kalaa_pipaasi Posted February 27, 2021 Report Share Posted February 27, 2021 వాల్పేరు మోసగాడు look for dotted lines if you want to continue reading from your last part కార్ విస్సన్నపేట కాడ ఆగింది.పెగ తాగుతూ కార్ లో స్పీకర్ సౌండ్ పెంచాడు క్రాంతి దుమ్ము లేపారు కాసిమా దూలాడు దుంకు కాసిమా ఎరుపు దట్టి మెరుపు దట్టి వన్నెల గులాబీ దట్టి... ఎరుపు దట్టి మెరుపు దట్టి వన్నెల గులాబీ దట్టి... తలుపు తలుపు ముడుపు జుట్టి కూడుకల బెల్లంపట్టి తలుపు తలుపు ముడుపు జుట్టి కూడుకల బెల్లంపట్టి పాటకి ఓహో జంబియా అంటూ గాలిలో చేతులు ఊపుతూ కళ్ళు మూసుకొని స్టెప్స్ ఏస్తునాడు సత్తి. "అన్న మస్తుగ ఎంజాయ్ చేస్తుండుగా..రెండు పెగ్గులు పడగానే" అని సత్తిని చూస్తూ మూడో పెగ్ లోకి సోడా కలుపుతున్నాడు రవి వెనకాల సీట్ లో కూర్చున్న సత్తి ఈ పాట వింటూ..ఎదో గుర్తొచ్చినవాడిలాగా "ఔనన్నా మరి మనం వాడి ఇంటికి వెళ్లే లోపు వాడు ఎటైనా వెళ్తే" అని అడిగాడు రాజుని "వాడు వాడి ఇంట్లో ఉండటం లేదు,ఫామిలీని వొదిలేసి,ఇంకో అమ్మాయిని సెట్ చేసుకొని వేరే చోట ఉంటున్నాడు.మనం వొస్తున్నాం అని మన మీద వాడికి డౌట్ రాదు" చెప్పాడు రాజు "మనం ఇలా తాగుతూ పోతే లేట్అవుతుంది..ఇంకా చాలా దూరం పోవాలి" అన్నాడు రవి రాజుని,క్రాంతిని చూస్తూ మందు ఒక సిప్ ఏసీ "ఇంకో 120km ఇకక్డన్నుండి..నీకెందుకు నేన్నుగా..గంటన్నరలో మనం అక్కడ ఉంటాం" అన్నాడు క్రాంతి "ఎంత ఇవ్వాలన్న వాడు నీకు" అడిగాడు రవి "80 వేలు దాకా ఇవ్వాలిరా" చెప్పాడు రాజు "పైసలు తీస్కొని ఎన్ని నెలలైంది" "3 నెలలైంది" "80 వేలు,3 నెలలు..ఈ మాత్రం దానికి వాళ్ళఇంటి మీద పడి, గొడవ చేయడం అవసరమా అన్న" అడిగాడు రవి "ఎహే వాడు నా ఫోన్స్ లిఫ్ట్ చేయడంలే...సరుకు కోసం ఇచ్చిన పైసలు వాడుకున్నాడు.సరుకు రాలేదు పైసలు కూడా తిరిగి ఇవ్వడంలే దొంగనాకొడుకు.అసలు అది కాదు రవీ.. నేను అప్పటికీ వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పా..పైసలు అడ్జస్ట్ అవ్వకున్నా పర్లేదు, కనీసం నా ఫోన్స్ లిఫ్ట్ చేయి అని.వింటే గా,నా ఫోన్స్ అసలు ఎత్తడంలే.లేకుంటే వాడి అడ్రెస్స్ కనుక్కొని మరీ ఇల్లు వెతకడానికి ఎందుకు బయల్దేరుతా, నాకేమైనా దూల నా?" "ఏది వాడి నెంబర్ ఇవ్వు మళ్ళొకసారి ట్రై చేద్దాం" అన్నాడు క్రాంతి "ఇలాంటివన్నీ నేను చేసి చేసి చిరాకు దొబ్బింది.నా నెంబర్ నుండి చేస్తే లిఫ్ట్ చేయడు, వేరే నెంబర్ నుండి చేస్తే నా వాయిస్ వినగానే కాల్ కట్ చేస్తాడు" అని క్రాంతికి నెంబర్ ఇచ్చాడు రాజు క్రాంతి కాల్ చేసాడు,నెంబర్ రింగ్ అవుతుంది.సిప్ ఏసుకుంటూ,రాజు వైపు,సత్తి వైపు చూస్తున్నాడు కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా అన్నట్టు.కాల్ లిఫ్ట్ అవ్వలేదు "వాడి ఇంటి అడ్రెస్స్ తెల్సా?" అని అడిగాడు క్రాంతి "వాడు,వాడి ఫామిలీని వొదిలేసి వేరే చోట అక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉంటున్నాడు అని తెల్సింది.తణుకు వెల్పేర్ లో వీరభద్రస్వామి గుడి ఉండే రోడ్ లో వాడి ఇల్లు..అక్కడికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలుస్తది" అన్నాడు రాజు పెగ ఫినిష్ చేసి..సీట్ సర్దుకుని హాండ్బ్రేక్ తీస్తూ మందులోకి చికెన్ ముక్కలు ఉంటె బాగుణ్ణు అంటూ కార్ స్టార్ట్ చేసాడు క్రాంతి తణుకు నరేందర్ సెంటర్ ధాటి వెళ్తుండగా మధ్యలో ఒక తోపుడు బండి మీద చికెన్ వేలాడతీసి ఉండటం చూసిన క్రాంతి బండి స్లో చేసి "అన్న చికెన్ పకోడీ" అన్నాడు రాజు తోటి "హా సూపర్,చికెన్ పకోడీ తింటూ పోవొచ్చు" అన్నాడు వెనుకాల సిట్ లో ఉన్న రవి తోపుడు బండి కెళ్ళి చూసి "తాత చికెన్ పకోడీ ఎంత" అని అడిగాడు రాజు ఆ ముసలోన్ని "చేసింది లేదు..ఎంత కావాలి మీకు" అని అడిగాడు అతను "ఎంత సేపు పట్టుద్ది ఇప్పుడు చేయనీకి" "ఒక 15 నిముషాలు పట్టుది అండీ" ఇప్పటికే లేట్ ఐంది అని అలోచించి "సరే ఎన్నింటి దాకా ఉంటావు ఇక్కడ" అని అడిగాడు రాజు. "10 దాకా తెరిచే ఉంటుంది అండి" అని చెప్పాడు ముసలోడు "సరే మళ్లొస్తాం.వెల్పేర్ ఇటువైపేగా.." అడిగాడు రాజు "ఆలా ఎదరకి పోయి మావూళ్ళమ్మ గుడి దగ్గర కుడి వైపు వెళ్ళండి" అని చెప్పాడు ముసలోడు వేల్పూర్ వెళ్లేసరికి నైట్ 8:45 అయింది.జనాలు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. ఆ జనాలు ఉన్న చోటనే కార్ రోడ్ పక్కనే ఆపి నలుగురు బయటకి దిగి చుట్టూ చూసారు.