r2d2 Posted October 13, 2020 Report Share Posted October 13, 2020 కరోనా మహమ్మారి సృష్టించిన అలజడితో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైనాయి. ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలను మూసివేయగా.. మరికొన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి. కరోనా ప్రభావం విమానయానంపై తీవ్రప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మధ్యనే నిబంధనల నడుమ అడపాదడపా సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సింగపూర్ ఎయిర్‌లైన్స్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. విమానాన్నే ఓ హొటల్గా మార్చేసి అక్కడికొచ్చిన వారికి భోజనం పెట్టాలని నిర్ణయించింది. నాణ్యతను బట్టి కస్టమర్ల నుంచి దాదాపు 642 సింగపూర్ డాలర్ల వరకు వసూలు చేయనుంది. విమానాన్ని ఓ ఎయిర్‌పోర్టులో పార్కు చేసి భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. దీనికోసం దాదాపు 900 మంది కూర్చునే సామర్థ్యమున్న A380s విమానాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎంచుకుంది. స్థానిక ఛాంగి విమానాశ్రయంలో పార్కు చేసి ఈ నెల 24, 25 తేదీల్లో భోజనాల కోసం టికెట్ బుకింగ్స్‌ను సోమవారం ప్రారంభించింది. వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీపడ్డారు. కేవలం అరగంటలోపే టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. దీంతో ఆశ్చర్యపోవడం నిర్వాహకుల వంతైంది. అయితే కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కేవలం సగం టికెట్లను మాత్రమే విక్రయించారు. భారీగా స్పందన వస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు దీనిని కొనసాగించాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. మరోవైపు సరదాగా విమాన ప్రయాణం చేయాలనుకున్న వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేసింది. ప్రయాణికులను ఎక్కించుకొని ఆలా కాసేపు చక్కర్లు కొట్టి తిరిగి అదే విమానాశ్రయంలో దింపేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో తన ప్రయత్నాలను విరమించుకుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 13, 2020 Report Share Posted October 13, 2020 US airlines kuda ade plan lo vunnai ani Thatha and Pelosi disco Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted October 13, 2020 Author Report Share Posted October 13, 2020 mee pichchi Thaatha already using airport hangars for MAGA rallies.. as usual without paying rent...😀 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 13, 2020 Report Share Posted October 13, 2020 1 minute ago, r2d2 said: mee pichchi Thaatha already using airport hangars for MAGA rallies.. as usual without paying rent...😀 Maa thatha mass 😎 Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted October 13, 2020 Report Share Posted October 13, 2020 1 hour ago, r2d2 said: mee pichchi Thaatha already using airport hangars for MAGA rallies.. as usual without paying rent...😀 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.