Jump to content

అజ్ఞాత అతిధి - (story series written by me) -(part 5 updated)!!


dasari4kntr

Recommended Posts

7 hours ago, dasari4kntr said:

title will be apt for my story...it will do justice in future story updates...

BTW...this is going to be psycho thriller... :)

Nice ..👍

Link to comment
Share on other sites

On 5/5/2020 at 4:23 AM, RSUCHOU said:

nice story. Waiting for the next parts. 

thanks...working on it...

most probably next week....

i will try to maintain it as weekly update...

Link to comment
Share on other sites

3 - ప్రయాణం 

 

కొన్ని వారాల తర్వాత … ఒక రోజు… సమయం రాత్రి  8:30 PM


అఖిలేష్, పని ముగించుకుని …పార్కింగ్ కి వచ్చి కార్ లో కూర్చున్నాడు…కార్ స్టార్ట్ చేసి, ఇంటికి బయలు దేరటానికి రెడీ అవుతున్నాడు … 


దూరంగా  బైక్ ఇంజిన్ సౌండ్ వస్తూ  పోతు వుంది… 


ఎవరా అని తలతిప్పి చూసాడు… తన team mate అశోక్, తెగ ట్రై చేస్తున్నాడు బైక్ స్టార్ట్ చెయ్యడానికి … కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వనంటుంది..  ఒక పక్క మబ్బు ఉరుముతోంది … 


పని ఎక్కువ ఉండడం తో … తనతో పాటు తన టీం లో కొంత మంది లేట్ గా ఇళ్లకు వెళ్లడం స్టార్ట్ చేస్తున్నారు … 


కార్ ఆపి .. అశోక్ దగ్గరికి వెళ్ళాడు అఖిలేష్ … 


అఖిలేష్ : ఏమైంది అశోక్… 


అశోక్ : ఏమో సార్ , పెట్రోల్ ఫుల్లుగా వుంది… కానీ బైక్ స్టార్ట్ అవ్వడం లేదు … 


అఖిలేష్ :వాతావరణం చల్లగా వుంది కదా … ఇంజిన్ కూల్ అయిందేమో … చోక్ ఇచ్చి ట్రై  చేశావా ?


అశోక్ : చేశాను సార్..కానీ వర్క్ అవ్వలేదు .. 


అఖిలేష్ : నేను ట్రై చేస్తాను..ఇవ్వు .. 


[అశోక్ బైక్ హేండిల్ ని .. ఇచ్చాడు అఖిలేష్ కి]


అఖిలేష్.. ట్రై చేస్తున్నాడు …. ఎలాంటి ఫలితం లేదు … 


ఒక పది నిమిషాల నిరంతర ప్రయత్నం తర్వాత… బైక్ స్టార్ట్ అయింది … కానీ అఖిలేష్ ఆ ఆనందంలో క్లచ్ వదిలేసాడు … [బైక్ డ్రైవ్ చేసి చాలా రోజులు అవ్వడం వలన…]


[బైక్ అలా ముందుకు ఎగిరి .. ఎదురుగా ఉన్న గోడని గుద్దుకుని కింద పడింది.. ముందు లైట్ పగిలి … బైక్ పరిస్థితి ఇంకా అద్వాన్నం అయింది … ]


అఖిలేష్ కింద పడి ఉన్నాడు… 


అశోక్: అయ్యో సార్ .. మీరు ఓకేనా ?


అఖిలేష్ : పైకి లేస్తూ …i am ok అంటూ .. అబ్బా అన్నాడు .. 


[అఖిలేష్ మోకాలి పై పడడం తో .. కొంచెం దెబ్బ తగిలింది]


అఖిలేష్ : ...sorry ashok… మీకు హెల్ప్ చేద్దామని వచ్చి .. మీకు ఇంకా ప్రాబ్లెమ్ చేశాను .. మీ బైక్ ని ఇక్కడే వదిలేయండి .. రేపు సెక్యూరిటీ స్టాఫ్ కి చెప్పి నేను రిపేర్ చేయిస్తాను .. ఈ రోజుకి నా కార్ లో రండి.. నేను వదిలిపెడుతాను మీ ఇంటి దెగ్గర … 


అశోక్: its ok  sir, నేను టాక్సీ లో వెళ్ళిపోతాను… అందులోనూ..మీకు కాలికి కూడా దెబ్బ తగిలింది…నేను వుండే చోటు మీకు దూరం కూడా … 


అఖిలేష్: thats fine...చిన్నదెబ్బె..కొంచెం దొకుంది… కానీ నేను డ్రైవ్ చేయగలను …పదండి కార్లో కూర్చోండి…


[వర్షం మెల్లగా మొదలవడం తో...ఇద్దరు కార్లో కూర్చుని అశోక్ ఇంటివైపు బయలుదేరారు]


[కార్లో…]


అఖిలేష్ : అశోక్ నీకొక బాబు అన్నావ్ కదా...స్కూలు కి .. వెళ్తున్నాడా ?