కొత్త మనుషుల్లా కనపడేసరికి ఆ సెంటర్ లో ఉన్న జనాలు వీళ్ళనే చూస్తున్నారు. వాళ్ళ దగ్గరకి వెళ్లి "ఇక్కడ వీరభద్రస్వామి గుడి ఎక్కడ" అని అడిగాడు సత్తి ఆ గుంపులో ఒకడు వాళ్ళకి ఎడమవైపున పోతున్న రోడ్ చూపించి ఇలా ఎదరకి వెళ్ళండి గుడి కనిపిస్తుంది అన్నాడు.దగ్గరే కదా అని కార్ రోడ్ పక్కనే లాక్ చేసి అటువైపుగా నడుచుకుంటూ వెళ్లారు ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే అడ్రెస్స్ లో చెప్పినట్టు ఒక పాత పెంకుటిళ్ళు కనిపించింది.ఊరంతా సందడిగా ఉంది, బయట లైట్స్ ఉన్నాయ్ కానీ ఈ ఇంటి ముందు మాత్రం అంత చీకటిగా ఉంది.ఒక చిన్న జీరో బల్బ్ మాత్రం వెలుగుతుంది. ఇదేనా ఇల్లు ఔనా కదా అంటూ కన్ఫర్మేషన్ కోసం అడ్రస్ ఇచ్చినవాడికి కాల్ చేసాడు రాజు. అడ్రస్ఇచ్చిన వాడు కాల్స్ లిఫ్ట్ చేయడంలే.ఇక చేసేదేం లేక ఇల్లు లోపలకి వెళ్లి డోర్ కొట్టాడు రాజు.కొంచం సేపటికి మెల్లగా ఒక ఆడ మనిషి తలుపు తెరిచింది "ఏటిగండ్ల సురేష్ అని ఇక్కడే ఉంటాడని విన్నాం.అతను ఉన్నాడా అండి" అని అడిగాడు ఆ ఆడ మనిషిని రాజు "లేదండి ఇక్కడ ఆ పేరు మీద ఎవరు లేరు" "ఇంట్లో మీవారు లేరా అండి బయటకి పిలవండి ఒకసారి కనుక్కుంటాం" "మా వారు ఉన్నారండి..కానీ అతను నిద్రపోతున్నారు అండీ" "చాలా దూరం నుండి వొచ్చాము ఒకసారి లేపండి" సరే లేపుతానండి అంటూ లోపలికెళ్ళింది ఆ ఆడమనిషి ఈలోగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు బయటకొచ్చి వీళ్ళనే చూడటం మొదలుపెట్టారు. కొంచం సేపటికి బయటకి వొచ్చి లేవడం లేదండి మాఅయన అన్నది ఇంతలో క్రాంతి "అన్న రాజన్న నువ్వే లోపలికి వెళ్లి ఒకసారి చూసి రా అన్న" అని అన్నాడు రాజు క్రాంతి వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్ళడానికి కొంచం మొహమాటపడ్డాడు. "ఏం కాదులే అన్న వెళ్ళు" అన్నాడు క్రాంతి. చెప్పులు బయట విడిచి లోపల అతను పడుకున్న చోటకి వెళ్ళాడు.అతని బెడ్ దగ్గర లైటింగ్ లేకపోవడంతో,అతని మొహంలో మొహం పెట్టి చూసాక కానీ అర్థమవల్లేదు ఇతను వేరు అతను వేరు అని ఇంతలోనే ఆ నిద్రపోతున్న వ్యక్తి లేచాడు ఇంట్లో అలికిడికి ఇతను కాదు అంటూ రాజు బయటకి వొచ్చేసాడు ఆ నిద్రపోతున్న వ్యక్తి లేచి "ఏంటి ఎవరు మీరంతా..ఇలా లోపలికి వొచ్చేసారు ఏంటి" అని గట్టిగ అరిచాడు ఇంతలో "సారీ అన్న వేరే ఒకతని కోసం చూస్తున్నాం.చాలా దూరం నుండి వొచ్చాము.ఇదే ఇల్లు అని చెబితేను ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నాం" అన్నాడు సత్తి "అయితే మాత్రం ఇలా బెడ్రూమ్స్ లోకి వోచేస్తారా" అని అడిగాడు అతను "లేదు మీ ఆవిడా గారి పర్మిషన్ తీసుకొనే లోపలికి వొచ్చా" అన్నాడు రాజు చెప్పింది విన్నాక ఆ మనిషి కొంచం శాంతించాడు."ఎవరతను" అని అడిగాడు "ఏటిగండ్ల సురేష్ అని మాతో బిజినెస్ చేస్తూ పైసలు తీస్కొని ఇపుడు ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నాడు రాజు "అతని ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర అడిగాడు" అతను "ఫొటో ఎం లేదు" అన్నాడు రాజు అరేయ్ మీకు తెలివుందా లేదా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి "ఎంత ఇవ్వాలి" అని అడిగాడు అతను "80 వేలు" "మీది ఏ వూరు" "మాది ఖమ్మం" కొంచం అలోచించి చెప్పాలా వొద్దా అన్నట్టు మొహం పెట్టి "హా ఆ సురేష్ అనే అతను నాకు కూడా తెల్సు"అన్నాడు ఆ మనిషి "ఎలా తెల్సు మీకు" "ఎం చెబుతాం లెండి చెప్పుకుంటే సిగ్గు చేటు" "అతను మీకు బంధువులా..అతను మీకు ఏమౌతాడు" "మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అతను..ఇలానే మోసం చేస్తూ తిరుగుతుంటాడు" అని అన్నాడు కొంచం తల దించుకొని. "ఇపుడు ఇక్కడ ఉండటం లేదు..నేను కాల్ చేసిన లిఫ్ట్ చేయడు..మీ దగ్గర ఏ నెంబర్ ఉంది" అని అడిగాడు. క్రాంతి ముందుకొచ్చి ఈ నెంబర్ కి డయల్ చేయండి అని అతనికి నెంబర్ ఇచ్చాడు క్రాంతి ఇచ్చిన నెంబర్ కి డయల్ చేసాడు..నా దగ్గర కూడా ఇదే ఉంది అంటూ చూసారా..నా నెంబర్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని సెల్ చూపించాడు "మీ చుట్టాలే అంటున్నారు కదా..అతనిది వేరే నెంబర్ లేదా మీ దగ్గర" "ఆహా లేదండి" అని చెప్పాడు అతను క్రాంతి మళ్ళి ఒకసారి ట్రై చేసాడు అదే నెంబర్ కి.ఈ సారి ఫోన్ స్విచ్ఒఫ్ఫ్ వొచ్చింది. ఇంతలో కొంత మంది ఒక 10 - 11 జర్నీ బాగ్స్ తోటి అటుగా వొచ్చి "మీకు బాగ్స్ అందాయా" అని అడిగారు ఇంట్లోవాళ్ళని "మాకు ఎవరు ఇవ్వలేదండి" అని అన్నాడు ఆ వ్యక్తి "ఇంద తీస్కోండి" అని ఒక బాగ్ ఇచ్చి వెళ్లిపోయారు ఆ జనాలు "ఇపుడు ఎక్కడ ఉంటున్నాడో తెల్సా.." అడిగాడు క్రాంతి "ఇపుడు ఎక్కడ అంటే మీరు వొచ్చిన రోడ్ లోనే బ్రిడ్జి ఉంది కదా,అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకో గుడి ఉంటదండి.