Jump to content

Adani data centers


ticket

Recommended Posts

మూడు మెగా పరిశ్రమలకు పచ్చజెండా

వాటి ద్వారా రూ.16 వేల కోట్ల పెట్టుబడులు
39 వేల మందికి ఉపాధి అవకాశం
సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ తొలి సమావేశం
విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆదేశం


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా రూ.16,314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశానికి సీఎం జగన్‌ అధ్యక్షత వహించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం ఇంటెలిజెంట్‌ సెజ్‌, అదానీ డేటా సెంటర్‌, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. పరిశ్రమలు కోరుతున్న రాయితీలు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి ఎస్‌ఐపీబీ ఇదే కావటం గమనార్హం. ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన పరిశ్రమలు..
* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్‌ (చెప్పుల తయారీ) ఏర్పాటు ద్వారా రెండుదశల్లో రూ.700 కోట్ల పెట్టుబడి వస్తుంది. సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇదే సంస్థ కడపజిల్లాలోనూ మరో సెజ్‌ ఏర్పాటుచేసి, 2వేల మందికి ఉపాధి కల్పించనుంది.
* విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రై లిమిటెడ్‌ హైవే టైర్ల తయారీ సంస్థ రూ.980 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.
* విశాఖలోని మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ బిజినెస్‌ పార్కు, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. వాటి ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. సుమారు 24,990 మందికి ఉపాధి కల్పిస్తుంది.

Link to comment
Share on other sites

Tdp time lo vachina vatiki ok cheppadam ena veedi bathuki emina own ga emina techedi unda

Arey musukoni tdp time lo start ina capital ni continue chesi unte good name anna vachindi.. 

Enni industries/ investements pogottara.. Reverse tendering annaru polavaram engesindi.. Special status annaru vongunnaru delhi lo...3 capitals annaru okka capital kuda dikku lekunda chesaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...