Jump to content

అజ్ఞాత అతిధి - (story series written by me) -(part 5 updated)!!


dasari4kntr

Recommended Posts

2 - పశ్చాతాపం 

 

సమయం 3:05 PM
 

అప్పుడే కార్ పార్క్ చేసి.. హడావిడిగా పెరిగిస్తున్నాడు అఖిలేష్ రిసెప్షన్ వైపు..కొన్నిసెకండ్స్ లో చేరుకున్నాక...రిసెప్షన్ తో..(ఆయాసపడుతూ) i am akhilesh, i  have appointment with Mr. Agarwal at 3.00 PM
 

రిసెప్షనిస్ట్..టైం చూసుకుంటూ...అగర్వాల్ గారు, మీ కోసం ఎదురు చూస్తున్నారు అంది...అగర్వాల్ రూమ్ కి..దారి చూపిస్తూ..
 

thank you అని చెప్పి...అగర్వాల్ రూమ్ లోకి వచ్చాడు అఖిలేష్…
 

ఎదురుగా అగర్వాల్ తన సీట్ లో కూర్చునివున్నాడు...పక్కన PA వుంది…
 

రూమ్ లోకి, వస్తూనే...తనని తానూ పరిచయం చేసుకున్నాడు అఖిలేష్…”Hello Sir, I am Akilesh , Financial Adviser.  మీతో ఈరోజు నాకు appointment దొరకటం చాలా అదృష్టం”.
 

అగర్వాల్, ఏమి బదులివ్వకుండా, ఆలా చేయి కుర్చీ వైపు చూపించి కూర్చోఅన్నట్లు సైగ చేసాడు…
 

[అఖిలేష్  మనసులో కొంచెం అసహనం]
 

అగర్వాల్  ఇంకా తన  PA తో మాట్లాడుతున్నాడు...అఖిలేష్ తన ముందు కూర్చుని దిక్కులు చూస్తూ wait  చేస్తున్నాడు…
 

రూమ్ అంతా imported decarative items, paintings...వాటి ఒక్కొక్కదాని విలువ లక్షలు లేదా కోట్లు కూడా  ఉండొచ్చు…[తానూ కూర్చున్నకుర్చి తో సహా]...మాంచి sound party  అని అనుకున్నాడు మనసులో
 

30 నిమిషాలు గడిచింది …
 

“చెప్పండి అక్షరేశ్” అన్నాడు అగర్వాల్…
 

అఖిలేష్ : sir  నాపేరు అఖిలేష్…
 

అగర్వాల్ : ఆ ఆ అదే ...చెప్పండి తొందరగా...నాకు ఎక్కువ టైం లేదు..
 

అఖిలేష్ : [మనసులో మరికొంత అసహనం] sir మీ new investment strategy  గురించి discuss చెయ్యడానికి వచ్చాను …మీకు ఆల్రెడీ మెయిల్ చేశాను...మీకు నచ్చితే...మీ దగ్గర నుండి కొన్నిసంతకాలు...
 

అగర్వాల్ : ఆ చూసాను...అంత బానే ఉంది...కానీ ఆ tax saving strategy కొంచెం మార్చండి...ఆ tax svaing plans లో మనీ కి ఎదుగు బొదుగూ ఉండదు…
 

అఖిలేష్ : ok sir, కానీ మీరు  tax తగ్గించుకోవాలంటే...కనీసం charity donations అన్న చేయాలి...
 

అగర్వాల్ : ok,  పర్వాలేదు..చేద్దాం అలాంటి ఉచిత  దానాలు ఎన్నయినా  పేపర్ పైన [నవ్వుతూ]
 

అఖిలేష్ కి మొదట అర్థం కాలేదు...కానీ  పక్క నున్నPA  కూడా నవ్వుతూ ఉండడంతో విషయం బోధ పడింది.
 

అఖిలేష్ : ok sir,  ఒక్క tax saving plan తప్ప, మిగతా వాటికి మీరు ఓకే అంటే..ఈ forms  పైన సంతకం చెయ్యండి అని తన దగ్గరవున్న documents  ఇచ్చాడు..
 

