క సారిగా power కూడా పోయింది… 

అప్పటి వరకు … వెలుగుతూ ఆగిపోతూ వున్న street ligth  కూడా శాశ్వతం గా ఆగిపోయింది  ]

అలేఖ్య : ఈ చీకట్లో  పైగా  ఈ వర్షం లో ...సైకిల్స్ తీయడం కష్టం… 

ఒక పని చేయండి… అదిగో  అదే నా ఇల్లు [10 ఆడుగుల దూరం లో ]

.. ఈ వర్షం తగ్గేంత వరకు ..నా ఇంట్లో ఉండండి…. అక్కడ first aid చేసుకుందురు గాని… 

అఖిలేష్ : అయ్యో...మీకెందుకు ఇబ్బంది..పైగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది.. పర్లేదు..నేను కార్ లో కూర్చుంటాను వర్షం తగ్గేంత వరకు ..

అలేఖ్య : నాకెలాంటి ఇబ్బంది లేదు … నా కంటూ ఎవరు లేరు … కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళు లేరు… 
 
మీరు కార్ లో కూర్చోవచ్చు …కానీ ఇంటికొస్తే .. కనీసం మీ కాలికి first aid అన్నా దొరుకుతుంది… ఇక మీ ఇష్టం … 

అఖిలేష్ : అయిష్టం గానే ...సరే అంటూ తలా ఊపాడు..

అలేఖ్య: పదండి అంటూ...తన ఇంటివైపు అడుగులు వేస్తుంది…

[అఖిలేష్ కార్ లాక్ చేసి...తన వెనకాల కుంటుతూ వెళ్తున్నాడు..

అలేఖ్య ఒక ఇంటి ముందు గేట్ తెరిచి...పక్కగా ఉన్న మెట్ల పైకి గబగబా వెళ్తుంది…

అఖిలేష్ కూడా...మెట్లుఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు...తన దెబ్బతగిలిన కాలితో..]

అలేఖ్య: [వెనక్కి తిరిగి] .. అయ్యో..sorry...అంటూ రెండు మెట్లు వెనక్కి దిగి … అఖిలేష్ పక్కకి వచ్చి ఒక చేతితో అఖిలేష్ కుడి చెయ్యి పట్టుకుని … ఇంకో చేతిని … అఖిలేష్ ఎడమ భుజం పైన  అదునుగా పెట్టింది … 

[ఒక అమ్మాయికి ఇంత దగ్గరగా ఉండడం… అఖిలేష్ కి ఇదే మొదటి సారి…[ఆ చలిలో కొంత వెచ్చదనం దొరికింది…అఖిలేష్ కి]

అలా రెండు ఫ్లోర్స్ మెట్లు ఎక్కాక, వచ్చింది అలేఖ్య ఇల్లు...అది roof top pent house...

ముందంతా..కొంచెం ఖాళీ స్థలం...పూల మొక్కల కుండీలతో నిండిపోయింది..వెనుక..ఒక చిన్న రూమ్… చూడటానికి చాలా చిన్నది .. ఒకరిద్దరు కంటే ఎక్కువ ఉండలేరు .. అంత చిన్నది… 

ఇద్దరు ఇంటి డోర్ ముందు నిలుచున్నారు… పక్కన కిటికీ తెరుచుకుని… గాలి వర్షం కి… కొట్టుకుంటుంది … 

అలేఖ్య .. ఆ కిటికీ డోర్ మూసేసి.. ఇంటి తాళం తీస్తుంది … 

ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు.. current లేకపోవడం తో… చిమ్మ చీకటి…

ఇంట్లోకి జల్లు పడుతుండడం తో తలుపు మూసేసి … అఖిలేష్ డోర్ దెగ్గరే… నిలుచున్నాడు … 

అలేఖ్య candels కోసం ఆ చీకట్లోనే  వేగంగా వెళ్తూ… జారీ పడ  బోయి … మల్లి తేరుకుంది .. 

రెండు candels  ని వెలిగించింది… 

ఆ candels వెలుగులో చూస్తున్నాడు అలేఖ్య ఇంటిని చూస్తున్నాడు .. అఖిలేష్ .. 

చిన్న రూమ్ … అందులోనే .. కిచెన్ .. ఇంకోపక్క బాత్రూం .. 

బయట వున్నవి చాలవన్నట్లు … ఇంట్లో కూడా చిన్న చిన్న చెట్ల కుండీలు … తన బెడ్ పైన … బెడ్ చుట్టూరా … పుస్తకాలు … ఆ బెడ్ ని చూస్తుంటే…పుస్తకాలతో చేసిన Game of Thrones సింహాసనం గుర్తుకొచ్చింది అఖిలేష్ కి… ]

అలేఖ్య : జాగ్రత్త గా చూసుకొని రండి .. ఆ పక్కన .. కొంచెం బురదగా వుంది… నేను కూడా జారాను .. 