అశోక్: వెళ్తున్నాడు సర్...7 సంవత్సరాలు ఇప్పుడు …


అఖిలేష్ : nice, ఎలా వుంది ఫామిలీ లైఫ్… జీతం సరిపోతుందా ?


అశోక్ : పర్లేదు సర్ … పిండి కొద్ది రొట్టె … happy గా వున్నాం ..అది చాలు.. 


[కార్ ప్రయాణం సాగుతుంది … కొంచెం దూరం పోయాక ]


అశోక్: మీ పెళ్లెప్పుడు..సార్...మన టీమ్ లో..మీరొక్కళ్ళే బ్యాచిలర్ [ కుతూహలంగా ]


అఖిలేష్: చేసుకోవాలి అశోక్...నీకు తెలిసిన సంబంధం ఉంటే మాట్లాడు…[నవ్వుతూ]


అశోక్: ఓకే సర్...మా ఊర్లో… [అంటూ స్టార్ట్ చేశాడు]


అఖిలేష్: నవ్వుతూ...అశోక్ నేను జోక్ చేసాను…నాకు పెళ్లి పైన strong opinions ఉన్నాయి… 


అశోక్ : చెప్పండి సర్ … అవి ఏమిటో … మా ఇంటికి చేరుకోవడానికి మనకింకా 20 నిమిషాలు  పడుతుంది… 


అఖిలేష్ : నేను పుట్టి పెరిగింది మా ఊర్లోనే … చిన్నప్పటి  నుంచి సహజంగానే ముక్కు సూటిగా ఉండడం నా మనస్తత్వం … ఈ కాలం అమ్మాయిలకి ఆలా ఉండడం నచ్చట్లేదు … అంతెందుకు ఊర్లో వున్న నా సొంత మరదళ్లకే నా విధానం నచ్చలేదు … actual గా నాకు వాళ్ళు నచ్చలేదు అనుకో .. 


నాకు కొంచెం...short temper ఎక్కువ… అది మీకూ  తెలుసుకదా 


అశోక్: [ అవును అన్నట్లు తల ఊపుతూ]


అఖిలేష్: కొంచెం ఓర్పు, individuality, ఇంకొకరిని అనుకరించకుండా తాను తనలా వుండే అమ్మాయి దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నా...


మా అమ్మ అదే పనిగా అడుగుతుంది … పెళ్లి ఎప్పుడు చేస్కుంటావురా ? అని… రేపు ఎల్లుండి అని సాగదీస్తున్నా … 


మనసుకి నచ్చకుండా చేసుకుని … జీవితాంతం ఉండాలంటే కష్టం కదా… 


అశోక్ : పెళ్లంటే  అదే కదా సర్ … adjustment అవ్వడం ...మీరెంత ఇష్టపడి కొనుక్కున్న బట్టలైనా , కార్ ఐన ఇంకేదయినా వస్తువు అయినా … మీకు వాటిపై ఆ మోజు ఒక్క సంవత్సరమే…ఆ వస్తువులకి కూడా మన పై మోజు పోయిందా అని ఆలోచించం… ఎందుకంటే అవి వస్తువులు...వాటికి ప్రాణం, ఫీలింగ్స్ వుండవు … అవి చెప్పలేవు … 


కానీ పెళ్లి చేసుకుంటే …అలాకాదు..  మీలా ఇష్టాలు, అయిష్టాలు , మోజులు చూపే వాళ్ళు, చెప్పే వాళ్ళు  మీతోనే ఉంటారు … మీకున్న ఫీలింగ్సే … వాళ్ళకి ఉంటాయి … 


అప్పుడు వాళ్ళని  మీరు ఇష్ట పడుతూ  వాళ్ళ ఇష్టాన్ని తిరిగి పొందడం అనేది మీకు కర్తవ్యం అవుంతుంది… మీ లైఫ్ లోకి వచ్చే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది...


ఈ  process నే ఒకరి ఫై ఒకరు ప్రేమ చూపించుకోవడం అంటారు … సర్ ...


అఖిలేష్ : [ఒక్క సారి అశోక్ వైపు చూసి] నువ్వు చెప్పిన దాంట్లో కొంతవరకే అర్థం అయింది...మిగిలింది అనుభవిస్తే కానీ అర్థం అవ్వదేమో....