అగర్వాల్ : ఆ  documents తీసుకుని సంతకం పెట్టి వెనక్కి ఇస్తూ...ఇంతకు ముందు మీ company నుండి అరవింద్ అని ఒకతను వస్తుండే వాడు..మాదగ్గరికి..అతనేమయ్యాడు?
 

అఖిలేష్ : అతన్ని మా కంపెనీ జాబ్ లోనుంచి తీసేసింది...unethical practice చేస్తున్నాడు అని...అతని place లో నన్ను అప్పోయింట్ చేసింది...
 

అగర్వాల్ : ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు..
 

అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం..
 

documents ని తన బ్యాగ్ లో పెట్టుకుని .. “pleasure doing business with you sir” అని అయిష్టం గానే  చెప్పి ...ఒక్కసారి గా పైకి లేచాడు…
 

ఇంతలో..భళ్ళుమని శబ్దం..
 

[ఒక్క క్షణం క్రితం…]
 

ఒక వృద్ధుడు...బహుశా 75+ సంవత్సరాలు, అగర్వాల్ కోసం పండ్లరసం (juice) తెస్తున్నాడు ట్రే లో…
 

అతను ఆలా తన పక్కగా వస్తున్నప్పుడు..అఖిలేష్ ఒక్కసారిగా లేవడంతో..అఖి బుజం తగిలి..ఆవృద్ధుడి చేతిలో వున్నా ట్రే ఎగిరి పక్కనున్న couch(sofa set)  పైన పడింది..ఆ couch  అంతా...జ్యూస్ పడింది..ట్రే క్రింద పడి భళ్ళు మంది...
 

అగర్వాల్ : [కోపం తో] ఏరా ...కళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా...10 లక్షలు విలువ చేసే సోఫా...2 లక్షలు విలువ చేసే ట్రే...నీ బాబు సంపాదన అనుకున్నావా..
 

ఆ వృద్ధుడు : క్షమించండి sir…నా తప్పు ఏమి లేదు...ఈ sir.. వెనుకా ముందు ఏమి చూసుకోకుండా గబుక్కున లేచాడు…[అఖిలేష్ వైపు చూపిస్తూ..]
 

అగర్వాల్ : నోరుమూయి...పెద్దవాళ్ళు పనిచేస్తుంటే..నీలాంటోళ్ళు వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవాలి...పై పెచ్చు..నీ తప్పు ఏమి లేదని  నువ్వే చెప్పేస్తున్నావ్… PA ..అసలు  వీడిని ఎవడు పనిలో పెట్టింది…తక్షణమ్ పనిలో నుంచి తీసెయ్ … చేసిన పని కి కూడా డబ్బులు ఇవ్వదు …
 

PA : ok sir
 

అఖిలేష్: s0rry its my mistake అని  ఏదో చెప్పబోతున్నాడు…ఇంతలో
 

అగర్వాల్ : Mr. aksharesh , you can leave…[అఖిలేష్  ని ఇంకా  అక్షరేష్  అని పిలుస్తూ]
 

అఖిలేష్  అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు … తన కార్ లో కూర్చుని...మొత్తం సంఘటన ని గుర్తు చేసుకున్నాడు..
 

అఖిలేష్ కి ఇదంతా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది...చేసేపనిలో తమ ప్రమేయం లేకుండా జరిగే చిన్నపొరపాట్లు..ఎంతకు దారితీస్తాయో ఆక్షణం కళ్ళకు కట్టినట్లు కనిపించాయి… కొన్ని గంటల క్రితం coffee shop  లో జరిగిన ఘటన గుర్తుకు తెచ్చుకుని, తనలో తానూ అగర్వాల్ ని చూసుకున్నాడు…
 

తనకి తెలియకుండా తాను ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం,  వాళ్ళ వ్యక్తిత్వాన్నికి కాకుండా … వాళ్ళు వున్నా హోదా లేక చేసే జాబ్ బట్టి ఇస్తున్నాడు అని పశ్చాతాపడ్డాడు…
 

తానూ అనుకోకుండా చేసిన చిన్న పొరపాటు తో .. ఒక వ్యక్తి తన ఉద్యోగం పోగొట్టుకోడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఇంతలో తనకు coffee shop  లో అమ్మాయి గుర్తుకువచ్చింది ..
 