అక్కడ కెళ్ళి అడగండి." చేసేది లేక అతని నెంబర్ తీస్కుని..మీకు ఏమైనా తెల్సితే మాకు ఒకసారి కాల్ చేయండి అని అక్కడ నుండి బయల్దేరి వొచ్చేసారు. కార్ ఉన్న చోటుకి తిరిగి రాగానే ఇందాక ఉన్న గుంపు ఇంకా ఉంది.జనాలు ఎక్కువయ్యేసరికి అది గమనించిన ఒక పోలీస్ లాటి కర్ర ఊపుకుంటూ ఈ గుంపు వైపుగా నడవసాగాడు "ఏంటి ఇంత మంది బయట తిరుగుతున్నారు"ఊర్లలో తొందరగా పడుకుంటారుగా జనాలు" అడిగాడు సత్తి "కాదండీ,రేపు పొద్దునే మా వూర్లో పంచాయితీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా.. అందుకే ఈ హడావిడి" అన్నాడు ఆ గుంపు లోనుండి ఒక కుర్రోడు "ఓహ్ అందుకేనా ఇందాక ఇంటింటికీ తిరిగి బ్యాగ్లు పంచుతున్నారు" అన్నాడు రవి గుంపు లో జనాలు నవ్వుకున్నారు అటుగా వొచ్చిన పోలీస్ సైలెంట్ గా వెళ్ళిపోయాడు, వీళ్ళు గొడవ చేసే మొహాలు కాదులే అనుకున్నాడేమో "ఇక్కడ ఏటిగండ్ల సురేష్ అని ఒకతను ఉంటాడంట.. తెల్సా మీకు ఆ గుడి దెగ్గరలోనే వాళ్ళ ఇల్లు అంట" అడిగాడు సత్తి ఎవరతను అన్నట్లు చూసారు ఆ గుంపు లోని జనాలు "అతను కొబ్బరికాయల వ్యాపారం చేస్తాడు.ఇక్కడ ఈ గుడి పక్కనే ఉంటాడని విన్నాం" అని ఇంకొంచం చెప్పాడు అతని గురించి సత్తి "ఇక్కడ అలాంటివాడు ఎవరు లేరు" అన్నాడు ఆ గుంపులో ఒక పెద్దాయన "మీరు ఎక్కడ నుండి వొచ్చారు" అని అడిగాడు "మేము చాల దూరం నుండి వొచ్చాము..మాకు పైసలు ఇవ్వాలి అతను.ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా తిరుగుతుండు.ఒకసారి కలుద్దాం అని వొచ్చాము" అన్నాడు రాజు ఆ పెద్హాయనకెళ్లి చూస్తూ ఇంతలో ఆ పెద్దాయన "ఏంటి అతను మిమ్మల్ని మోసం చేసాడా" అంటూ ఆ గుంపులో ఒక కుర్రోడి వైపు తిరిగి "అదేరా ఆ స్కూల్ కాడ మీ ఫ్రెండ్ శేషు ఉన్నాడుగా..వాళ్ళ బాబాయ్ వాళ్ళ మొదటి అబ్బాయి అతను.కొబ్బరి కాయల వ్యాపారం చేస్తుంటాడు" అని చెప్పాడు. "వాళ్ళది పెంకుటిల్లు ఆ గుడి దగ్గర ఉంటది.అందులో ఒక పోర్షన్ వాడిదే..అద్దెకిచ్చాడు..ఇంకో పోర్షన్లో అతని సొంత తమ్ముడు ఉంటాడు." అన్నాడు "ఒహ్హ్ అయితే ఇందాక మనం మాట్లాడింది అతని సొంత తమ్ముడితోనా" అన్నాడు రవి రాజుని,సత్తిని చూస్తూ "అవునండి అతను సొంత తమ్ముడే అవుతాడు ఆయనకీ" అని చెప్పాడు ఆ పెద్దాయన "అతను మాతోటి ఆలా చెప్పలేదు" అన్నాడు రవి ''ఆ వాళ్ళు చెప్పుకోడం లేదు గని అతను మీరు వెతికే అబ్బాయికి సొంత తమ్ముడే అవుతాడు" అన్నాడు పెద్దాయన "ఇదివరికి ఆ గుడి కాడ ఉండేవాడు..అప్పట్లో అక్కడ పూలు అమ్మే మా చుట్టపు అమ్మాయిని వలేసి,లేవతీసుకొనిపోయాడు.కానీ బయట అందరితోమాత్రం ఆ అమ్మాయి తనకి చెల్లి అవుద్ది అని చెప్పుకు తిరుగుతున్నాడు" అన్నాడు ఆ పెద్దాయన "మీరు అటు బ్రిడ్జి వైపు వెళ్ళేటపుడు కుడివైపు బాబా గుడి పక్కనే ఒక బడి ఉంటది.అక్కడ వెళ్లి అడగండి..ఇపుడు అక్కడే ఉంటున్నాడు" అన్నాడు అంతలోనే "ఒరేయ్ మీ ఫ్రెండు ఒకడు అక్కడే కదా ఉండేది ఒకసారి కాల్ చేసి ఇపుడు అక్కడే ఉంటున్నాడో లేడో కనుక్కో" అని పురమాయించాడు ఆ పెద్దయన ఆ గుంపులో ఉన్న ఒక కుర్రోడిని. ఆ కుర్రోడు కాల్ చేసిన కొంచం సేపటికి అటు నుండి కాల్ వొచింది.వాళ్ళు అక్కడ ఉండటం లేదు, ఇల్లు మారారంట అని చెప్పాడు ఆ కుర్రోడి ఇక చేసేదేమి లేక "సరే మీకు అతని గురించి ఏమైనా తెలిస్తే మాకు కాల్ చేయండి" అని ఆ గుంపులో ఆ కుర్రోడికి నెంబర్ ఇచ్చి అక్కడి నుండి బయల్దేరారు. వెళ్తుండగా మార్గం మధ్యలో "ఏం చేద్దాం అన్న ఇప్పుడు" అడిగాడు క్రాంతి.ఒకవైపు ఆకలి దంచుతుంది అందరికి. "ఆ బడి దగ్గరికి వెళ్లి, ఒకసారి మనం ఎంక్వయిరీ చేసుకుందాం" అన్నాడు రాజు "ముందు ఏదో ఒకటి తిందాం" అన్నాడు సత్తి ఇంతలో రాజు సెల్ కి కాల్ వొచ్చింది "హలో అన్న..నేను...ఇందాక మీరు మాట్లాడారు కదా వేల్పూర్లో" "హా తమ్ముడు చెప్పు" అన్నాడు రాజు "అన్న అతను ఇప్పుడు ఉంటున్న అడ్రెస్స్ దొరికింది" క్రాంతి అలెర్ట్ అయ్యి బండి స్లో చేసి పక్కకి పెట్టాడు "అన్న ఇప్పుడతను కూరగాయల మార్కెట్ వెనకాల సందులో ఉంటున్నాడు" "ఆ కూరగాయల మార్కెట్ ఎక్కడ తమ్ముడు" "అన్న ఇందాక మీరు వొచ్చిన బ్రిడ్జి దాటినాక రెండో లెఫ్ట్ తీసుకుంటే బ్యాంకు వస్తుంది.బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్దు..దాని వెనకాల సందులో లాస్ట్ ఇల్లు డెడ్ ఎండ్" "తమ్ముడు,నువ్వు సూపర్, థాంక్ యు వెరీ మచ్, అక్కడికి వెళ్లి కాల్ చేస్తా" "హా సరే అన్న అక్కడికి వెళ్ళాక ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటె కాల్ చేయండి" "సరే తమ్ముడు థాంక్యూ సో మచ్" అని రాజు ఫోన్ పెట్టేసాడు కార్ లో అందరికి ఒక ఉత్సాహం వొచ్చింది.వెతకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్టు అడ్రెస్స్ దొరికింది. "అదేంటి, అక్కడ ఉన్నంత సేపు వాళ్ళు ఏమి చెప్పలేదు ఆలా బయటకి రాగానే కాల్ చేసి మరీ చెప్పారు" అడిగాడు రవి "ఏమో,అతనికి బయపడి ఉంటారు..ఎంతయినా సొంత ఊరోడేగా" అన్నాడు క్రాంతి "ఆలా నలుగురిలో ఉన్నపుడు అంత తేలికగా ఎవరు బయటపడరు" అన్నాడు రవి. "ఆ నా కొడుకు దాదాపు దొరికిండుపో ఇక" అన్నాడు రాజు. "హా వాడు కనపడితే ఇవ్వాళా వాడికి ఉంటది" అంటూ కార్ ముందుకు పోనిచ్చాడు క్రాంతి ------------------------------------------------------------------------------------------------------- బ్రిడ్జి దాటగానే రెండో లెఫ్ట్, ఆ తర్వాత బ్యాంకు అంటూ కార్ ని మెల్లగా పొనిస్తున్నాడు.."బ్యాంకు కనపడింది ఒకే", అంటూ దీర్ఘం తీసాడు క్రాంతి ఇంటి కోసం వెతుకుతూ "హా ఆ బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్" అన్నాడు రాజు.బ్యాంకు దాటినాక కొంచం దూరంలో కూరగాయల మార్కెట్ కనిపించింది. "ఇప్పుడు దీని వెనకాల సందు" అన్నాడు రాజు. పోతుండగా ఒక చిన్న సందు కనిపించింది."ఇదేనా అన్న" అడిగాడు క్రాంతి సందు ముందు బండి ఆపి "హా ఈ సందులోనే చివరి ఇల్లు" అన్నాడు రాజు కార్ లోపలకి పోవడం కష్టం.సందు ముందు కార్ పార్క్ చేసి నలుగురు కార్ దిగారు.నడుచుకుంటూ సందు చివరిదాకా వెళ్లారు. "ఇదిగో అన్న ఇదే ఇల్లు" అన్నాడు క్రాంతి ఇంటి ముందు లైటింగ్ ఏమి లేదు.ఒకసారి అటు ఇటు చూసి ఇక్క తప్పదు అన్నట్టు "ఏమండి.."అని గట్టిగపిలిచాడు రాజు,ఇంటి ఎదురుగా నిలబడి.సెల్ చూసుకున్నాడు..నైట్, టైం 10:30 అవుతుంది ఇంట్లో నుండి ఏ సప్పిడి లేదు "ఎవరైనా ఉన్నారా.." అని క్రాంతి పిలిచాడు గేట్ దగ్గరగా వొచ్చి నిల్చుని ఎవరు రాకపోవడంతో ఒక వైపు నుండి గేట్ తెరుద్దామని సత్తి లోపలి చేయిపెట్టి బేలం తీయబోయాడు.గేట్కి లోపల నుండి వేసిన లాక్ సత్తి చేతికి తగిలింది. "గేట్కి తాళం వేసుకున్నారు అన్న లోపల నుండి" అన్నాడు సత్తి "గేట్ దూకి పోవడం వేస్ట్ వాళ్ళు డోర్ తెరవకుండా" అన్నాడు రాజు "ఏమండీ ఎవరైనా ఉన్నారా" అని పిలిచాడు రవి ఈ సారి ఇంకాస్త గట్టిగ ఆ పిలుపుకి లోపల వాళ్లేమో కానీ చుట్టూ పక్కల వాళ్ళు మాత్రం వొచ్చి చూడటం మొదలుపెట్టారు.అయినా ఇంట్లో జనాల నుండి ఏ సప్పిడి లేదు.చుట్టూ జనాలు వొచ్చేసరికి రాజు,సత్తి కొంచం సేపు తగ్గి సైలెంట్ గా ఉన్నారు. సడన్గా ఇంటి బయట లైట్ వెలిగింది. ఇంటి ముందు ఏసీ సెటప్, టూ- వీలర్ బండి కనిపించాయి.ఒక తీగ మీద షర్ట్, ప్యాంటు, ప్యాంటు బెల్ట్ వేసి ఉన్నాయ్. కొంచం సేపటికి డోర్స్ ఓపెన్ అయ్యాయి.ఇంట్లో నుండి ఒక ఆడ మనిషి బయటకొచ్చింది ఏం కావాలి మీకు అన్నట్లు మొహం పెట్టి "ఏటిగండ్ల సురేష్ ఉండేది ఇక్కడేనా" అడిగాడు రాజు ఔను అన్నట్టు తలూపింది ఆ ఆడ మనిషి "మీ పేరేంటి" అడిగాడు క్రాంతి "నా పేరు ఉష ఆండీ" అని చెప్పింది "మీ వారు లేరా మేడం" అన్నాడు రాజు "లేరు విజయవాడ వెళ్లారు" "ఎప్పుడొస్తారు.." "ఏమో తెలీదు ఆండీ" "అన్నా తీగ మీద వేసిన షర్ట్ ప్యాంటు,ప్యాంటు బెల్ట్ చూస్తుంటే అవి ఇపుడే తీగ మీద పెట్టినట్టు ఉన్నాయి..అవి ఉతికి ఎండేసినవి కావు" అని క్రాంతి దగ్గర మెల్లగా చెప్పాడు రవి "ఔనుగా లోపల్నే ఉన్నాడంటావా వాడు" అన్నాడు క్రాంతి "ఔనన్నా వాడు లోపలే ఉన్నాడు" అన్నాడు సత్తి. "వీళ్ళు కావాలని నాటకాలు ఆడుతున్నారు" అన్నాడు రాజు "ఏంటండీ మీ అయన పైసలు తీసుకుంటాడు ఫోన్స్ లిఫ్ట్ చేయదు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పోతాడు.పైసలు ఇచ్చిన వాళ్ళు పిచ్చి నాకొడుకులు అనుకుంటున్నారా" అన్నాడు రాజు "ఏంటి అయనకి పైసలు ఇచ్చారా..ఎంత" అడిగింది ఉష "80 వేలు" "మీ ఆయనకి కాల్ చేయండి అసలు..మేము కాల్ చేస్తుంటే ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నాడు క్రాంతి చేసేది లేక ఆమె వాళ్ళాయనకి కాల్ చేసింది. "స్పీకర్ ఆన్ చేయండి ఫోన్ ది" అన్నాడు రాజు ఫోన్ సౌండ్ వినిపిస్తుంది అందరికి.ఫోన్ స్విచ్ఆఫ్ అని వొచ్చింది. "ఫోన్ స్విచ్ఒఫ్ఫ్ అంటుంది" అన్నది ఉష "ఇలా చేస్తే ఎలాగండి?మంది నుండి డబ్బులు దొబ్బటం జల్సా లు చేయడం ఫోన్స్ ఎత్తకపోవడం..అన్నమే తింటుండా లేక ఇంకేమన్నా నా" అన్నాడు క్రాంతి "నాకు తెలీదండి పైసలు తీసుకున్నారు అని" అన్నది ఉష "ఆ రోజు గూగుల్ పే చేస్తే పైసలు వొచ్చాయి అని కన్ఫర్మేషన్ చేసింది మీరేగా అన్నాడు" రాజు "కావాలంటే గూగుల్ పే రిసిప్ట్ చూపిస్త" అని పే చేసిన అమౌంట్ తాలూకా బిల్ చూపించాడు రాజు "ఇది మీ నెంబర్ ఏనా" అని అడిగాడు రాజు "అవునండి అది నా నెంబర్ ఏ" అన్నది ఉష "అదే అంటున్న మీరు నాతో మాట్లాడారు ఆ రోజు.