అఖిలేష్: ఇంట్లో కి బురద ఎలా వచ్చింది .. అంటూ సందేహం గా చూస్తున్నాడు .. 

అలేఖ్య :ఇందాకటి నుండి కిటికీ తెరిచే  వుండింది కదా … ఆ వర్షం జల్లు పక్కనే  వున్నా చెట్ల కుండీల పై పడి … ఆ మట్టి కింద పడింది.. 

[నెమ్మదిగా పక్కనున్న ప్లాస్టిక్ కుర్చీ పైన కూర్చున్నాడు అఖిలేష్..

తాను ఒక టవల్ తో తల తుడుచుకుంటూ...ఇంకొక టవల్నిఅందించింది అలేఖ్య...అఖిలేష్ కి

అఖిలేష్...తల తుడుచుకోవటం పూర్తయింది....అలేఖ్య...first aid  కిట్ కోసం వెతుకుతుంది..

తనని అలానే చూస్తుండి పోయాడు..అఖిలేష్...ఆ తడిసిన బట్టల్లో అజంతా శిల్పంలా వుంది..అలేఖ్య..

ఇంత అందమైన అమ్మాయితో...అంత దురుసుగా ఎలా ప్రవర్తించానా...అంటూ మనసులో తనని తానూ తిట్టుకున్నాడు....]

అఖిలేష్: అలేఖ్య గారు...మీకు మనస్ఫూర్తిగా మరొక్కసారి...sorry..చెప్తున్నాను...ఆ రోజు నేను ఆలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు...

అలేఖ్య: [ ఇంకా వెతుకుతూనే]..జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి..దాని వల్ల వర్తమానం దెబ్బతింటుంది…

పొరపాటు..తప్పు..చూడడానికి ఒకేలా ఉంటాయి...మనకి ఓపిక, సహనం ఉంటేనే...వాటిని విడివిడిగా చూడగలం..

అఖిలేష్: coffe shop owner కిషోర్...నా ఫ్రెండ్ తమ్ముడే..నేను చెప్తే కాదనుడు… మీరు మల్లి అక్కడ జాయిన్ అవ్వచ్చు .. మీకు ఇష్టం ఉంటే… 

అలేఖ్య: దాని గురించి తర్వాత మాట్లాడదాం… ముందు మీ కాలి గురించి ఆలోచించండి ... [ అంటూ first aid kit  ని అఖిలేష్ చేతిలో పెట్టింది]

[అఖిలేష్ తన ప్యాంటు ను… ఒక చేత్తో మోకాలి పైకి లాగి పట్టుకుని..ఇంకొక చేత్తో first aid dressing కి ట్రై చేస్తున్నాడు... కానీ బట్టలు తడిచి ఉండడంతో...ఒక్కచేత్తో ప్యాంటు ను లాగి పట్టుకోవటం కష్టంగా ఉంది...]

అది గమనించిన అలేఖ్య …. “మీరు ఏమి అనుకోనంటే...మీరు మీ రెండు చేతులతో..ప్యాంటు ను పైకి లాగి పట్టుకోండి...నేను first aid dressing చేస్తాను”  అంది..

సరే అని తల ఊపాడు...అఖిలేష్..

[అఖిలేష్, చైర్లోనే కూర్చుని...తన ప్యాంటు ను మోకాలి వరకు లాగి పట్టుకున్నాడు..రెండు చేతులతో.. 

తనకి ఎదురుగా .. అలేఖ్య, బెడ్ పైన కూర్చుని…కాలికి అయిన  గాయాన్ని శుభ్రం చేసి.. ఆయింట్మెంట్ పూస్తుంది .. ]

అఖిలేష్ : మీరు ఒక్కళ్ళే వుంటున్నారు … మీ అమ్మ నాన్న…?

అలేఖ్య :నా కంటూ పెద్దగా ఎవరూ లేరు… నా చిన్న తనం లోనే … అమ్మ చనిపోయింది … మా నాన్న కొంత కాలం క్రితం చనిపోయారు … 

అఖిలేష్: ohh sorry…

అలేఖ్య : no need to be sorry….నాకు అంత బాధగా ఏమి అనిపించలేదు మానాన్న చనిపోయినప్పుడు…

అఖిలేష్: మరి  brothers or sisters?

అలేఖ్య: ఉన్నారు...కానీ…[చెప్పడానికి ఇబ్బంది పడుతూ..]

అఖిలేష్ : its OK...మీకు ఇష్టం లేకపోతే … discuss చేయొద్దు .. 