వెంటనే mobile తీసి .. కిషోర్ కి కాల్  చేసాడు ..
 

ఫోన్ రింగ్ అవుతుంది.. కాసేపటికి ..
 

కిషోర్ : hello...అన్న
 

అఖిలేష్ : hello kishore...ఈ రోజు మీ షాప్ కి వచ్చాను…అప్పుడు ఏమి  జరిగిందంటే  [అని  చెప్పబోతుంటే ]
 

కిషోర్ : తెలిసిందన్న… స్టాఫ్ చెప్పారు … ఆ అమ్మాయిని..పనిలోంచి తేసేసాను .. ఆ అమ్మాయికి ఇదే మొదటి రోజు .. ఆఖరి రోజు …
 

అఖిలేష్ : no no...పనిలోనుంచి తీయకు .. అది చిన్న పొరపాటే..

 

కిషోర్ : లేదన్న … already పంపించేసాను .. గంట క్రితం .. 
 

అఖిలేష్ : ohh shoot...its ok...జరిగింది చిన్న పొరపాటే … ఆమె తప్పేం లేదు … మల్లి పిలిచి పనిలో పెట్టుకో ..
 

కిషోర్ : కానీ ఆమె వివరాలు ఏమి తెలియదు అన్న … ఎక్కడ ఉంటుందో, phone no ఏంటో  … కనీసం joining application కూడా నింపలేదు …నువ్వు వచ్చిన టైం లో వేరే స్టాఫ్ లేకపోవటం వల్ల ఆమెని పంపాడంట నీకు coffee serve చేయడానికి supervisor గాడు...ఎలా చేస్తుందో చూద్దామని …
 

అఖిలేష్ : ohh...i am s0rry to her...జరిగినదాంట్లో ఆమె తప్పు లేదు..ఆమె మళ్ళీ వస్తే నాకు కాల్ చేయి … ఇంతకీ ఆమె పేరు తెలుసా..

 కిషోర్ : సరే అన్న … ఆమె పేరు “అలేఖ్య” అని చెప్పింది… అంతకంటే ఎక్కువ వివారాలు తెలియవు … వుంటా అన్న bye…

అఖిలేష్ : [గుండెల్లో పశ్చాతాపం తో ] ఫోన్ కట్ చేసాడు … 


 

(ఇంకా వుంది next part coming soon)

  • Like 1
Link to comment
Share on other sites

"ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు..
 

అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం.."

 

@dasari4kntr Em antharardham? idi malli future lo cheptara?

Nice story. Very engaging. Coffee and juice padipoye linking scenes cchala bagunnai. Waiting for further story

Link to comment
Share on other sites

3 minutes ago, Ellen said:

"ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు..
 

అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం.."

 

@dasari4kntr Em antharardham? idi malli future lo cheptara?

Nice story. Very engaging. Coffee and juice padipoye linking scenes cchala bagunnai. Waiting for further story

Kadu, Previous dialogue lo Paper Paina donations ennaina cheyyochu ani navvaru kada, daniki connection.

Link to comment
Share on other sites

2 minutes ago, pencil said:

aa title vintene pk fans ki 1 Month Lo Crorepathi: 11 Things You'll Relate To If You've Been ...

title will be apt for my story...it will do justice in future story updates...

BTW...this is going to be psycho thriller... :)

Link to comment
Share on other sites

4 minutes ago, ShruteSastry said:

Kadu, Previous dialogue lo Paper Paina donations ennaina cheyyochu ani navvaru kada, daniki connection.

oh yea...hahah because aravind was also corrupt kada. Makes sense. thanks

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

title will be apt for my story...it will do justice in future story updates...

BTW...this is going to be psycho thriller... :)

melcow byak pencil

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...