పైసలు వొచ్చాయని కూడా చెప్పారు ఫోన్ లో" అన్నాడు రాజు ఉషకి ఎం చేయాలో తోచలేదు "వేరే నెంబర్ ఏమైనా ఉందా" మీ ఆయనది అడిగాడు సత్తి వేరే నెంబర్ అని అలోచించి ఇదిగోండి అని ఒక నెంబర్ ఇచ్చింది ఉష క్రాంతి కి ఆ నెంబర్ కి క్రాంతి కాల్ చేసాడు.వాళ్ళ ఇంట్లో నుండి రింగ్టోన్ వినిపించింది అందరికి రాజు కి పిచ్చి రేగింది "నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు, అదుగో ఇంట్లో నుండే వినిపిస్తుంది సౌండ్" అని ఇంట్లో మ్రోగుతున్న సెల్ ఫోన్ చూపించాడు రాజు "లేదండి ఈ ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయాడు" అని అన్నది ఉష "ఏంటి కథలబడుతున్నారు ఇద్దరు" అని క్రాంతి ఒంటి కాలు మీద లేచాడు "డబ్బులు తీసుకునేటపుడు తీలేదా..ఇపుడేమో ఇంట్లో లేడు అంటారు,ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు..ఫోన్స్ లిఫ్ట్ చేయరు..బలిసి వొచ్చినామా మేము ఇంత దూరం.నానా సంకలు నాకి అంత దూరం నుండి ఒక కానిస్టేబుల్ని తీస్కొని మరీ వొచ్చినం" అన్నాడు క్రాంతి "వొచ్చి చూస్కోండి ఇంట్లో ఉన్నాడో లేడో" అన్నది ఉష పౌరుషంగా "ఇది కరెక్ట్ కాదండి పైసలు తీసుకునపుడు, తిరిగి ఇయ్యాల వొద్దా? ఫోన్స్ అయినా లిఫ్ట్ చేయాలి కనీసం.ఇపుడు మీ ఒకళ్ళ కోసం అంత దూరం నుండి రావాల్సి వొచ్చింది..మా పనులన్నీ ఆపుకొని" అన్నాడు క్రాంతి "అసలు ఇదంతా కాదు..సతీష్ గారు, మీరు ఒకసారి లోపలికి వెళ్లి చూడండి..ఉన్నాడో లేడో" అన్నాడు క్రాంతి సత్తి తోటి "మా కానిస్టేబుల్ గారు లోపలికి వొచ్చి చూస్తారు ఒకసారి గేట్ తీయండి" అన్నాడు రాజు "లోపలికి ఎలా వొస్తారండి,ఇంట్లో మగాళ్లు ఎవరు లేనప్పుడు,నైట్ 10 దాటింది" అడిగింది ఉష కోపంగానే రాజు కెళ్ళి చూస్తూ "నేను ఒప్పుకోను, మా ఇంట్లో ఎవరు లేరు వెళ్లి రేపొద్దున రండి" "అన్న ఇలా కాదులే గాని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి లేడీ కానిస్టేబుల్ తీసుకొద్దాం పద" అన్నాడు సత్తి "నేను మా వారితో మాట్లాడి ఎదయింది చెబుతాను మీకు..కానీ మీరు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళండి" అన్నది ఉష "మేము ఎక్కడికీ వెళ్ళేది లేదు..ఇవ్వాళ నైట్ అంత ఇక్కడే ఉంటాం.రేపొద్దున మీ ఆయన్ని కలిసేదాకా ఇక్కడే.ఇక్కడే తింటాం ఇక్కడే పడుకుంటాం" అన్నాడు రాజు "మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు అండీ" "మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించిందీ మీరే, మమ్మల్ని ఇలా నడిరోడ్డు మీద నిలబెట్టిందీ మీరే" "నేను మా అయన తో మాట్లాడ్తా అండీ.దయచేసి వెళ్లిపోండి.గొడవచేయకండి" అని ఉష లోపలికి వెళ్లి తలుపేసుకుంది ఆమె లోపలికి వెళ్లడంతో అక్కడే కొంచం సేపు ఉండి మళ్ళీ వొస్తాదేమో అని చూసారు. ఆమె తిరిగి రాకపోవడంతో అక్కడి నుండి కార్ దగ్గరికి వొచ్చారు అంత ఆలా బయటకి రాగానే ఇటు సైడ్ ఇంటి పక్కవాళ్ళు వీళ్ళనే చూస్తున్నారు కొంచం అటు ఇటు చూసాడు సత్తి సరేలే అని మెల్లగా వాళ్ళ ఇంటి దగ్గర కెళ్ళి "ఈ ఇంట్లో ఉండే సురేష్ ని మీరు ఇవ్వాళ చూసారా" అని అడిగాడు "హ చూసాం అండీ ఇవాళ పొద్దున కనపడ్డాడు" అన్నారు ఆ పక్కింటి వాళ్ళు "మా దగ్గర నుండి పైసలు తీస్కొని ఫోన్స్ లిఫ్ట్ చేయడం మానేసాడు..మేము ఎక్కడినుండో వెతుక్కుంటూ వొచ్చాము ఇతని కోసం" అని చెబుతున్నాడు సత్తి వాళ్ళతోటి రాజు, క్రాంతి కార్ లో వెళ్లి కూర్చొని మందు బాటిల్ బయటకి తీసి తాగడం మొదలుపెట్టారు క్రాంతి, రాజు తాగుతుండగా రాజు ఫోన్ మోగింది "రాజు గారు నమస్తే అండీ నేను సురేష్ ని" అన్నాడు అవతల వ్యక్తి "చెప్పండి సురేష్ గారు" అన్నాడు రాజు "రాజు గారు మీ డబ్బులు నేను 3 రోజుల్లో ఇస్తా అండీ" "అదంతా కుదరదు అండీ నాకు ఇప్పుడే కావాలి" "ఇప్పటికి ఇప్పుడు ఎలా ఇవ్వగలను సర్ మీ డబ్బులు..నాకు కొంచం టైం ఇవ్వండి ఇంకో 3 రోజుల్లో ఇచ్చేస్తా" "ఇన్ని రోజులనుండి ఏం చేసారండి మీరు..మీరు నా దగ్గర పైసలు తీస్కుని 3 నెలలు దాటింది" "రాజు గారు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదండి వాటి కోసమే తిరుగుతున్నా" "అది కాదంది నేను మీకు ముందే చెప్పిన నా ఫోన్స్ లిఫ్ట్ చేయడం ఆపొద్దని, ఐన సరే స్విచ్ఒఫ్ఫ్ చేసుకొని తిరిగారు..