r2d2 Posted December 21, 2020 Report Share Posted December 21, 2020 ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రాం మరోసారి చిక్కుల్లో పడింది. ఒక బగ్ కారణంగా ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచేప్పుడు యూజర్స్ అందించే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలు బహిర్గతం అయ్యాయని సౌగత్ పోఖ్రేల్ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు తెలిపాడు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఫేస్బుక్ కొత్త ఫీచర్ ద్వారా ఈ బగ్ ఏర్పడినట్లు సమాచారం. ఇతరుల నుంచి ప్రైవేట్ మెసేజ్, డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ డిసేబుల్ చేసిన ఫేస్బుక్ బిజినెస్ ఖాతాలకు అనుసంధానమైన ఇన్స్టాగ్రాం యూజర్స్ వ్యక్తిగత సమాచారం ఈ బగ్ ద్వారా లీక్ అయినట్లు వెల్లడించారు. ఇందులో యూజర్స్ ఈ-మెయిల్ ఐడీలు, పుట్టిన తేదీలతో పాటు ఇతర వివరాలు లీక్ అయినట్లు పోఖ్రేల్ తెలిపారు. ఈ వివరాలతో సైబర నేరస్థులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ సమాచారం లీక్ అయిందో లేదో తెలుసుకునేందుకు ఫేస్బుక్ బిజినెస్ ఖాతాదారులందరు తమ ఇన్స్టాగ్రాం ద్వారా డైరెక్ట్ మెసేజ్‌లు పంపాలని సూచించారు. దాని వల్ల మీ సమాచారం లీక్ అయిందా లేదా అనేది తెలుస్తుందని వెల్లడించారు. దీనిపై ఫేస్బుక్ స్పందిస్తూ.. ఈ బగ్ కేవలం కొద్ది సేపు మాత్రమే పనిచేస్తుందని తెలిపింది. బగ్ గురించి తెలిసిన వెంటనే సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. దీని వల్ల ఎంత మంది యూజర్స్ డేటా లీక్ అయిందనేది ఫేస్బుక్ వెల్లడించలేదు. ముందుగా బగ్ గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు తమకు సహాయపడిన సౌగత్ పోఖ్రేల్కి బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద నగదు బహుమతి అందజేసినట్లు తెలిపింది. పోఖ్రేల్ ఆగస్టులో కూడా ఇదే తరహాలో ఇన్‌స్టాగ్రాంలో యూజర్స్ డిలీట్ చేసిన పోస్ట్‌లకు సంబంధించిన బగ్‌ను గుర్తించి ఫేస్‌బుక్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం తాను కనుగొన్న బగ్ గురించి సమాచారం అందించిన కొద్ది గంటల్లోనే ఫేస్బుక్ ఇంజనీర్లు సమస్యను పరిష్కరించినట్లు పోఖ్రేల్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted December 21, 2020 Report Share Posted December 21, 2020 ok Quote Link to comment Share on other sites More sharing options...
Undavalli Posted December 21, 2020 Report Share Posted December 21, 2020 emundani akka leak avvdaniki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.