dasari4kntr Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 పొరపాటు పశ్చాతాపం ప్రయాణం పరిచయం ప్రేమ Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post dasari4kntr Posted May 4, 2020 Author Popular Post Report Share Posted May 4, 2020 1 - పొరపాటు mumbai మహానగరం - మధ్యాహ్నం 12:00 PM అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని ఏవో files చూస్తున్నాడు తన computer లో … అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు phone లో client PA.. “Mr. అఖిలేష్, ఈ రోజు 3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు. ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.“ అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన కంప్యూటర్ లో క్యాలెండర్ చెక్ చేసుకుంటూ … ఫోన్లో, “లేదు నేను ఈరోజే అగర్వాల్ గారిని కలుస్తాను.. ఈ రోజు appointment confirm చెయ్యండి” ok అఖిలేష్ , మీకు అగర్వాల్ తో 3:00 PM to 4:00 PM appointment confirm, అని PA ఫోన్ పెట్టేసింది. [అఖిలేష్, ఒక Financial Adviser, తన వృత్తిలో ఎంతో పేరు వున్న వ్యక్తి. అగర్వాల్ ఒక పెద్ద jewlery shop ఓనర్, తనకి ఇండియా అంతటా షాప్స్ వున్నాయి. ] అఖిలేష్, వెంటనే, కొన్ని డాక్యూమెంట్స్ ప్రింట్ తీసుకుని , బ్యాగ్ సర్దుకున్నాడు, క్లయింట్ ని కలవడానికి. క్లయింట్ వున్న చోటుకి , గంటా గంటన్నర ప్రయాణం, parking lot కి వచ్చి తన కార్ స్టార్ట్ చేసాడు.. తాను ఏ client దగ్గరికి వెళ్తున్న మొదట ఆగేది, తన మిత్రుడి తమ్ముడు కిషోర్ coffee shop దగ్గరే. ఆ కాఫీ షాప్ చాలా అధునాతనంగా ఉంటూ అన్నిసౌకర్యాలు ఉండడంతో, అక్కడ కాఫీ తాగుతూ, క్లయింట్ మీటింగ్ కి డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతాడు. ఆ కాఫీ షాప్ లో ఉన్న ప్రతి స్టాఫ్ తనకు పరిచయమే. ఆ కాఫీ షాప్ పెట్టటానికి, కిషోర్ కావలిసిన surety ఇచ్చి లోన్ సహాయం కూడా చేసింది అఖిలేషే.. కార్ ని , కాఫీ షాప్ ముందు పార్క్ చేసి, లోపలి వెళ్ళాడు. కౌంటర్ లో వున్న supervisor ని కిషోర్ ఎక్కడ అని అడిగాడు. కిషోర్ బయటకి వెళ్లాడని చెప్పడం తో, తనకి కాఫీ పంపించమని supervisor కి చెప్పి … ఒక ఖాళీ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు .. తనకి కుడి పక్కన టేబుల్ లో ఒక ఫామిలీ వుంది .. మొగుడు పెళ్ళాం, ఇద్దరు చిన్న పిల్లలు .. పిల్లలు చూడడానికీ 7-8 సంవత్సరాలు అనుకుంట .. కానీ వాళ్ళ అల్లరి చూస్తే అలా అనిపించడం లేదు .. ఒకళ్ళని ఒకళ్ళు వెంబడించుకుంటూ .. టేబుల్ చుట్టూ తిగుతున్నారు … ఆ మొగుడు పెళ్ళాం ఏ ఏమీ పట్టనట్లు .. ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.. అఖిలేష్, తాను client meeting కి ప్రిపేర్ అవుతూ, డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటున్నాడు... ఇంతలో, ఒక అందమైన యువతి కాఫీ ట్రె పట్టుకుని తన టేబుల్ దగ్గరికి వస్తుంది… ఆమెనే ఆలా దూరం నుంచే చూస్తున్న అఖిలేష్ కి మనసులో ఆనందం మరియు ఆశ్యర్యం … అంత అందమైన అమ్మాయిని అలా చూడడం చాలా ఆనందంగా వుంది, అందులోను తాను, తన టేబుల్ దగ్గరికి