ఏంటి మీ ఉదేశ్యం తప్పించుకుని తిరుగుదామనా? "రాజు గారు, నాకు రావాల్సిన పైసలు ఆగిపోయినై సర్ నన్నేం చేయమంటారు" "అవన్నీ కాదండి నాకు ఇప్పుడు పైసలు కావలి" "సర్ ఆ పైసల కోసమే విజయవాడ వొచ్చాను సర్" "సరే విజయవాడలో ఎక్కడ ఉన్నారో చెప్పండి మేం వస్తాం మీ దగ్గరకి" "సర్ ఇక్కడ నుండి మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళాలి సర్ మీకు ఎందుకు శ్రమ" "ఇపుడు మాత్రం ఏం సుఖపడుతున్నాను సర్..మీ కోసం ఊరూరూ తిరగడం లేదా,అవన్నీ నాకెందుకు సర్ నా అకౌంట్ కి ఫోన్ పే చేయండి ఇక నేను మిమ్మల్ని టచ్ చేయను" అన్నాడు రాజు వాయిస్ పెంచి "సర్ మీరు నన్ను ఇంకా ఇలా గట్టిగ అడిగితే మీ పేరు రాసి చచ్చిపోత" "నేను కూడా, నా బాకీ ఎగ్గొట్టారని మీ పేరు రాసి సచ్చిపోతా ఇక్కడే" క్రాంతి, రవి వీళ్ళ మాటలు వింటూ మెల్లగా ఉష ఉంటున్న ఇంటి దగ్గరకి వెళ్లారు.సురేష్ ఇంట్లోనే ఉండి మాట్లాడుతున్నాడా అని తెల్సుకుందామని ఉష ఇంటిదగ్గర అంతా సైలెంట్గా ఉంది..రాత్రి అవ్వడం వల్ల ఏ సౌండ్ లేదు.ఉష ఇంట్లో లైట్స్ అన్ని బంద్ అయ్యే ఉన్నాయ్.ఆ ఇద్దరు కొంచం సేపు చెవులు రక్కించి మరీ విన్నారు.చిన్న సప్పిడి కూడా లేదు.సురేష్ ఇంట్లో లేడేమో,నిజంగానే విజయవాడ వేళ్ళాడేమో అనిపించింది ఇద్దరికీ క్రాంతి,రవి తిరిగి కార్ వద్దకు రాగానే రాజు మందు తాగుతూ కనిపించాడు. "ఏంటన్న అయిపోయిందా కాల్" అని అడిగాడు క్రాంతి "లేదు ఆ దరిద్రుడు కాల్ కట్ చేసాడు" అన్నాడు రాజు నవ్వుకుంటూ "ఈ దెబ్బ వాడికి మాములుగా తగల్లేదట్టుంది గా..వాడు అసలు ఎక్సపెక్ట్ చేసి ఉండదు మనం వాడి ఇంటి దాకా వస్తాం అని" అన్నాడు రవి "హ వాడు కలలో కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండడు, మనం వాడి ఇంటికొచ్చి గొడవ చేస్తామని" అన్నాడు రాజు సిప్ వేస్తూ. రాజు ఫోన్ మళ్ళీ మ్రోగింది.సురేష్ భార్య ఉష కాల్ చేసింది రాజుకి "రాజు గారు ప్లీజ్ సర్ మీ డబ్బులకి బాధ్యత నాది.. మీ మనీ రిటర్న్ ఇచ్చేస్తాం ఒక్క మూడురోజుల్లో, మీరు వెళ్ళండి ప్లీజ్ మీ మనీ ఎక్కడికి పోవు" "లేదు మేడం నాకు ఇప్పుడే నా పైసలు కావాలి,ఇచ్చేయండి వెళ్ళిపోతా..ఒక సెకండ్ కూడా ఉండను" "రాజు గారు నన్ను నమ్మండి.మీ డబ్బులు ఎట్టి పరిస్థితిలోను ఇంకో మూడు రోజుల్లో ఇస్తాను" "ఎలా నమ్మమంటారండీ ఇదిగో ఇంకో పది నిమిషాల్లో మీకు జి-పే చేస్తున్న అన్నాడు సురేష్ ఆ రోజు.ఏమై పోయాయండీ ఆ పైసలు" "సర్ ప్లీజ్ నన్ను నమ్మండి ఈ ఒక్కసారికి" "లేదండి మీరు పైసలు ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఇక్కడ నుండి" అన్నాడు రాజు.సడన్ గా కాల్ కట్ అయ్యింది "దేనెమ్మ కాల్ కట్ చేసింది" అని రాజు తిట్టుకుంటున్నాడు ఉష ని ఈ సారి రాజు, క్రాంతి ఉష ఇంటి దగ్గరకి వెళ్లి చూసారు..ఏమైనా అలికిడి ఉందా వాళ్ళింట్లో అన్నట్లు.కానీ ఇల్లంతా చీకటి.ఏ శబ్దం లేదు.కొంచం సేపు చూసి కార్ దగ్గరికి వొచ్చేసారు సత్తి "అన్నా ఆకలి అవుతుంది పోమ్ పా ఏదైనా తిని మళ్ళీ వొద్దాం" అన్నాడు రాజు మళ్ళీ కార్ లోకి వొచ్చి మందు బాటిల్ చూసాడు.8pm ఫుల్ బాటిల్ ఇంకొంచం మిగిలి ఉంది "సరే క్రాంతి బండి తీయి పోయి తిందాం" అన్నాడు రాజు నైట్ 12 :30 ఐంది. ఈ టైం లో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా అని వెతుక్కుంటూ బయల్దేరారు కార్ లో.ఒకచోట జనాలు గుంపుగా ఉన్నారు. "హ అదిగో హోటల్" అంటూ అటువైపు గా పోనిచ్చాడు క్రాంతి కానీ అక్కడ జనాలు చూస్తే చాల మంది ఉండేసరికి అక్కడ నుండి బయటకి పోనిచ్చాడు క్రాంతి.హోటల్ ఎక్కడ దొరుకుద్ధా అంటూ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసారు ఒక స్కూటీ రయ్యిమని వెళ్ళిపోయింది వీళ్ళని దాటుకుని.కార్ లైటింగ్ లో కనిపించింది,స్కూటీ నడిపేది అమ్మాయి అని నడుము దాకా మల్లెపూలు,చీర,దిట్టంగా మేకప్ సత్తికి, రాజుకి ఎక్కడ లేని ఊపు వొచ్చింది స్కూటీ పాపాని చూడగానే ఆలా వెళ్తున్న ఆ స్కూటీ పాపాని ఒక ఆటో వాడు కెలుకుతున్నాడు.ఆ ఆటో డ్రైవర్, ఆ స్కూటీ పాపా చాల సేపు అలా మాట్లాడుతూపోతున్నారు సమాంతరంగా "క్రాంతి బండిని ముందుకు పోనివ్వు మనం ఆ పాపనే అడుగుదాం టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో,దానికి కచ్చితంగా తెలుస్తది" అన్నాడు రాజు క్రాంతి కార్ స్పీడ్ పెంచి ఆ స్కూటీ కి పక్కనుండి పోనిచ్చాడు రాజు విండో దించి "ఏమండి ఈ టైం లో టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి" అని అడిగాడు "ఆలా ఎదరకి వెళ్తే వై జంక్షన్ వొస్తుంది అక్కడ ఉంటాయి చూడండి" అన్నది ఆ అమ్మాయి "రేట్ ఎంత" అడిగాడు సత్తి ఏంటి అర్థం కాలేదు అన్నట్టు పేస్ పెట్టి బండి నడుపుతుంది స్కూటీ పాపా "నీ రేట్ ఎంత" అడిగాడు సత్తి ఆ మాటలు విన్న స్కూటీ పాపా అరికాలుకి వేసుకున్న చెప్పులు పైకెత్తి చూపింది దొబ్బెయ్ అన్నట్టు. క్రాంతి స్కూటీ పాపని క్రాస్ చేసాడు.