Jump to content

సింహం సింగిల్‌గానే వస్తోంది: షర్మిల


Somedude

Recommended Posts

సింహం సింగిల్‌గానే వస్తోంది: షర్మిల

వైఎస్‌ జయంతి రోజు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు వెల్లడి

090421sharmila-brk1a.jpg

ఖమ్మం: తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలని సంకల్పిస్తున్నామని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచేందుకు రాజకీయాల్లో తన తొలి అడుగు వేస్తున్నానని.. రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారు. వైఎస్‌ జయంతి (జులై 8)నాడు పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నట్టు ఆమె స్పష్టంచేశారు. ఖమ్మంలోని పెవిలియన్‌ మైదానంలో నిర్వహించిన ‘సంకల్ప సభ’లో షర్మిల మాట్లాడారు. సరిగ్గా ఇదే రోజున సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైందని గుర్తుచేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన్ను తిరిగి ప్రతిష్ఠించబోతున్నామని చెప్పారు. 

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు

రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి పార్టీ ఏర్పాటు అవసరమని షర్మిల చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదనేది అక్షర సత్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలమంది అమరులయ్యారని.. వారందరికీ తన జోహార్లని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరని షర్మిల ప్రశ్నించారు.  కేసీఆర్‌ హయాంలో కొత్త రేషన్‌ కార్డు ఒక్కటీ ఇవ్వలేదని.. కొత్త పింఛనూ లేదని ఆమె ఆరోపించారు. పేదలకు భూములు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కేసీఆర్ చెప్పారని.. అది ఏమైంది సీఎం సారూ? ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని షర్మిల ఆరోపించారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు అడిగితే సుగంధ ద్రవ్యాల బోర్డు ఇచ్చారని.. తాటాకు అడిగితే.. ఈత ఆకు ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు.

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణాన్ని..

‘‘రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. అన్నీ ఒక తాను ముక్కలే. నువ్వు కొట్టినట్లు చెయ్యి‌.. నేను ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుంది వారి పరిస్థితి. జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా. మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు. ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం’’ అని పిలుపునిచ్చారు.  

ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే!

ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా తాను తెలంగాణ బిడ్డనే అని షర్మిల చెప్పారు. ఈ గడ్డమీదే బతికానని.. ఇక్కడి నీరే తాగానన్నారు. తన కుమారుడు, కుమార్తెను తెలంగాణ గడ్డపైనే కన్నానని చెప్పారు. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్‌ తెలంగాణ కోసం నిలబడతా అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో వద్దో వాళ్లే నిర్ణయిస్తారన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Somedude

    11

  • futureofandhra

    7

  • bhaigan

    5

  • MiryalgudaMaruthiRao

    3

45 minutes ago, Somedude said:

 

Ee speech mathram keka

matta lekke undi idi deeni script..ee gadda meede kanna..ee gadda meede tinna..ee gadda meede vella..ee gadda meede kadukunna..endira ayya idi..idi ee anglelo TG bidda ayindi?

Link to comment
Share on other sites

NTR name vadukoni oka party ,  inka YSR name vadukoni inkokati.   janam meeda ee rod rudhudu ento.  

emi vundi le , next elections lo anni free schemes pedithe konni seats vastayi emo. 

asal  telagana ki strong opposite ee YSR.  ayina lekunte TG inka munde vachedi

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...