Jump to content

రోటీన్ కు భిన్నమైన భంగిమలో సెక్సు చేసి చచ్చిపోయాడు


toranam

Recommended Posts

రోటీన్ కు భిన్నమైన భంగిమలో సెక్సు చేసి చచ్చిపోయాడు

Sun Jan 10 2021 08:00:01 GMT+0530 (IST)

Shocking incident in Maharashtra

మితమైన శృంగారానికి మించింది లేదు. కానీ.. మనసు ఊరుకోదుగా. రోటీన్ కు భిన్నంగా చేయాలని.. అది కూడా అప్పటివరకు చేయని కొంగొత్తగా చేయాలంటూ చేసే కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టి.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అదేమంటే..



మహరాష్ట్రకు చెందిన ఒక వ్యక్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా వారిద్దరి బంధం కొనసాగుతోంది. తాజాగా వీరిద్దరూ నాగ్ పూర్ లోని ఖాపర్ ఖేడా ప్రాంతంలోని ఒక లాడ్జికి వచ్చారు. రోజువారీ కాకుండా భిన్నమైన రీతిలో సెక్సు చేయాలని భావించారు. అందుకు తగ్గట్లు ఒక డేంజరస్ అడ్వెంచర్ సెక్సు షురూ చేశారు.

అతడ్ని మరింత ఉత్తేజితం చేయటం కోసం సదరు మహిళ.. ఆ వ్యక్తి కాళ్లను.. చేతుల్నినైలాన్ తాళ్లతో కుర్చీకి కట్టేసింది. అంతేకాదు.. మెడనుకూడా మరో తాడుతో కుర్చీకి కట్టింది. వారు అనుకున్నట్లే రతిక్రీడ ముగిసింది. ఆమె వాష్ రూంకు వెళ్లింది. అయితే.. అనుకోని రీతిలో అతడు కూర్చున్న కుర్చీ జారి కిందకు పడింది. దీంతో.. అతని మెడలోఉన్న తాడు బిగుసుకుంది. దీంతో.. ఊపిరి ఆడక మరణించాడు. వాష్ రూం నుంచి తిరిగి వచ్చేసరికి తన స్నేహితుడు మరణించిన విషయాన్ని గుర్తించిన ఆమె.. వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు.

రూమ్ సర్వీసు వారు వచ్చి.. తాళ్లను విప్పారు. అప్పటికే అతను మరణించిన విషయాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఆ మహిళను అరెస్టు చేశారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. లాడ్జ్ లో ఉన్న వ్యక్తితో తనకు అక్రమ సంబంధం ఉందని సదరు మహిళ ఒప్పుకుందని.. హోటల్ సిబ్బంది ఇచ్చిన సాక్ష్యాన్ని నమోదు చేశామని పోలీసులుచెబుతున్నారు. మహిళ సెల్ నెంబర్ నుతీసుకొని.. యాక్సిడెంటల్ డెత్ గా  కేసును రిజిస్టర్ చేశామని పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపనున్నారు. సంతోషం ముఖ్యమే.. దానికి మితం ఉండాలి. లేకుంటే.. ఇలాంటి తిప్పలు తప్పవు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...