రాజు నవ్వుకుంటూ విండో పైకి లిఫ్ట్ చేసి "ఏంటి సత్తి సడెన్ గా ఆలా అడిగావు" అన్నాడు "ఓ అన్నో అది పెద్ద యవ్వారం అన్న..తెలీడం లేదా చూస్తుంటే..ఆ నడుం దాక మల్లెపూలు,ఆ జిలుగులు చీర ఆ మేకుప్పు...ఇపుడు టైం ఎంతైందో చూడు,ఈ టైం లో స్కూటీ ఏస్కుని ఎలా బయటకి పోతుంది అది..యవ్వారం కాకుంటే ఏంది మరి" అన్నాడు ఆ స్కూటీ పాప మొహం అదోలా ఉండటం చూసి "ఏంటి దాని పేస్ హిజ్రా పేస్ కట్ లా ఉంది" అడిగాడు రవి "అరేయ్ దాన్ని చూస్తే అర్థం కాడం లేదా..హిజ్రా దాని లా కాదు..అది హిజ్రానే"..అన్నాడు రాజు నవ్వుతూ "ఉఫ్ఫ్.. "అని ఒక నిట్టూర్పు ఇచ్చాడు రవి ఆలా కొంచం దూరం పోగానే వై జంక్షన్ వొచ్చింది.జనాలు కనిపించడం మొదలుపెట్టారు.దాబాలు కనిపిస్తున్నాయి.డిన్నర్ ముంగించేసరికి నైట్ 1 :30 ఐంది తిని కార్ లో కూర్చున్నాక "ఏమంటారు మళ్ళీ పోదమా వాడి ఇంటి దగ్గరకి" అడిగాడు రాజు "హ పోయి మళ్ళీ ఒక రౌండ్ సావగొడదాం వాడి ఇంటి దగ్గర" అన్నాడు సత్తి "చాలు లే మళ్ళీ ఏం సావగొడ్తామ్" అన్నాడు రవి "అయితే వెళ్లి లాస్ట్ టైం ఒకసారి చూసి వొద్దాం వాడు ఉన్నాడో లేడో" అన్నాడు సత్తి "వొద్దులే, నువ్ ఎంత గింజుకున్నా,వాడు ఇవ్వాళా పైసలు ఇచ్చేలా లేదు.కానీ వాడికి ఒకటి అర్థమైంది.వాడు ఎక్కడున్నా మనం వాణ్ని పట్టుకుంటాం అని.అందుకే ఇన్ని రోజులు కాల్స్ లిఫ్ట్ చేయని వాడు..వాడే మనకి కాల్ చేసాడు ఇవ్వాళ" అన్నాడు రవి "హా ఎక్కడో దూరంగా ఉండే మనం, వాడి వూరు కనిపెట్టి వాడు ఉండే ఇంటి మీదకి వొచ్చి వార్నింగ్ ఇస్తామని వాడు అనుకుని ఉండడు" అన్నాడు రాజు "ఈ సారికి వొదిలెద్దాం..మళ్లీ ఫోన్స్ లిఫ్ట్ చేయకుంటే డోస్ పెంచుదాం" అన్నాడు రవి సరేనన్నటు తలూపి "ఇక పోదాం పా క్రాంతి,చాల్లే ఈడ పంచాయతీ" అన్నాడు రాజు ఎవరికి నిద్ర రాడం లేదు.కార్ ముందుకి పోతుంది.సడన్ గ ఒక బ్రిడ్జి దగ్గర స్కూటీ పాపా కనిపించింది.పక్కనే ఎవరో ఉన్నారు.ఇద్దరు మాట్లాడుకుంటున్నారు "సత్తి అదిగో నీ స్కూటీ పాపా" అని సత్తి ని అలెర్ట్ చేసాడు రాజు "అన్నాఇది పాపా కాదు హిజ్రా" అంటూ విండో కిందకి అని "హే దెబ్బా" అని గట్టిగ అరిచాడు సత్తి, ఆగి ఉన్న స్కూటీ పాపా కెళ్ళి చూస్తూ "ఔను అన్న ఇంతకీ వీడి అడ్రెస్స్ ఎలా పట్టావు నువ్వు" అడిగాడు క్రాంతి డ్రైవ్ చేస్తూ --------------------------------------------------------------------------- "ఆ చెబుతాలే గాని ముందు ఎక్కడైనా ఢాబా లాంటిది కనిపిస్తే ఆపు ఒక టీ తాగుదాం" అన్నాడు రాజు బండి హనుమాన్ జంక్షన్ దాటినాక కొన్ని దాబాలు కనిపించాయి.జనాలు ఎక్కువగా ఉన్న ఒక ఢాబా దగ్గర కార్ని పక్కకి పెట్టాడు క్రాంతి రవి కార్ దిగగానే కౌంటర్ దగ్గరికి వెళ్లి నాలుగు చాయ్ ఆర్డర్ ఇచ్చాడు ఈ లోపు మిగితా అందరు రిలాక్స్ అయ్యారు కార్ దిగి. తానొక టీ కప్ తీస్కొని,ఇంకొక టీ కప్ సత్తి చేతికి అందిస్తూ "కానిస్టేబుల్ గారు టీ తీస్కోండి సర్" అన్నాడు రవి రాజు వైపు చూసి నవ్వుతూ "అందరూ కల్సి నన్ను కానిస్టేబుల్ని చేసిన్రుగా" అంటూ సత్తి కూడా నవ్వడం మొదలుపెట్టాడు టీ తాగుతూ "క్రాంతి అంత సీరియస్ టైంలో సత్తి తోటి కామెడీ చేయించాలని ఎలా అన్పించింది నీకు " అడిగాడు రాజు "ఓ ఇవన్నీ మనకి కొత్త నా అన్నా" అన్నాడు క్రాంతి "ఉష నమ్మింది కదా సత్తిని కానిస్టేబుల్ అనగానే" అడిగాడు రవి క్రాంతిని చూస్తూ క్రాంతి నవ్వుతు టీ తాగుతున్నాడు "హా మాములుగా నమ్మలే,కానిస్టేబుల్ అనగానే ఇంట్లోకి రానివ్వలే గా అసలు" అన్నాడు రాజు "సత్తి కూడా బాగానే అందుకున్నాడు ఆ టైం లో..నాకు నవ్వొస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్న అన్నా" అన్నాడు రవి "ఏం చేస్తాం సిట్యుయేషన్ డిమాండ్ చేసింది" అంటూ టీ తాగి బిల్ కట్టాడు సత్తి. బండి స్టార్ట్ చేసాడు క్రాంతి.రాజు వైపు చూసి "ఔను అన్న ఇంతకీ వీడి అడ్రెస్స్ ఎలా పట్టావు నువ్వు" అడిగాడు క్రాంతి "వాడు ఖమ్మం వొచ్చినపుడు బస్సు స్టాండ్ దగ్గర ఉన్న కృష్ణ హోటల్ లో దిగాడు క్రాంతి" అన్నాడు రాజు "ఒహ్హ్హ్ బాగానే గుర్తుకొచ్చింది నీకు టైం కి" అన్నాడు రవి "అయితే నేను ఆ హోటల్ కి వెళ్లి,వాళ్లు సురేష్ దగ్గర నుండి తీసుకున్న ఐడి ప్రూఫ్ ఏంటి అని అడిగా" "బాగానే ఇచ్చారన్న అడగ్గానే ఆలా ఇచ్చేస్తారా హోటల్ను వాళ్ళు? నువ్ ఎవరో తెలీదు గా ఆ హోటల్ వాళ్ళకి" అడిగాడు క్రాంతి "నేనెవరో తెలీదు..