Jump to content

Enduku andi maa vaaley ila chesthaaru


JigelReddy

Recommended Posts

08092020035014n69.png

 

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని నమ్మించి పెళ్లి
  • నిజం తెలిసి కలత చెందిన అమ్మాయి కుటుంబం
  • తండ్రి ఆత్మహత్య.. తట్టుకోలేక ఇద్దరు కూతుళ్లూ బలవన్మరణం
  •  

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 8: తాను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని చెప్పాడు. నెలకు రూ.80 వేల జీతం వస్తుందన్నాడు. మంచి సంబంధం అని నమ్మిన ఆ తండ్రి నగలు, నగదు రూపేణా రూ.20 లక్షల వరకు కట్నంగా ముట్టజెప్పి.. కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాడు. కూతురు కాపురానికి వెళ్లాక... అతడికి అసలు ఉద్యోగమే లేదని తెలిసింది. మోసపోయానని గ్రహించిన ఆమె పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు పంచాయితీలు చేస్తున్నారు. మీ కుమార్తెను కాపురానికి పంపాలంటూ అల్లుడు గొడవ చేస్తున్నాడు. ఈ గొడవలన్నీ కుటుంబ పెద్దను తీవ్రంగా కలచివేయడంతో  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణవార్త విని ఇద్దరు కూతుళ్లూ.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం జరిగిందీ ఘటన. ప్రొద్దుటూరుకు చెందిన ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి (55) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌. స్థానిక వైఎంఆర్‌ కాలనీలో భార్య, కుమార్తెలు శ్వేత (22), సాయిప్రీతి (19)లతో కలిసి నివసిస్తున్నారు. గత ఏడాది మేలో పెద్ద కుమార్తె శ్వేతకు తాళ్లమాపురానికి చెందిన రామిరెడ్డి చంద్ర ఓబులరెడ్డి కుమారుడు సురేశ్‌ కుమార్‌రెడ్డితో వివాహం జరిపించారు.

 

Advertisement
 
Powered By PLAYSTREAM
 

అతడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని చెప్పడంతో భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే సురేశ్‌ కుమార్‌రెడ్డికి అసలు ఉద్యోగమే లేదని తెలియడంతో శ్వేత పుట్టింటికి వచ్చేసింది. శ్వేతను కాపురానికి పంపాలని సురేశ్‌ ఇటీవల అత్తింటికొచ్చి గొడవపడ్డాడు. ఈ గొడవలతో మనస్తాపానికి గురైన బాబుల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి మరణవార్త విని కూతుళ్లిద్దరూ కుమిలిపోయారు. అదేరోజు రాత్రి వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి కమలాపురం రాయునిపేట వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంటి ఇల్లాలు విజయభారతీ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సురేశ్‌ కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...