వస్తుంది, అలాగే ఆశర్యం తనని ఇంతకూ ముందు ఈ షాప్ లో ఎప్పుడు చూడలేదు … బహుశా తాను కొత్తగా జాయిన్ అయ్యి ఉంటుంది అనుకున్నాడు మనసులో … ఆ అమ్మాయి కాఫీ ట్రే ని నిదానం గా టేబుల్ పైన కొంచెం దూరం లో పెట్టి …కాఫీ కప్ సాసర్ ని తనం ముందు పెట్టబోతు ముందుకు వంగింది … ఇంకా తన అందాన్ని ఆస్వాదిస్తున్నాడు అఖిలేష్ తన మనసులో … ఈ రోజుల్లో ఎలాంటి మేకప్ లేకుండా ఇంత సహజసిద్ద అందమైన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి తనకి … [ అఖిలేష్ వయసు 30 సంవత్సరాలు , ఇంకా పెళ్లి కాలేదు… తనకి తండ్రి లేడు, అమ్మ తన సొంత వూరు అయిన పల్లెటూర్లో ఉంటూ పొలాలు చూసుకుంటుంది. తనకి వరుస అయ్యే మరదళ్ల్లు ఊళ్ళో వున్నా, వాళ్ళకి వున్న పట్నం పోకడలు నచ్చకపోవడం తో, వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ప్రాక్టికల్ గా ఉండడం అఖిలేష్ మనస్తత్వం, కానీ తన తల్లి నుండి పెళ్లి చేసుకోమని ఒత్తిడి. “మనలా మనం ఉండాలి … ఇంకోకిరిని అన్వయించడం సరి కాదు” అని బలం గా నమ్మే వ్యక్తి అఖిలేష్. ] అలా ఆమెనే చూస్తున్న అఖిలేష్ కి ఒక్కసారిగా చురుక్కుమని కాలింది… కాఫీ కప్ ఒలికి .. వేడి వేడి కాఫీ తన మీద పడింది... ఒక్క క్షణం క్రితం ఏమి జరిగిందంటే … పక్క టేబుల్ లో వున్నా చిన్న పిల్లలు పరిగెడుతూ .. ఆ అమ్మాయి ని నెట్టేశారు… అదుపు తప్పి, ఆమె కాఫీ కప్పు ని టేబుల్ పైన వదిలేసింది … ఆ కాఫీ అఖిలేష్ తన client కోసం తయారు చేసుకున్న డాక్యూమెంట్స్ పైన, తన డ్రెస్ పైన పడడంతో [అదీ client visit కు వెళ్లేముందు] … అప్పటి వరకు ఎంతో ప్రశాంతం గా వున్న అఖిలేష్... ఏమి జరిగిందో తెలుసుకోకుండా, ఒక్కసారిగా what the h-ell...are you blind? you just ruined my appointment అని గట్టిగా అరిచాడు … ఆ అమ్మాయి : s0rry sir...sorry sir…అసలు ఏమి జరిగిందంటే… అఖిలేష్ : stop nonsense… కళ్ళు నెత్తిన పెట్టుకుని పని చేస్తున్నావా… do you have any idea how valuable this meeting to me? ఆ అమ్మాయి : నా తప్పు ఏమిలేదు sir...పక్క నున్న పిల్లలు… [అంటూ చెప్పబోతోంది…] పక్క టేబుల్ father : ఇదిగో అమ్మాయి...నువ్వు తప్పు చేసి మా పిల్లల పైన చెప్తావా...కాఫీ షాప్ అంటే అన్నిరకలా customers ఉంటారు… నీకు సర్వ్ చేయడం తెలియక తప్పు చేసి...మా పిల్లల పైన నెట్టకు... పక్క టేబుల్ mother : పదండి ఇక్కడి నుంచి అసలు.. ఇలాంటి place కి రావడం మనదే తప్పు… అఖిలేష్ : ఇదిగో supervisor, ఇటు రా, ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకంటే…కిషోర్ బిజినెస్ చేసినట్టే… ఇంతలో supervisor పరిగెత్తుకుంటూ వచ్చి… s0rry sir...కిషోర్ గారు, వచ్చిన వెంటనే ఈ విషయం చెప్తాము..అంతలోపు మీరు కిషోర్ గారి office లో రెడీ అవ్వండి...మీ documents ని మా స్టాఫ్ ని పంపి..మల్లి printouts తీయిస్తాము…అని చెప్పాడు.. అఖిలేష్ అక్కడి నుంచి కిషోర్ రూమ్ కి వెళ్లి ...రెడీ అయ్యాడు...ఇంతలో..తన documents ప్రింట్స్ కూడా వచ్చాయి...అవి మల్లా సరి చేసుకుని...తన client ని కలిసేటందుకు బయలుదేరాడు… 3 1 Quote Link to comment Share on other sites More sharing options...