అందుకే డిపార్ట్మెంట్ నుండి కాల్ చేపించా హోటల్ వాళ్ళకి" అన్నాడు రాజు "ఓహ్... ఓకే ఓకే" అన్నాడు క్రాంతి. "సచ్చినోడు హోటల్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చాడు ఐడి ప్రూఫ్ కింద,వెంటనే దొంగ దొరికాడు అనుకున్న" "ఆలా ఆ హోటల్ వాళ్ళ దగ్గర నుండి వాడి ఆధార్ కార్డ్ నంబర్ తీసుకున్న"అన్నాడు రాజు "ఆధార్ నంబర్ తీస్కొని నెక్స్ట్ ఏం చేసావ్" అడిగాడు రవి "ఆ ఆధార్ నెంబర్ తీస్కొని మన గ్రౌండ్ దగ్గర ఉన్న ఈ-సేవ సెంటర్ లో ఇచ్చి ఆ నంబర్ మీద ఉన్న ఇంటి అడ్రస్ అడిగా" "ఓహ్ ఆలా దొరికిందన్న మాట వాడి అడ్రెస్స్" అని నిట్టూర్చాడు క్రాంతి. "వాడు అస్సలు ఎక్ష్పెక్త్ చేసి ఉండడుగా నువ్ ఇలా అడ్రస్ కనుక్కుంటావని" అన్నాడు రవి "ఎహె వాడు నన్ను చాల చిరాకు పెట్టాడు రవి" "అసలు నీకోటి తెల్సా వాడు ఏమన్నాడో, మీ తెలంగాణ వాళ్ళతో బిజినెస్ చేయడం కష్టం సర్.అందరు తాగుబోతోళ్లే నమ్మలేము" అన్నాడు వాడు "ఓరిని ఇంత మాట అన్నాడా అన్నా మనల్ని"అడిగాడు రవి "హా లాస్ట్ కి.. వాడి మీద మనకి నమ్మకం లేక వాడి కోసం వెతుక్కుంటూ పోయాం" అన్నాడు రాజు "ఒహ్హ్ మొత్తానికి రివెంజ్ తీర్చుకున్నావ్" అన్నాడు సత్తి "రివెంజ్ లేదు,బొక్కా లేదు..నేను వాడితో చేసింది బిజినెస్ సత్తి.వాడు నా ఫోన్స్ లిఫ్ట్ చేసి ఉంటే ఇదంతా ఉండేది కాదు.నా పనులన్నీ మానుకుని,ఊరూరూ వెతుక్కుంటూ అక్కడ దాకా ఎందుకు పోతాం చెప్పు" అడిగాడు రాజు up date as on 27-02-2021, Raju has got 45k out of 80k.Suresh is regulary in touch with Raju ever since that incident on 13th feb 2021. 1 Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted February 27, 2021 Report Share Posted February 27, 2021 Idi real story aa kaka ? Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 28, 2021 Author Report Share Posted February 28, 2021 7 hours ago, quickgun_murugun said: Idi real story aa kaka ? aunu kaka..im one among those 4. Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted February 28, 2021 Report Share Posted February 28, 2021 Finishing touch edi kaka.. story ki ending vundali kada... please work on it... add some fiction 1 Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 28, 2021 Author Report Share Posted February 28, 2021 2 hours ago, LadiesTailor said: Finishing touch edi kaka.. story ki ending vundali kada... please work on it... add some fiction idi ika inthe kaka.i dont want to spoil it by adding fiction. all that story happened in 5-6 hours of time span and andulo nenu kooda okanni.so dhaniki oka artificial ending ivvalanii ledhu kaka. inko story meeda working.thats purely fiction.choodham dhanni emina entertaining ga ivvagalano ledo 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted February 28, 2021 Report Share Posted February 28, 2021 narration baagundhi bro...try some fictional story next time...with some novel point.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 28, 2021 Author Report Share Posted February 28, 2021 2 minutes ago, dasari4kntr said: narration baagundhi bro...try some fictional story next time...with some novel point.. yeah bro..basic plot form chesthunna first ..choodham where it will lead me to Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 28, 2021 Report Share Posted February 28, 2021 I will read this for you @kalaa_pipaasi bro . 1 Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 28, 2021 Author Report Share Posted February 28, 2021 6 minutes ago, Amrita said: I will read this for you @kalaa_pipaasi bro . sadhuvu akkoii.. but thammudu rasadu ane feeling tho kakunda unbiased ga cheppu ne review ekkada baledho Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 28, 2021 Report Share Posted February 28, 2021 10 minutes ago, kalaa_pipaasi said: sadhuvu akkoii.. but thammudu rasadu ane feeling tho kakunda unbiased ga cheppu ne review ekkada baledho Sure.. already people told it’s good kada . Cheptanu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.