[ఇంతలో అఖిలేష్ వుండే ప్లేస్ వచ్చింది...అది ఒకచిన్న గల్లీ...ఒక కార్ మాత్రమే పెట్టె రోడ్లు … చుట్టూ అపార్ట్మెంట్స్… దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వుండే ప్రదేశం ]


అంతలో వర్షం ఇంకొంచెం ఎక్కువ అయింది …. 


అశోక్: సర్.. ఈ గల్లీ మొదట్లో కార్ ఆపండి … నేను నడుచుకుని వెళ్ళిపోతాను… 


అఖిలేష్ : పర్లేదు  అశోక్.. వర్షం ఎక్కవైంది .. గొడుగు కూడా లేదు.. మీ ఇంటి ముందే వదిలిపెడ్తాను పద .. అంటూ గల్లీ లోకి మెల్లగా కార్ ని తీసుకెళ్తున్నాడు… 


ఆలా ఇరుకు సందు లో కొంచెం లోపలికి వెళ్ళాక… కార్ ఆపాడు అఖిలేష్..


అశోక్ కార్ దిగి..thank you sir అని చెప్పి, డిన్నర్ చేసి వెల్దురురండి… అనిపిల్చాడు


“లేదు అశోక్...మరో సారి వస్తాను..ఇప్పటికే బాగా లేట్ అయింది”


ఓకే అనిచెప్పి ...పరుగున తన ఇంట్లోకి వెళ్ళాడు … అశోక్


అఖిలేష్ తన కార్ లో .. వెనక్కి తిరిగి దారి చూస్తూ కార్ ని రివర్స్ లో .. వెనక్కి పొనిస్తున్నడు … 


వీధి  లైట్ వెలుగుతూ ఆగుతూ ఉండడం వల్ల … వెనక దారి సరిగా కనిపించట్లేదు … అలాగే వెళ్తున్నాడు  వెనక్కి ఆగి  ఆగి … 


ఇంకాసేపట్లో ఆ గల్లీ నుంచి బయటికి వస్తాడనంగా … ఎవరో గొడుగు పట్టుకుని గల్లీ లోకి వస్తున్నారు ... 


వారిని తప్పించపోయి .. గల్లీ కి పక్కగా పార్క్ చేసి వున్న సైకిల్స్ ని గుద్దాడు…  కార్ వెనకనుంచి … 


ఆ సైకిల్స్ దారికి  అడ్డంగా పడ్డాయి … కార్ రివర్స్ చేయటానికి లేకుండా … 


ohh shoot..అను కుంటూ .. కార్ డోర్ తెరిచి … ఒక్క ఉదుటున వచ్చాడు కార్ లోంచి బయటికి … 


ఒక్కసారిగా  అదుపు తప్పి కింద పడబోయి .. కార్ ని పట్టుకుని నిలుచున్నాడు .. [అప్పుడు తనకి అర్థం అయ్యింది … office దగ్గర తగిలిన దెబ్బ ..చిన్నది కాదు అని ]


అలానే కుంటుకుంటూ వెళ్లి .. దారికి అడ్డం గా పడిన సైకిల్స్ ని ఎత్తుతున్నాడు … 


అంతలో .. ఆ సైకిల్స్ పై ఎవరిదో చేయి పడింది తనకి సహాయం చేస్తున్నట్టు … 


మొదట చీకట్లో అర్థం కాలేదు కానీ … ఎవరో ఆడ వాళ్ళు అని అర్థమైంది … 


ఇంతలో ఒక పెద్ద ఉరుము … ఆ వెలుగులో చూసాడు ఆమెని … ఎక్కడో చూసిన జ్ఞ్ఞాపకం … 

కొన్ని క్షణాల్లో గుర్తుకువచ్చింది … ఆమె ఎవరో కాదు … coffee shop లో తాను దురుసు గా ప్రవర్తించి ఉద్యోగం లోంచి తీసి వేయించిన  “అలేఖ్య”...

 

(ఇంకా వుంది next part coming soon)

Link to comment
Share on other sites

Agnathavaasi -> ee peruko oka peddha charithra vundhi brother, title peru maarcheyamani fans requesting. ledhante ee title chusey sagam mandhi paaripothaaru :giggle:

Link to comment
Share on other sites

1 minute ago, JaiTDP said:

neeku kuda @Trivikram sentiment emaina vundha - anni "A" thone started :)

Agnathavasi, Akhilesh, Ashok, Alekhya.

nope...each episode title kooda "pa" tho started...

Link to comment
Share on other sites

1 minute ago, JaiTDP said:

you mean part aa ??

didn't get it ..

episode titiles..

పొరపాటు 

పశ్చాతాపం 

ప్రయాణం 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...