VictoryTDP Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 Welcome back Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted May 4, 2020 Author Report Share Posted May 4, 2020 2 - పశ్చాతాపం సమయం 3:05 PM అప్పుడే కార్ పార్క్ చేసి.. హడావిడిగా పెరిగిస్తున్నాడు అఖిలేష్ రిసెప్షన్ వైపు..కొన్నిసెకండ్స్ లో చేరుకున్నాక...రిసెప్షన్ తో..(ఆయాసపడుతూ) i am akhilesh, i have appointment with Mr. Agarwal at 3.00 PM రిసెప్షనిస్ట్..టైం చూసుకుంటూ...అగర్వాల్ గారు, మీ కోసం ఎదురు చూస్తున్నారు అంది...అగర్వాల్ రూమ్ కి..దారి చూపిస్తూ.. thank you అని చెప్పి...అగర్వాల్ రూమ్ లోకి వచ్చాడు అఖిలేష్… ఎదురుగా అగర్వాల్ తన సీట్ లో కూర్చునివున్నాడు...పక్కన PA వుంది… రూమ్ లోకి, వస్తూనే...తనని తానూ పరిచయం చేసుకున్నాడు అఖిలేష్…”Hello Sir, I am Akilesh , Financial Adviser. మీతో ఈరోజు నాకు appointment దొరకటం చాలా అదృష్టం”. అగర్వాల్, ఏమి బదులివ్వకుండా, ఆలా చేయి కుర్చీ వైపు చూపించి కూర్చోఅన్నట్లు సైగ చేసాడు… [అఖిలేష్ మనసులో కొంచెం అసహనం] అగర్వాల్ ఇంకా తన PA తో మాట్లాడుతున్నాడు...అఖిలేష్ తన ముందు కూర్చుని దిక్కులు చూస్తూ wait చేస్తున్నాడు… రూమ్ అంతా imported decarative items, paintings...వాటి ఒక్కొక్కదాని విలువ లక్షలు లేదా కోట్లు కూడా ఉండొచ్చు…[తానూ కూర్చున్నకుర్చి తో సహా]...మాంచి sound party అని అనుకున్నాడు మనసులో 30 నిమిషాలు గడిచింది … “చెప్పండి అక్షరేశ్” అన్నాడు అగర్వాల్… అఖిలేష్ : sir నాపేరు అఖిలేష్… అగర్వాల్ : ఆ ఆ అదే ...చెప్పండి తొందరగా...నాకు ఎక్కువ టైం లేదు.. అఖిలేష్ : [మనసులో మరికొంత అసహనం] sir మీ new investment strategy గురించి discuss చెయ్యడానికి వచ్చాను …మీకు ఆల్రెడీ మెయిల్ చేశాను...మీకు నచ్చితే...మీ దగ్గర నుండి కొన్నిసంతకాలు... అగర్వాల్ : ఆ చూసాను...అంత బానే ఉంది...కానీ ఆ tax saving strategy కొంచెం మార్చండి...ఆ tax svaing plans లో మనీ కి ఎదుగు బొదుగూ ఉండదు… అఖిలేష్ : ok sir, కానీ మీరు tax తగ్గించుకోవాలంటే...కనీసం charity donations అన్న చేయాలి... అగర్వాల్ : ok, పర్వాలేదు..చేద్దాం అలాంటి ఉచిత దానాలు ఎన్నయినా పేపర్ పైన [నవ్వుతూ] అఖిలేష్ కి మొదట అర్థం కాలేదు...కానీ పక్క నున్నPA కూడా నవ్వుతూ ఉండడంతో విషయం బోధ పడింది. అఖిలేష్ : ok sir, ఒక్క tax saving plan తప్ప, మిగతా వాటికి మీరు ఓకే అంటే..ఈ forms పైన సంతకం చెయ్యండి అని తన దగ్గరవున్న documents ఇచ్చాడు.. అగర్వాల్ : ఆ documents తీసుకుని సంతకం పెట్టి వెనక్కి ఇస్తూ...ఇంతకు ముందు మీ company నుండి అరవింద్ అని ఒకతను వస్తుండే వాడు..మాదగ్గరికి..అతనేమయ్యాడు? అఖిలేష్ : అతన్ని మా కంపెనీ జాబ్ లోనుంచి తీసేసింది...unethical practice చేస్తున్నాడు అని...అతని place లో నన్ను అప్పోయింట్ చేసింది... అగర్వాల్ : ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు.. అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం.. documents ని తన బ్యాగ్ లో పెట్టుకుని .. “pleasure doing business with you sir” అని అయిష్టం గానే చెప్పి ...ఒక్కసారి గా పైకి లేచాడు… ఇంతలో..భళ్ళుమని శబ్దం.. [ఒక్క క్షణం క్రితం…] ఒక వృద్ధుడు...బహుశా 75+ సంవత్సరాలు, అగర్వాల్ కోసం పండ్లరసం (juice) తెస్తున్నాడు ట్రే లో… అతను ఆలా తన పక్కగా వస్తున్నప్పుడు..