Jump to content

ఖమ్మం నుంచే జనంలోకి షర్మిల!


Somedude

Recommended Posts

02162021023803n16.jpg

 

చివరి ఆత్మీయ సమ్మేళనం అక్కడే 

ఏప్రిల్‌ 10 లోపేసమావేశాలు పూర్తి

ఆ తర్వాత పార్టీ ప్రకటనపై కసరత్తు 

మే 14, జూలై 8లలో ఏదో ఒక రోజు!

భారీ బహిరంగ సభలో ప్రకటన! 

20న హైదరాబాద్‌, రంగారెడ్డిలో భేటీలు

 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్‌ షర్మిల ఖమ్మం నుంచే తనకున్న ప్రజాకర్షణ శక్తిని ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ అభిమానులతో ఉమ్మడి జిల్లాలవారీ ఆత్మీయ సమ్మేళనాలను లోటస్‌ పాండ్‌లోనే నిర్వహించి.. ఆఖరుగా ఖమ్మం జిల్లా సమ్మేళనాన్ని అక్కడికే వెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి భారీగా కారు ర్యాలీ, పట్టణంలో వేలాది మందితో ర్యాలీ, గిరిజనులతో ప్రత్యేక సమావేశమూ యథాతథంగా నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ నెల 21నే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టినా.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్లు షర్మిల కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 20న హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో లోటస్‌ పాండ్‌లో షర్మిల సమావేశం కానున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి  రెండు జిల్లాల్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు చె ందిన ముఖ్యమైన నేతలు రానున్నారు. ఎవరెవరిని ఆహ్వానించాలన్న దానిపై షర్మిల సన్నిహితుడు కొండా రాఘవరెడ్డి సమీక్ష చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశమైన రాఘవరెడ్డి.. దాదాపు 350 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్‌ 10 లోగానే నిర్వహించాలన్న నిర్ణయానికి షర్మిల బృందం వచ్చింది. 

 

పార్టీ ప్రకటన ఎప్పుడు? 

షర్మిల పార్టీ పేరును ఎప్పుడు ప్రకటించాలన్న విషయంపై నేతల్లో తర్జన భర్జన జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆత్మీయ సమావేశాలు పూర్తికాగానే రెండు రోజులపాటు సమీక్ష జరిపి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 14న పార్టీని ప్రకటించాలా? లేక వైఎస్‌ జయంతి సందర్భంగా చేసుకుని జూలై 8న ప్రకటించాలా? అన్నదానిపైనా సన్నిహితులతో షర్మిల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ప్రకటన, చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి క్యాలండర్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్లే అంశంపై స్పష్టత వస్తే ఒక కేలండర్‌ ప్రకారం, ఎన్నికలు 2023లోనే జరిగితే మరో క్యాలండర్‌ ప్రకారం ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. కాగా రాజన్న పాలన, సంక్షేమ పథకాలు ఉండాలని కోరుతూ వచ్చే ప్రతి ఒక్కరూ షర్మిల కొత్త పార్టీలోకి ఆహ్వానితులేనని కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఏ పార్టీ నుంచి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. సోమవారం ఆయన లోటస్‌ పాండ్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ పార్టీని నడిపిన దాఖలాలు లేవని, మొదటిసారిగా వైఎస్‌ కుమార్తె షర్మిల ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు. మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందన్నారు. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని, తెలంగాణలో వైఎస్సార్‌ బ్రాండ్‌తోనే ముందుకెళ్తామని పేర్కొన్నారు.

 

షర్మిలతో మాగం రంగారెడ్డి భేటీ

టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. సోమవారం లోట్‌సపాండ్‌లో షర్మిలతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో షర్మిల కొత్త పార్టీకి సంబంధించి తన సలహాలు, సూచనలను రంగారెడ్డి ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమానముందని, ఆయన కూతురు షర్మిల పార్టీ పెట్టడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికే లోటస్‌ పాండ్‌కు వచ్చానన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరి సొత్తూ కాదని, ఎవరైనా పార్టీలు పెట్టొచ్చని అన్నారు. 

 

 

ఖమ్మం నుంచి పోటీ చేయండి..షర్మిలను కోరిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు

 

ఖమ్మం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న షర్మిల తలపెట్టిన ఖమ్మం యాత్ర వాయిదా పడిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 100 మంది వైసీపీ నేతలు సోమవారం లోటస్‌ పాండ్‌లో షర్మిలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని షర్మిలను వారు కోరారు. అయితే తాను ఖమ్మం వచ్చి సమీక్ష నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు లక్కినేని సుధీర్‌, కొల్లు వెంకటరెడ్డి, రాంబాబురెడ్డి, వెంకట్రామిరెడ్డి, జల్లెపల్లి సైదులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Just now, MiryalgudaMaruthiRao said:

what about @kidney uncle 

y r u separating ani @Ryzen_renoir

@kidney id no evaro using ani doubt. Aa group lo vere valla ids inkokallu use chesthuntaru. AP lo Nimmagadda, food courts anukuntu post chesina original @kidney still stays with TRS anukunta. Section of that TG batch wanted support Jagga because they know thats in the best interests of TG.

Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

Good game by kcr.. idhi pedha bakra avuthadi.  Bjp ki koncham dent

BJP ki antha dent padakapovocchu. Congress would be the biggest looser. KCR ki Xian votes lo 2-3% bokka padathathi.

Link to comment
Share on other sites

Just now, Somedude said:

BJP ki antha dent kakapovocchu. Cogress would be the biggest looser. KCR ki Xian votes lo 2-3% bokka padathathi.

Congi is gone case. Ghmc elections lo telisindi gaa. Congi ki vesina last ki trs lo merge avutharu aney feeling vachindi. 

tg lo ysr ki inka koncham fan base undi.  Vallalo kondaru emey ki gudhochu

Link to comment
Share on other sites

Just now, chandrabhai7 said:

Can you explain how 

 

Christians 90% voted got kcr 

now she will get 

Lol. Xians traditional ga Cognress. AP lo adhi Jagga dhobbesadu because he is from the same religion and his family aggressively compagined through pastors and got more than 95% of xian votes. TG lo Xians Sonia ni choosi still Congress ke vestharu. And they have been Congress votebank from the ages.

  • Upvote 2
Link to comment
Share on other sites

2 minutes ago, chandrabhai7 said:

Can you explain how 

 

Christians 90% votes got kcr 

now she will get 

Tdp congi pothu valla trs ki plus ela ayindo ala

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

Congi is gone case. Ghmc elections lo telisindi gaa. Congi ki vesina last ki trs lo merge avutharu aney feeling vachindi. 

tg lo ysr ki inka koncham fan base undi.  Vallalo kondaru emey ki gudhochu

 

2 minutes ago, Vaampire said:

Tdp congi pothu valla trs ki plus ela ayindo ala

Not only that. Below middle class Sharmila party ke vestharu. AP lo nenu notice chesindhi.  Many of the below middle class think parties like BJP, TRS and TDP are a bit of elitist for them. And AP lo YSRCP Govt type schemes Sharmila kooda ivvocchu ane feeling untadhi.

Link to comment
Share on other sites

Just now, undarware_troller said:

Goosebumps to all underwear cumxxxe pulkas  as Kerosene kiti predicted. underwear xxxtian teddys ki full confusion now. 

what about langa teddies?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...