నా విషయానికి వస్తే… నాన్న నా చిన్న తనం లోనే చనిపోయారు … మా అమ్మే నాకు అమ్మానాన్నా… చాలా కష్టపడింది ఒక్కతే  నన్ను పెంచడానికి .. కొంత వరకు మా మేన మామలు సహాయం చేసారు… ప్రస్తుతానికి తాను మా ఊర్లో నే  ఉంటూ … మా పొలాలు చూసుకుంటుంది .. 

అలేఖ్య : [మోనంగా వింటుంది]

అఖిలేష్ : మీకు మొక్కలు , పుస్తకాలు అంటే ఇష్టమా ? 

అలేఖ్య : మొక్కలు పెంచడం నా హాబీ … నాదృష్టి లో ప్రకృతి మాత్రమే దేవుడు …ఎలాంటి కానుకలు, ప్రసాదాలు, rituals కోరుకోకుండా … మానవాళికి నిస్వార్ధంగా ప్రాణ వాయువు ఇచ్చేవి ఇవే..  

అఖిలేష్: hmm nice...మరి పుస్తకాలు?

అలేఖ్య: just for knowledge…

[ మరొక్కసారి...పుస్తకాలని తీక్షణంగా చూసాడు..history, psychology, management, financial, literature, biography...etc అన్ని రకాలా పుస్తకాలు వున్నాయి...అంతలో పుస్తకాల వెనక అలేఖ్య ఫోటో..graduation dress  లో..ఇంకో చేతిలో medal పట్టుకుని…

ఆ ఫొటో లో  ఇంకొకరు ఎవరో వున్నారు...కానీ వాళ్ళు ఉన్న భాగం చించేసివుంది .. ]

అఖిలేష్: మీరేం చదువుకున్నారు…

అలేఖ్య: ఏది మంచి...ఏది చెడో...తెల్సుకునేంత చదువుకున్నాను…

అఖిలేష్: i mean educational qualifications, degrees…?

అలేఖ్య: ఒహ్హ్ అవా...అవి ఉండేవి ఒకప్పుడు...కానీ ఇప్పుడు లేవు...అవి లేవు అనే బాధ కూడ లేదు.. 

అఖిలేష్ : [ఆశ్చర్యంతో] ఎందుకు?

అలేఖ్య: మన సమాజం లో చదువు అంటే...డబ్బులు సంపాదించడానికే అనే మూఢనమ్మకం ఎక్కువ ఉంది …

ఎంత ఎక్కువ చదువుకుని..ఎన్నిడిగ్రీలు సంపాదిస్తే...అంత సంపాదన…అనే ధోరణిలోనే జనాలంతా ...విద్య ని కూడా వ్యాపారం  చేసేసారు… 

అందరూ చదువుకుంటున్నారు గాని …. ఏదయినా passion  తో ఒక విషయాన్ని తెలుసుకుందాం అనే ధోరణిలో ఎక్కడా చదువుకోవట్లేదు… ఏమి చదువుకుంటే ఎంత సంపాదన వస్తుంది అనే వాళ్ళ్లే ఎక్కువ …. 

ఈ చదువుకి , సంపాదనకి  వున్న సంబంధం వల్ల.. జనాలు సర్టిఫికెట్స్ కోసమో , మార్కుల కోసమో  చదువుతున్నారు తప్ప .. చదువు కున్నది మన జీవితాల్లో పాటించలేని పరిస్థితి .. 

అంతెందుకు ఒక పిల్లవాడు .. డార్విన్ సిద్ధాంతాన్ని చదివి… అది పరిక్షల్లో రాసి …మరుసటి  రోజు గుడికి  వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు… “దేవుడా నన్ను పరీక్షల్లో పాస్ చేయించు అని”... అంటే ఆ డార్విన్ సిద్ధాంతాన్ని పరీక్షల్లో మార్కుల కోసమే చదివాడు… దాని నుంచి ఏమి నేర్చుకోలేదు … ఇది ఒక చిన్న ఉదాహరణ .. 

మనకున్న జ్ఞానాన్ని సర్టిఫికెట్స్ తో కొలవడం కరెక్ట్ కాదని..నా నమ్మకం…
 
అఖిలేష్ : మీరన్నది కరెక్టే … కానీ మీరూ అందరిలా ఆలోచిస్తే … మీకు మంచి ఉద్యోగాలు వచ్చి … మీ లైఫ్ బాగుంటుంది కదా … 

అలేఖ్య : నా లైఫ్ ఇప్పుడు కూడా  బాగుంది .. నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను .. నా అభిరుచులకు తగినంత సమయం కేటాయిస్తున్నాను … నాకు నచ్చింది చదువుకుంటున్నాను … 

మీరు చెప్పే … మంచి ఉద్యోగాలు .. ఒక చేతితో  డబ్బు ఇచ్చి …  ఇంకో చేత్తో మీ లైఫ్ ని తీసేసుకుంటున్నాయి … 

కొంచెం ఆలోచించండి … ఎవరికో డబ్బున్నవాడికి డబ్బు సంపాదించిపెట్టటం కోసం మనం 18 సంవత్సరాలు కష్టపడి  చదివి … మిగిలిన మన జీవితాంతం వాడికి చాకిరి చేస్తాం …తర్వాతా వాడిచ్చే నెల నెల జీతం ఎంత గొప్పదైనా …అది గడిచిపోయిన  మీ జీవితాన్ని వెల కట్టగలదా … ?