అఖిలేష్ ఒక్కసారిగా లేవడంతో..అఖి బుజం తగిలి..ఆవృద్ధుడి చేతిలో వున్నా ట్రే ఎగిరి పక్కనున్న couch(sofa set) పైన పడింది..ఆ couch అంతా...జ్యూస్ పడింది..ట్రే క్రింద పడి భళ్ళు మంది... అగర్వాల్ : [కోపం తో] ఏరా ...కళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా...10 లక్షలు విలువ చేసే సోఫా...2 లక్షలు విలువ చేసే ట్రే...నీ బాబు సంపాదన అనుకున్నావా.. ఆ వృద్ధుడు : క్షమించండి sir…నా తప్పు ఏమి లేదు...ఈ sir.. వెనుకా ముందు ఏమి చూసుకోకుండా గబుక్కున లేచాడు…[అఖిలేష్ వైపు చూపిస్తూ..] అగర్వాల్ : నోరుమూయి...పెద్దవాళ్ళు పనిచేస్తుంటే..నీలాంటోళ్ళు వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవాలి...పై పెచ్చు..నీ తప్పు ఏమి లేదని నువ్వే చెప్పేస్తున్నావ్… PA ..అసలు వీడిని ఎవడు పనిలో పెట్టింది…తక్షణమ్ పనిలో నుంచి తీసెయ్ … చేసిన పని కి కూడా డబ్బులు ఇవ్వదు … PA : ok sir అఖిలేష్: s0rry its my mistake అని ఏదో చెప్పబోతున్నాడు…ఇంతలో అగర్వాల్ : Mr. aksharesh , you can leave…[అఖిలేష్ ని ఇంకా అక్షరేష్ అని పిలుస్తూ] అఖిలేష్ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు … తన కార్ లో కూర్చుని...మొత్తం సంఘటన ని గుర్తు చేసుకున్నాడు.. అఖిలేష్ కి ఇదంతా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది...చేసేపనిలో తమ ప్రమేయం లేకుండా జరిగే చిన్నపొరపాట్లు..ఎంతకు దారితీస్తాయో ఆక్షణం కళ్ళకు కట్టినట్లు కనిపించాయి… కొన్ని గంటల క్రితం coffee shop లో జరిగిన ఘటన గుర్తుకు తెచ్చుకుని, తనలో తానూ అగర్వాల్ ని చూసుకున్నాడు… తనకి తెలియకుండా తాను ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళ వ్యక్తిత్వాన్నికి కాకుండా … వాళ్ళు వున్నా హోదా లేక చేసే జాబ్ బట్టి ఇస్తున్నాడు అని పశ్చాతాపడ్డాడు… తానూ అనుకోకుండా చేసిన చిన్న పొరపాటు తో .. ఒక వ్యక్తి తన ఉద్యోగం పోగొట్టుకోడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఇంతలో తనకు coffee shop లో అమ్మాయి గుర్తుకువచ్చింది .. వెంటనే mobile తీసి .. కిషోర్ కి కాల్ చేసాడు .. ఫోన్ రింగ్ అవుతుంది.. కాసేపటికి .. కిషోర్ : hello...అన్న అఖిలేష్ : hello kishore...ఈ రోజు మీ షాప్ కి వచ్చాను…అప్పుడు ఏమి జరిగిందంటే [అని చెప్పబోతుంటే ] కిషోర్ : తెలిసిందన్న… స్టాఫ్ చెప్పారు … ఆ అమ్మాయిని..పనిలోంచి తేసేసాను .. ఆ అమ్మాయికి ఇదే మొదటి రోజు .. ఆఖరి రోజు … అఖిలేష్ : no no...పనిలోనుంచి తీయకు .. అది చిన్న పొరపాటే.. కిషోర్ : లేదన్న … already పంపించేసాను .. గంట క్రితం .. అఖిలేష్ : ohh shoot...its ok...జరిగింది చిన్న పొరపాటే … ఆమె తప్పేం లేదు … మల్లి పిలిచి పనిలో పెట్టుకో .. కిషోర్ : కానీ ఆమె వివరాలు ఏమి తెలియదు అన్న … ఎక్కడ ఉంటుందో, phone no ఏంటో … కనీసం joining application కూడా నింపలేదు …నువ్వు వచ్చిన టైం లో వేరే స్టాఫ్ లేకపోవటం వల్ల ఆమెని పంపాడంట నీకు coffee serve చేయడానికి supervisor గాడు...ఎలా చేస్తుందో చూద్దామని … అఖిలేష్ : ohh...i am s0rry to her...జరిగినదాంట్లో ఆమె తప్పు లేదు..ఆమె మళ్ళీ వస్తే నాకు కాల్ చేయి … ఇంతకీ ఆమె పేరు తెలుసా.. కిషోర్ : సరే అన్న … ఆమె పేరు “అలేఖ్య” అని చెప్పింది… అంతకంటే ఎక్కువ వివారాలు తెలియవు … వుంటా అన్న bye… అఖిలేష్ : [గుండెల్లో పశ్చాతాపం తో ] ఫోన్ కట్ చేసాడు … (ఇంకా వుంది next part coming soon) 1 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 బాగుంది, కంటిన్యూ ...... 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted May 4, 2020 Author Report Share Posted May 4, 2020 LTT Quote Link to comment Share on other sites More sharing options...
Ellen Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 "ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు.. అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం.." @dasari4kntr Em antharardham? idi malli future lo cheptara? Nice story. Very engaging. Coffee and juice padipoye linking scenes cchala bagunnai. Waiting for further story Quote Link to comment Share on other sites More sharing options...
pencil Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 aa title vintene pk fans ki Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 . Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 3 minutes ago, Ellen said: "ఓహో అలాగ...అతను మంచి లోకజ్ఞానం గలవాడు...tax saving గురించి మంచి ఐడియాలు ఇచ్చేవాడు.. అఖిలేష్ కి అర్థం అయ్యింది దాని అంతరార్థం.." @dasari4kntr Em antharardham? idi malli future lo cheptara? Nice story. Very engaging. Coffee and juice padipoye linking scenes cchala bagunnai. Waiting for further story Kadu, Previous dialogue lo Paper Paina donations ennaina cheyyochu ani navvaru kada, daniki connection. Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted May 4, 2020 Author Report Share Posted May 4, 2020 2 minutes ago, pencil said: aa title vintene pk fans ki title will be apt for my story...it will do justice in future story updates... BTW...this is going to be psycho thriller... Quote Link to comment Share on other sites More sharing options...
Ellen Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 4 minutes ago, ShruteSastry said: Kadu, Previous dialogue lo Paper Paina donations ennaina cheyyochu ani navvaru kada, daniki connection. oh yea...hahah because aravind was also corrupt kada. Makes sense. thanks Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 3 hours ago, dasari4kntr said: place holder welcome back from @cosmopolitan and @nag_mama 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
pencil Posted May 4, 2020 Report Share Posted May 4, 2020 1 hour ago, dasari4kntr said: title will be apt for my story...it will do justice in future story updates... BTW...this is going to be psycho thriller... melcow byak 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted May 5, 2020 Author Report Share Posted May 5, 2020 6 hours ago, MiryalgudaMaruthiRao said: welcome back from @cosmopolitan and @nag_mama 5 hours ago, pencil said: melcow byak thanks Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.