అందుకే నేను చేసే పని చిన్నదయినా, పెద్దదయిన … అది నా జీవితాన్ని ప్రభావితం చేయకూడదనుకుంటాను…  

అఖిలేష్ : ఓకే , అందుకేనా మీరు కాఫీ షాప్ లో జాయిన్ అయ్యారు … 

అలేఖ్య : అది ఒక కారణం…  కానీ అది ఒక్కటే కారణం కాదు .. 

అఖిలేష్ : నేను కిషోర్ తో  మాట్లాడుతాను … మీరు మల్లి అక్కడ జాయిన్ అవుతానంటే… 

అలేఖ్య: అలాగే , కానీ నేను పని చేసే చోట నా వ్యక్తిగత వివరాలు ఎక్కువ ఇవ్వడం నాకు ఇష్టం లేదు …ఆ విషయం లో మీరేదయినా హెల్ప్ చేస్తానంటే నేను తిరిగి జాయిన్ అవుతాను .. 

అఖిలేష్ : ఓకే.. 

[వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది … అలేఖ్య , అఖిలేష్ కాలికి కట్టు కట్టడం పూర్తయింది ]

[అలేఖ్య  లేచి వెళ్లి , కిటికీ తలుపు తెరిచి ] వర్షం తగ్గింది అంది  …

తిరిగి  వెనక్కి వస్తూ  … అప్పటికే బురదతో ఉన్న నేల పైన … ఒక్కసారిగా మల్లి జారింది … [ఈ సారి తనని తానూ కంట్రోల్ చేసుకో లేక పోయింది ].. 

ఎదురుగా  కూర్చున్న అఖిలేష్ పైన … పూర్తిగా పడిపోయింది... అలా పడడం తో ఇద్దరి పెదాలు ఒక్క క్షణం పాటు గుద్దుకున్నాయి …

ఇద్దరికీ..ఏమైందో అర్థం కాలేదు …కానీ అలానే ఉండిపోయారు ఒక్క క్షణమ్  వాళ్ళని వాళ్ళు మరిచి పోయి … 

అంతలో అంతరాయం ...current వచ్చి, ఒక్కసారిగా light వెలిగింది.. 

అప్పటివరకు ...  అఖిలేష్ ఒడి లో ఉన్న అలేఖ్య … స్పృహ లోకొచ్చి చట్టుక్కున లేచి నిలుచుంది .. 

ఇద్దరి ముఖాలు సిగ్గుతో ఎరుపెక్కాయి … మొహమాటం తో నోట్లోంచి మాట రావట్లేదు ఇద్దరికీ .. 

అఖిలేష్ : [పైకి లేచి నిలబడి .. బయలుదేరటానికి  సిద్దపడుతూ ] ఇది నా business card..రేపు ఒక సారి నాకు కాల్ చేయండి … నేను కిషోర్ తో మాట్లాడుతాను …

[అలేఖ్య… ఆ card  ని తీసుకుంటూ సరే అని చెప్పింది ]

కింద కారుకి అడ్డం గా ఉన్న సైకిల్స్ విషయం గుర్తుకొచ్చి ..”ఒక్క క్షణం, నేను వస్తున్నాను కిందకి” అని అఖిలేష్ తో పాటు ... బయలుదేరింది … 

ఇద్దరు .. మెట్లు దిగి … కార్ కి అడ్డం గా వున్నా సైకిల్స్ ని తీసి పక్కన పెట్టారు… 

అఖిలేష్ కార్ లో కూర్చుని … రివర్స్ గేర్ వేసి … అలేఖ్య తో.. “రేపు మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను”.. అని  బయలుదేరాడు .. 

అలేఖ్య .. చిన్న చిరునవ్వుతో .. చేయి ఊపుతూ .. “సరే” అంది .. 

అఖిలేష్.. మెయిన్ రోడ్ పైకి వచ్చి , తన ఇంటికి ప్రయాణమయ్యాడు … 

మనసులో ఏదో తెలియని ఆనందం … కార్ కూడా మేఘాల్లో వెళ్తున్నట్లు వుంది అఖిలేష్ కి … 

ఇంకా వుంది 

Link to comment
Share on other sites

50 minutes ago, dasari4kntr said:

Next dhantlo pakka masala undali ani dB pillala korika bro

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...